e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home Telangana పర్యాటకంపై ప్రత్యేక దృష్టి

పర్యాటకంపై ప్రత్యేక దృష్టి

పర్యాటకంపై ప్రత్యేక దృష్టి

తెలంగాణలో సాంస్కృతిక వికాసానికి, క్రీడారంగ అభివృద్ధికి, పర్యాటక రంగాభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కళాకారులకు వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందచేసింది. ప్రతిభ కలిగిన కళాకారులు, క్రీడాకారులు విదేశాలకు వెళ్లే సందర్భంలో కూడా ప్రభుత్వమే ఖర్చులు భరిస్తున్నది. అంతర్జాతీయ పోటీల్లో విజేతలకు ప్రోత్సాకాలు అందజేస్తున్నది. టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను ప్రభుత్వ అంబాసిడర్ గా పెట్టుకుని క్రీడాకారుల పట్ల అభిమానాన్ని చాటుకున్నది.

 1. తెలంగాణ సాంస్కృతిక సారథి

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక కళాకారులకు గుర్తింపును ఉపాధిని కల్పించేదుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులోభాగంగా 550 మంది కళాకారులతో తెలంగాణ సాంస్కృతిక సారథిని 2014 సెప్టెంబర్ 30న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారికి ప్రభుత్వ ఖజానా ద్వారా జీతాలు అందజేసింది.ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా కళారూపాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూర్ ఎమ్మెల్యే, ప్రముఖ కళాకారుడు ఏర్పుల (రసమయి) బాలకిషన్ ను ప్రభుత్వం నియమించింది. సాంస్కృతిక సారథికి క్యాబినెట్ హోదా కల్పించారు.ప్రజాహిత కార్యక్రమాలను అట్టడుగుస్థాయి వరకు, గ్రామ గ్రామానికి చేరవేసేలా ఈ పథకం పనిచేస్తున్నది.  జూబ్లిహిల్స్ లోని సాంస్కృతిక శాఖ భవనాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 550 మంది కళాకారులకు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది.వారిలో 319 మంది ఎస్సీలు, 38 మంది ఎస్టీలున్నారు.

వీరు  కళాబృందాలుగా ఏర్పడి సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా  ప్రచారం చేస్తున్నారు. కళా ప్రదర్శనలకు అనువైన శిక్షణనివ్వడానికి, వర్క్ షాపులునిర్వహించడానికి సాంస్కృతిక సారథి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నది.

తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు

తెలంగాణ సంస్కృతీ, సాహిత్య రంగాలను పరిరక్షించడంలో భాగంగా ‘తెలంగాణ సాహిత్య అకాడమీని’ ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్‌గా ప్రముఖ కవి, నందిని సిధారెడ్డిని నియమించింది. ఈ మేరకు2017 మే 2న ఉత్తర్వులు జారీ అయ్యాయి. వర్ధమాన కవులు, రచయితలు ఎదిగేందుకు, తగిన గుర్తింపు దక్కేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ చేయూత నిస్తుంది. ఈ అకాడమీ హైదరాబాద్‌లో 2017 అక్టోబర్ 22 నుంచి 28 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించింది.

 • చలన చిత్ర పురస్కారాలకు తెలంగాణ పేరు

ఉమ్మడి రాష్ట్రంలో చలనచిత్ర పురస్కారాలకు నంది పేరు ఉండగా దానిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పేరు కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పలు దఫాలు సమావేశమైన కమిటీ 2016నవంబర్ లో వీటన్నింటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బహుకరించనున్న చలన చిత్ర పురస్కారాలకు తెలంగాణ పేరు పెట్టాలని నిర్ణయించింది. తెలంగాణకు చెందిన చలన చిత్ర ప్రముఖులు పైడి జయరాజు, కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి, దాశరథి, చక్రిల పేరిట అవార్డులు ఇవ్వాలని సూచించింది. గతంలో ఏపీతో కలిపి చలనచిత్ర పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ కమిటీ భావించింది. ఏపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తరఫునే పురస్కారం ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.

