హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్ ప్రధాన పరీక్షలు సజావుగా ముగిశాయి. మంగళవారం చివరిరోజు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా, 22,103 మంది విద్యార్థులు డుమ్మాకొట్టారు. నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. 4,96,949 మంది విద్యార్థులకుగాను 4,74,846 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.