e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home తెలంగాణ ఖానాపూర్‌ ఎమ్మెల్యేకు పితృవియోగం

ఖానాపూర్‌ ఎమ్మెల్యేకు పితృవియోగం

ఖానాపూర్‌ ఎమ్మెల్యేకు పితృవియోగం
  • సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 17(నమస్తే తెలంగాణ)/ఖానాపూర్‌ టౌన్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ తండ్రి శంకర్‌నాయక్‌ (74) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో తుదిశ్వాస విడిచారు. శంకర్‌నాయక్‌ అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే నిర్వహించారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం

ఎమ్మెల్యే రేఖానాయక్‌ తండ్రి శంకర్‌నాయక్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. రేఖానాయక్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శంకర్‌నాయక్‌ మృతికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మంత్రులు టీ హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తదితరులు కూడా సంతాపం తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఖానాపూర్‌ ఎమ్మెల్యేకు పితృవియోగం
ఖానాపూర్‌ ఎమ్మెల్యేకు పితృవియోగం
ఖానాపూర్‌ ఎమ్మెల్యేకు పితృవియోగం

ట్రెండింగ్‌

Advertisement