సినిమా షూటింగులకు సింగిల్ విండో అనుమతి

సులభ వాణిజ్య విధానం తరహాలో రాష్ట్రంలో సినిమాలు, సీరియళ్లు, ఇతర షూటింగులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  షూటింగుల కోసం వివిధశాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకుంటే రెడ్, ఎల్లో, గ్రీన్ అనే మూడు కేటగిరీల్లో అనుమతులు ఇవ్వాలని సమాచార, పౌర సంబంధాల శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రెడ్ జోన్లో అభయారణ్యాలు, పులుల అభయారణ్యాలు, జాతీయ పార్కులు ఉంటాయి కాబట్టి షూటింగులను అనుమతించరు. ఎల్లో జోన్ లో రిజర్వు ఫారెస్టులున్నందున కఠినమైన నిబంధనలతో, గ్రీన్ జోన్ లో జూ పార్కులు, అర్బన్ పార్కులున్నందున వాటిలో షూటింగులకు సరళతరమైన ఆంక్షలతో అనుమతులు ఇస్తారు.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్– సినిమా పరిశ్రమ అభివృద్ధి, కళాకారుల సంక్షేమం పై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి – (10.2.2020)

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం శంషాబాద్‌ పరిసరాల్లో అవసరమైన స్థలాన్ని సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు10 ఫిబ్రవరి 2020న  జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సీనియర్‌ హీరోలు చిరంజీవి, నాగార్జున, రెవెన్యూ, హోం, న్యాయ తదితరశాఖల అధికారులతో మంత్రిసమావేశమయ్యారు.సినీ, టీవీ కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం పదెకరాలు, కల్చరల్‌ సెంటర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కోసం అవసరమైన స్థలాలను సేకరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. సింగిల్‌ విండో విధానం ద్వారా షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడంతోపాటు ఎఫ్‌డీసీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులను అందించేలా చర్యలు చేపడుతామని చెప్పారు.

అంతర్జాతీయస్థాయిలోసినిమాసిటీ ( తేదీ 7.11.2020)

హైదరాబాద్నగరశివార్లలోఅంతర్జాతీయస్థాయిలోసినిమాసిటీనిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాలస్థలాన్నికేటాయిస్తామనిముఖ్యమంత్రికె.చంద్రశేఖర్రావుప్రకటించారు. సినీప్రముఖులు, అధికారులబృందంబల్గేరియావెల్లిఅక్కడిసినిమాసిటీనిపరిశీలించిరావాలని, సినిమాసిటీఆఫ్హైదరాబాద్నిర్మాణానికిప్రతిపాదనలురూపొందించాలనిసిఎంకేసీఆర్అధికారులనుఆదేశించారు. అన్లాక్ప్రక్రియప్రారంభమయినందునసినిమాషూటింగులు, సినిమాథియేటర్లుపునఃప్రారంభించవచ్చనిసిఎంప్రకటించారు.

సినీరంగప్రముఖులుచిరంజీవి, నాగార్జున 2020 నవంబర్ 7నప్రగతిభవన్లోసిఎంనుకలిశారు. ఈసందర్భంగాతెలంగాణలోసినిమాపరిశ్రమఅభివృద్ధి- విస్తరణపైచర్చజరిగింది.

‘హైదరాబాద్లోసినీపరిశ్రమఅభివృద్ధి- విస్తరణకుపుష్కలమైనఅవకాశాలున్నాయి. హైదరాబాద్నగరంకాస్మోపాలిటన్సిటీ. దేశంలోనివివిధప్రాంతాలకుచెందినవారు, వివిధభాషలకుచెందినవారుఇక్కడస్థిరనివాసంఏర్పాటుచేసుకున్నారు. ఎవరినైనాఒడిలోచేర్చుకునేగుణంఉంది. షూటింగులతోసహాసినిమానిర్మాణానికిసంబంధించినఅన్నిప్రక్రియలనుచాలాసౌకర్యవంతంగానిర్వహించుకునేవీలుంది. ఇప్పుడున్నవాతావరణానికితోడుప్రభుత్వంసినిమాసిటీఆఫ్హైదరాబాద్నిర్మించాలనేతలంపుతోఉంది. ప్రభుత్వం 1500-2000 ఎకరాలస్థలాన్నిసేకరించిఇస్తుంది. అందులోఅధునాతనసాంకేతికనైపుణ్యంతో, భవిష్యత్తుఅవసరాలకుతగ్గట్టుఅంతర్జాతీయస్థాయిలోస్టూడియోలునిర్మించుకునేందుకుసినిమానిర్మాణసంస్థలకుస్థలంకేటాయిస్తుంది. ఎయిర్స్ట్రిప్తోపాటుఅన్నిరకాలమౌలికసదుపాయాలనుప్రభుత్వంకల్పిస్తుంది’’అనిముఖ్యమంత్రిచెప్పారు.

 • తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఉస్మానియా వర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉస్మానియా ఒకటి. ఈ విద్యాలయం ప్రారంభమై వందేళ్లవుతున్న సందర్భంగా ఘనంగా శతాబ్ది ఉత్సవాలను 2017 ఏప్రిల్ 26 నుండి 28 వరకు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఓయూ శతాబ్ధి ఉత్సవాలకు ప్రభుత్వం 2017-18 బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించింది. 
 • తెలుగు భాషను తెలంగాణకు దూరంచేసే కుట్రలను తిప్పికొట్టడమే కాకుండా..అసలు తెలుగంటే తెలంగాణ దే అనే విషయాన్ని ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ మహా సభలు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా సాగాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మార్గదర్శకత్వంలో నడిచిన ఈ మహాసభల్లో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు భాషాభిమానులు కవులు రచయితలు పాల్గొన్నారు. ఆద్యంతం మహాద్భుతంగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రపంచానికి చాటినాయి. హైదరాబాద్ నగరంలో  డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగానిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. మహాసభల నిర్వహణకు సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేసింది. మహాసభల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాహిత్య అకాడమీ, అందులోని ప్రధాన కమిటీతోపాటు ప్రజాప్రతినిధులు తీసుకున్నారు.
 • మంత్రులందరూ ఏదో ఒక సదస్సులో పాల్గొన్నారు. నిర్వాహక కమిటీ, సాంస్కృతిక శాఖ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో వ్యవహరించి ఉత్సవాలను విజయవంతం చేశాయి. అయిదు రోజుల సాహిత్య యజ్ఞంతో రాజధాని పులకరించింది. కవులు, రచయితలు, సాహితీవేత్తలు, చరిత్రకారులు, కళాకారులతో ప్రాంగణాలు కళకళలాడాయి. చర్చలు, గోష్ఠులు, సమ్మేళనాలు, అవధానాలు, సమావేశాలు భాషాభిమానుల్లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. తెలుగును కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటుతూ నిర్వహించిన కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభాధ్యక్షతన ప్రారంభ ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొనడంతో మహాసభలకు నిండుదనం వచ్చింది. ఈ మహాసభలకు 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, 42 దేశాలు, తెలంగాణలోని 33జిల్లాల నుంచి 8వేల మంది ప్రతినిధులు పేర్లను నమోదు చేశారు. రోజూ 20 చొప్పున జరిగిన సదస్సులకు భాషాభిమానులు వెల్లువెత్తారు. సినిమా, రాజకీయ సభలను మించిన రీతిలో సాహిత్య ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. రోజూ ఎల్బీ క్రీడా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలకు భారీగా జనం తరలివచ్చారు.

ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్

మాతృభాష అయిన తెలుగును రక్షించుకోవడం, మన సంస్కృతిని కాపాడుకోవడం లక్ష్యంగా తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో తెలుగును సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ విధానం అమలు చేయడం కోసం 2018-19 అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే చట్టం తేనున్నారు. మాతృభాష బోధన అమలుకు సంబంధించిన తమిళనాడులోని విధానాన్ని అధ్యయనం చేయడానికి తెలంగాణ అధికారుల బృందం అక్కడకు వెళ్లివచ్చింది. ఆ బృందంతో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, తేదీ. 2018 ఏప్రిల్ 2న ఉత్తర్వులు వెలువడ్డాయి.

మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లీషు మీడియంలో చదవడం అందరికీ అనివార్యమవుతున్నది. కనుక పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని, అదే క్రమంలో తెలుగు కనుమరుగు కాకుండ, ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెట్టింది. మొదట ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించారు. అయితే ఇంటర్మీడియట్ (10+2) అన్ని విద్యాసంస్థల్లో ఒకే మాదిరిగా లేదు. ఇంటర్మీడియట్ లో తెలుగును అమలు చేయడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. తమిళనాడు, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మాతృభాష బోధన అమలును పరిశీలించిన అనంతరం మొదటి దశలో పదవ తరగతి వరకు తెలంగాణలో తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉప్పల్ భగాయత్ లో శిల్పారామం ప్రారంభం

హైదరాబాద్ నగర ప్రజలకు పల్లె అందాలను, అనుభూతిని పంచేందుకు ప్రభుత్వం మరో శిల్పారామాన్ని సిద్ధంచేసింది. హస్తకళలు, చేనేత వస్ర్తాలకు నిలయంగా హెచ్‌ఎండీఏకు చెందిన ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లో ఈ మినీ శిల్పారామాన్ని ఏడున్నర ఎకరాల స్థలంలో, రూ.5 కోట్లతో నిర్మించారు. 22 జూన్, 2019న దీన్ని ప్రారంభించారు. మాదాపూర్‌లో శిల్పారామం తరహాలోనే హస్తకళలు, చేనేత వస్ర్తాల కోసం 50 స్టాళ్లను ఏర్పాటుచేశారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, పెద్దలు సేదతీరడానికి పచ్చని మైదానం, చూపరులను ఆకట్టుకొనే రీతిలో శిల్పారామం ఆర్చిని ఏర్పాటుచేసి, ఫౌంటేన్‌ను నిర్మించారు. విభిన్న రుచులతో ఫుడ్‌కోర్టు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు యాంఫీ థియేటర్‌ను, వెదురు బొంగులతో ఆకర్శణీయంగా స్టాళ్లు నిర్మించారు.

తెలంగాణ ఆలయాల అభివృద్ధి

ఎన్నో పోరాటాలుచేసి సాధించుకున్న తెలంగాణలో స్వీయ ఆధ్యాత్మిక అస్తిత్వమూ అవసరమేనని భావించిన సీఎం కేసీఆర్ పుణ్యక్షేత్రాల పునురుద్ధరణకు పూనుకున్నారు.  ఈ క్రమంలో లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరి గుట్టను (యాదాద్రి) ప్రభుత్వం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దుతున్నది. అలాగే వేములవాడ భద్రాద్రి కొమురవెల్లి మల్లన్న కురవి వీరన్న తదితర పుణ్యక్షేత్రాలు నాగార్జునకొండ వంటి బౌద్దారామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ కింద 2018-19 బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించింది. 2020-21 లో దేవాలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించారు.

సుందర పుణ్యక్షేత్రంగా యాదాద్రి

ప్రసిద్ధపుణ్యక్షేత్రమైనయాదగిరిగుట్ట సమైఖ్య రాష్ట్రంలో తగినంత అభివృద్ధికి నోచుకోలేదు. అవసరమైనన్ని నిధులు కేటాయించేవారు కాదు. దేశనలుమూలల నుండి భక్తులు తరలివచ్చేవారు. అటువంటి భక్తులకు సరైనటువంటి సదుపాయాలు కూడా కల్పించలేదు. లక్షల్లో వచ్చే భక్తులకోసం సరైనటువంటి వసతి, రవాణా సౌకర్యాలు ఉండేవికావు. వాహనాల పార్కింగుకు అవసరమైనంత స్థలం ఉండేది కాదు. ఇలా అన్నివిధాలుగా తెలంగాణ తిరుమలగా భావించే యాదగిరి గుట్టకు సమైఖ్యపాలకులు తగినంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీర్ యాదాద్రి అభివృద్ధికి పూనుకున్నారు. యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టారు. యాదగిరి గుట్ట అభివృద్ధి, పునర్నిర్మాణాన్ని రూ.1200 కోట్లతో చేపట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతీ బడ్జెట్లో అధిక నిధులను కేటాయిస్తూ వస్తున్నది. ఆలయం మొత్తాన్ని పునర్నిర్మించటం, విశాలమైన రోడ్ల నిర్మాణాలు, విశాలమైన వసతి గృహాలు వంటి పనులను చేపట్టింది. సుందరపుణ్యక్షేత్రంగా, ఒక టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. పార్కులు, వేల సంఖ్యలో వచ్చేవాహనాల పార్కింగ్ కోసం ఎటువంటి ఇబ్బంది కలగకుండా విశాలంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు.

సెప్టెంర్ 2020 నాటికి దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాక సీఎం కేసీఆర్‌ గుడిని 13 సార్లు సందర్శించారు.పునర్నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా అయ్యేవిధంగా అధికారులను ఆదేశిస్తూ.. అవసరమైనన్ని నిధులను మంజూరు చేస్తున్నారు.ప్రధానఆలయమున్నగుట్టపైనా, టెంపుల్సిటీగాఅభివృద్ధిచేస్తున్నగుట్టపైనా, ప్రెసిడెన్షియల్సూట్నిర్మిస్తున్నగుట్టపైనాజరుగుతున్ననిర్మాణాలనుముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ద్వారాఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఆధ్యాత్మికతఉట్టిపడేలా, అద్భుతఆలయశిల్పకళానైపుణ్యంతో, ఆలయప్రాశస్త్యం, వైభవంప్రస్ఫుటమయ్యేలాయాదాద్రిపునరుద్ధరణపనులుజరుగుతున్నాయి. దాదాపు పూర్తికావచ్చాయి.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు :

365 వసతి గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. మరో 200 ఎకరాల్లో కాటేజీలను నిర్మించాలని నిర్ణయించారు. 5 వేల కార్లు, 10 వేల బైకులను నిలిపేలా పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు.యాదాద్రిలో సత్యనారాయణస్వామి వ్రతాలుచేయడం ప్రసిద్ధి కావటంతో ఒకేసారి నాలుగువేల మంది వ్రతంచేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా రామలింగేశ్వరాలయం, అండాళ్‌ అమ్మవారు, గరుత్మంతుడు, ఆలయ ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశారు. ఆలయం ఆసాంతం బంగారం, వెండి ధగధగలతో మెరుస్తూ ఉండే విధంగా, ఆలయ రాజగోపురం ప్రధాన ద్వారాలకు బంగారు తాపడంచేసేందుకు నిపుణులైన స్వర్ణకారులను పిలిపిస్తున్నారు. ఆలయంలో అద్దాల మంటపం ఏర్పాటు చేశారు.ఆలయం మొత్తం విద్యుద్దీపాల అలంకరణతో మెరిసేలా నూతన లైటింగ్‌ విధానాన్ని చేపట్టారు. నర్సింహస్వామి దర్శనానికి వెళ్లే క్యూలైన్లు, కల్యాణమంటపం, ఆలయం నుంచి లోపలికి, బయటకు వెళ్లే ద్వారాలు, రామానుజుల ఆలయాలు, అళ్వార్‌స్వాముల విగ్రహాలు, ఆలయం ప్రధానద్వారం, ఆలయం చుట్టూ ఏర్పాటుచేసే ఫ్లోరింగ్‌, టెంపుల్‌ సిటీ, నరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం రోజున ఆలయం చుట్టూ భక్తులు చేసే గిరిప్రదక్షిణ దారిలో చేపడుతున్న రోడ్లు, ఆ మార్గంలో ఇతర నిర్మాణ పనులు అన్నీ వేగంగా జరుగుతున్నాయి.వైటిడిఏఆద్వర్యంలోగుట్టపైన, దిగువనపరిసరప్రాంతాల్లోమొత్తం 1900 ఎకరాలభూమినిసేకరించారు.ఈభూమిలోప్రభుత్వనిధులతోఅభివృద్ధిపనులనుచేపట్టారు.

ప్రధాన గుట్ట పైభాగంలోని నిర్మాణాలు

మాడవీధులు, ప్రాకారాలుకలుపుకొని 4.5 ఎకరాలవిస్తీర్ణంలోప్రధానదేవాలయంనిర్మిస్తున్నారు.లక్ష్మీనర్సింహస్వామికొలువైఉండేగుట్టపైభాగంలోప్రధానదేవాలయంతోపాటుగోపురాలు, ప్రాకారాలు, మాడవీధులు, శివాలయం, ఆంజనేయస్వామివిగ్రహం, ఇ.వో.కార్యాలయం, వివిఐపిగెస్ట్హౌజు(ప్రెసిడెన్షియల్సూట్), అర్చకనిలయం, నైవేధ్యంవంటశాల, ప్రసాదమంటపం, రథశాల, వ్రతమంటపం, స్వామిపుష్కరిణి, క్యూకాంప్లెక్స్, మెట్లదారి, బస్టాప్, పోలీస్ఔట్పోస్టు, హెల్త్సెంటర్లుండాలనినిర్ణయించారు. ఏనిర్మాణంఎక్కడరావాలనేదానిపైతుదినిర్ణయంతీసుకున్నారు.

యాదగిరి గుట్టకింది భాగంలోని నిర్మాణాలు

మొత్తం 302 ఎకరాలవిస్తీర్ణంలోదేవాలయప్రాంగణంనిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుట్టకిందిభాగంలోగండిచెరువునుతెప్పోత్సవంనిర్వహించడానికిఅనువుగాసుందరంగాతీర్చిదిద్దనున్నారు. బస్వాపూర్రిజర్వాయర్నుంచినిత్యంఈచెరువుకునీటిసరఫరాచేయనున్నారు. గండిచెరువుకుఅనుబంధంగాకోనేరు, కళ్యాణకట్టనిర్మించాలని నిర్ణయించారు. గుట్టకిందభాగంలోనేఆలయబస్టాండ్నిర్మించి, అక్కడినుంచిభక్తులనుదేవాలయవాహనాలద్వారాగుట్టపైకితీసుకువెల్లేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టపైకివెళ్లి, రావడానికివేర్వేరుదారులుఉపయోగిస్తారు. గుట్టకిందమండలదీక్షచేపట్టినభక్తులకోసంఆశ్రమంనిర్మించనున్నారు. యాదాద్రిఆలయంచుట్టూరింగురోడ్డునిర్మించి, దానికిఅనుబంధంగారేడియల్రోడ్లనిర్మాణంచేపట్టాలని నిర్ణయించారు. యాదాద్రినుంచితుర్కపల్లికినాలుగులేన్లరోడ్లువేయనున్నారు. టెంపుల్సిటీలోరోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజిలాంటికనీసవసతులుకోసం నిర్మాణాలు జరుగుతున్నాయి.యాదాద్రిలోనిప్రతీబ్లాకుకుదేవుళ్లు, దేవతలపేర్లుపెట్టాలని నిర్ణయించారు. యాదాద్రిటెంపుల్సిటీఅంతాప్రకృతిరమణీయతగోచరించేలా, ఆహ్లాదంవెల్లివిరిసేలాఉద్యానవనాలు, ఫౌంటేన్లునిర్మిస్తున్నారు.

రెండు గుట్టలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు

ప్రధానఆలయమున్నప్రాంతంలో 173 ఎకరాల్లోపనులు జరుగుతున్నాయి. టెంపుల్సిటీగాఅభివృద్ధిపరుస్తున్నగుట్టను, ప్రధాన ఆలయమున్న గుట్టనుకవర్చేస్తూఔటర్రింగురోడ్డునిర్మించనున్నారు.పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతున్నపనులన్నింటినీసమాంతరంగాచేస్తున్నారు.

అన్నదాన సత్రానికి విరాళం

యాదాద్రిలోఅన్నదానసత్రంనిర్మించడంకోసంహైదరాబాద్, విశాఖపట్నంనగరాల్లోపలుస్వచ్ఛందకార్యక్రమాలునిర్వహిస్తున్నరాజువెగెస్నా (Raju vegesna) ఫౌండేషన్సభ్యులుముఖ్యమంత్రికేసీఆర్కురూ.10 కోట్లవిరాళంఅందించారు. యాదాద్రిలోసత్రాలు, గెస్టుహౌజులునిర్మించడానికిచాలామందిదాతలుముందుకువస్తున్నారు.

పెరిగే భక్తుల సంఖ్యకు అనుగుణంగా నిర్మాణాలు

పునరుద్ధరణతర్వాతయాదాద్రికిభక్తులసంఖ్యఎన్నోరెట్లుపెరగనుంది. దానికిఅనుగుణంగాఏర్పాట్లుచేస్తున్నారు. శివరాత్రిఉత్సవాలు, తెప్పోత్సవంనిర్వహించడానికి, నిరంతరంవ్రతాలుచేసుకోవడానికి, తలనీలాలసమర్పణకు, మండలదీక్షభక్తులుప్రత్యేకపూజలుచేసుకోవడానికికావాల్సినఏర్పాట్లుశాశ్వతప్రాతిపదికనచేస్తున్నారు.

సహస్ర్రాష్టకకుండయాగం

పునరుద్ధరణపనులన్నీపూర్తయినతర్వాతసహస్ర్రాష్టకకుండయాగం (1008 యాగకుండాలతో) 11 రోజులపాటుమహాయాగంనిర్వహించనున్నట్లుముఖ్యమంత్రివెల్లడించారు. ఈకార్యక్రమానికిరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, వివిధరాష్ట్రాలముఖ్యమంత్రులు, గవర్నర్లనుఆహ్వానిస్తారు. లక్షలాదిమందిభక్తులుపాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులుభసచేయడానికివీలుగాటెంపుల్సిటీలో 340 క్వార్టర్లనిర్మాణపనులువేగంగాజరుగుతున్నాయి.

యాదాద్రి మున్సిపాలిటీగా మార్పు

పెరిగినజనాభాతోపాటు,  భవిష్యత్తులోమరింతవిస్తరించేఅవకాశంవున్నయాదగిరిగుట్టగ్రామాన్నిమునిసిపాలిటీగామారుస్తూప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీగామారినప్పటికీయాదాద్రిటెంపుల్డెవలప్మెంట్అథారిటీఆధ్వర్యంలోనే, వారిప్రణాళికకుఅనుగుణంగానేపట్టణంలోపనులుజరుగుతాయనిప్రభుత్వంప్రకటించింది.

విద్యుత్సౌకర్యం

యాదాద్రి, టెంపుల్సిటీపూర్తిస్థాయిలోనిర్మాణంజరిగినతరువాతవిద్యుత్వినియోగంకూడాఎక్కువైంది. దీనికిఅనుగుణంగా 132/11 కె.విసబ్స్టేషన్., రెండు 33/11 కెవి. సబ్స్టేషన్లనుప్రభుత్వంమంజూరుచేసింది. ప్రస్తుతంవీటినిర్మాణపనులుపురోగతిలోఉన్నాయి.   యాదాద్రిలోరెప్పపాటుకూడాకరెంట్పోకుండాఅధికారులుఅన్నిజాగ్రత్తలుతీసుకుంటున్నారు.

మంచి నీటి సౌకర్యం

యాదగిరిగుట్టస్థానికప్రజలకు, ఇటుభక్తులకు, మరోవైపుఆలయఅవసరాలకోసంప్రతిరోజూ10 లక్షలలీటర్లమంచినీటినిమిషన్భగీరథపథకంద్వారాఅందిస్తున్నారు. 

యాదాద్రి పీహెచ్సీఆధునీకరణ

యాదాద్రిలోప్రస్తుతంవున్నపి.హెచ్.సి.నిఅన్నిహంగులతో, మరిన్నివసతులతోఆధునీకరిస్తున్నారు.

యాదాద్రి క్షేత్రంలో క్యూ కాంప్లెక్స్

యాదాద్రి క్షేత్రంలో స్వామివారి దర్శనానికి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు వైటీడీఏ ప్లాన్ రూపొందిస్తున్నది. ఈ క్యూ కాంప్లెక్సుల్లో సీటింగ్ ఏర్పాట్లతోపాటు భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా ఎస్కలేటర్ ఏర్పాటు చేయనున్నారు.

 • దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 18 న సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి కావలసిన సహాయము ప్రకటించి 2015-16 కు గాను రూ. 1.00 కోటి మరియు 2016-17 కు రూ.50.00 కోట్లు మొత్తం రూ.51 కోట్లు విడుదల చేశారు. 2017-18 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్లో వేములవాడ డెవలప్ మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు కేటాయించారు.దేవాలయం చుట్టూ 1,200 మీటర్ల మేర మూడు నాలుగు అంతస్థుల భవనాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. శివరాత్రి రోజున దేవుడి కళ్యాణం కోసం మినీ స్టేడియం కట్టాలని, ట్యాంక్ బండ్ తరహాలో చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటు చేయాలని, దేవుడి గుడి స్థలాన్ని అభివృద్ధి పనులకు వినియోగించాలని, మరో 25 నుంచి 30 ఎకరాల స్థలం సేకరించి చెరువును నిర్మించాలని నిర్ణయించారు. శృంగేరి పీఠం సహకారంతో వేములవాడలో సంస్కృత, వేద పాఠశాలల ఏర్పాటు చేయనున్నారు. అలాగే, సిరిసిల్ల-వేములవాడకు నాలుగు లైన్ల రహదారి పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

భద్రాద్రికి కొత్తశోభ

భద్రాచలం ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్రుడిపై ప్రజలకున్న భక్తిభావం ప్రకారం.. భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే       ఒక అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఖర్చుకు వెనుకాడకుండా భద్రాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యవైభవ క్షేత్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పరమహంస పరివ్రాజకులు, త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామీజీ సూచనల ప్రకారం ఆలయ శిల్పి ఆనందసాయి బృందం రూపొందించిన దేవాలయ అభివృద్ధి నమూనాలను సీఎం పరిశీలించారు. దేవాలయానికి ఉత్తరం, పడమర దిక్కున ఉన్న స్థలాలతో కలిపి 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధిచే యాలని సూచించారు. మూలవిరాట్టు కొలువై ఉన్న గర్భగుడి, చారిత్రాత్మక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంగల కట్టడాలకు ఆటంకం కలుగకుండా నిర్మాణాలను చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే, కొత్తగూడెం-భద్రాచలం మధ్య విమానాశ్రయం నిర్మిస్తున్నారు. కొత్తగూడెం వరకు ఉన్న రైలు మార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించే ప్రతిపాదనలను రైల్వేశాఖకు పంపించారు. గోదావరి, ప్రాణహిత నదుల వెంట రహదారిని నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రోడ్డు సౌకర్యం కలుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను కలిపేలా రహదారులను నిర్మిస్తున్నారు. గోదావరి నదిపై మరో వంతెన నిర్మిస్తున్నారు. గోదావరి నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు కూడా నిర్మాణంలో ఉన్నాయి. యాత్రికులు పడవ ప్రయాణం కూడా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2018-19 బడ్జెట్ లో భద్రాద్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు.భద్రాద్రిని ఇంటిగ్రేటెడ్ టౌన్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాయగిరిరైల్వేస్టేషన్పేరుయాదాద్రిస్టేషన్గామార్పు

తెలంగాణలోప్రసిద్ధపుణ్యక్షేత్రమైనయాదాద్రికిఅతిసమీపంలోఉండేరాయగిరిరైల్వేస్టేషన్‌పేరునుయాదాద్రిగారైల్వేస్టేషన్గాకేంద్రరైల్వేశాఖమార్చింది. ఇకమీదటఆరైల్వేస్టేషన్పేరునుయాదాద్రిరైల్వేస్టేషన్‌గాపిలవనున్నారు. ముఖ్యమంత్రికేసీఆర్కోరికమేరకుఈస్టేషన్పేరునుమార్చుతూకేంద్రప్రభుత్వంఈనిర్ణయంతీసుకున్నది. ఈమార్పు 18 సెప్టెంబరు, 2020 నుంచిఅమల్లోకివచ్చింది. యాదాద్రికి 5 కిలోమీటర్లదూరంలోరాయగిరిరైల్వేస్టేషన్‌ఉంది. ఈస్టేషన్‌కుయాదాద్రిఅనిపేరుపెట్టాలనేడిమాండ్చాలాకాలంనుంచిఉంది.

 1. కొమురవెల్లి మల్లన్న దేవాలయం అభివృద్ధి

కొమురవెల్లి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ క్రమంలో ఇందుకోసం ప్రభుత్వం 164 ఎకరాలు కేటాయించింది. ఆ స్థలాల్లో భక్తులకు అవసరమైన కాటేజీలు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. 

 1. రూ.1 కోటితో ఐనవోలు మల్లికార్జున ఆలయ అభివృద్ధి

వరంగల్ అర్బన్ జిల్లాలోని చారిత్రక ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేసింది.

 1. కాళేశ్వరం ఆలయ అభివృద్దికి రూ.100 కోట్లు

రూ.100 కోట్లతో కాళేశ్వరం ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది రాయి వేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్ 9 సార్లు ప్రత్యక్షంగా పర్యటించి, పర్యవేక్షించారు.

 1. నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రం

బుద్దగయ తరహాలో నాగార్జునసాగర్ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి బౌద్ధ క్షేత్రంగా మార్చాలని ప్రభుత్వ నిర్ణయించింది. నాగార్జుసాగర్ శ్రీ పర్వతారామ – బుద్ధవనం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసింది. పూర్తికాలం ఇక్కడేవుండి పనిచేసేలా బుద్ధవనం పాజెక్టు ప్రత్యేక అధికారిగా సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్యను నియమించగా, 2016 ఏప్రిల్, 29న పదవీ బాధ్యతలను చేపట్టారు. 274 ఎకరాల విస్తీర్ణంలో స్థూపం, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ స్థూపాల నమూనాలు, ధ్యానకేంద్రం నిర్మాణంలో ఉన్నాయి. కృష్ణానదీ తీరం వరకు మరికొంత స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం బహుకరించిన 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఇందులో నిలుపనున్నారు.

 1. రామప్పకు యునెస్కోలో స్థానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర యత్నాలు

ములుగు జిల్లా వెంకటాపూర్ లో కాకతీయ రాజులు నిర్మించిన అద్భుతమైన ఆలయం రామప్పకు వారసత్వ హోదాతో యునెస్కో లో స్థానం సంపాదించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. యునెస్కో గుర్తింపునకు వివిధ దశలు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాంస్కృతిక, పురావస్తు శాఖల సంచాలకులు బుర్రా వెంకటేశం, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు ఆచార్య పాండురంగారావు తదితరులు 2019 నవంబరులో పారిస్ లోని బక్మోస్ కు వెళ్లి యునెస్కో ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే భవిష్యత్ లో రామప్ప ఆలయ సంరక్షణ, నిర్వహణపై మరిన్ని వివరాలను 2020 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది.

 1. అధికారికంగా తెలంగాణ పండుగలు

తెలంగాణ సంస్కృతిలో మిళితమై, అస్తిత్వ ప్రతీకలుగా తర తరాలుగా కొనసాగుతూ వస్తున్న పండుగలను గుర్తించి అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే. మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రైస్తవ మతాలకు సమాన ప్రాధాన్యతనిచ్చి మత సామరస్యాన్ని ఫరిడవింపజేస్తున్న తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణ లౌకిక భావనలకు ఆదర్శంగా నిలించింది. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్రంలో బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలకు ప్రభుత్వం అధికారిక హోదా కల్పించింది. ఇందుకోసం 2014 జూన్ లో ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది. అలాగే, బక్రీద్, క్రిస్మస్, దసరా, దీపావళిఇలా ప్రతి పండుగనూ  ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది.

 1. బక్రీద్, రంజాన్, క్రిస్‌మస్‌లకు రెండు రోజుల సెలవు

రంజాన్, బక్రీద్, క్రిస్‌మస్ పండుగలకు రెండు రోజులు సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. పండుగల గలకోసం కుటుంబాలతో సొంతూళ్లకు ప్రయాణాలు చేసి మరుసటి రోజే తిరిగి విధుల్లోకి రావడం ఇబ్బందిగా ఉన్నందున వారికి పండుగ తదుపరి రోజు కూడా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 1. ప్రతీ బతుకమ్మ పండుగకు ముందు రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ చీరలను కానుకగా అందజేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. 2017 సెప్టెంబర్ 18 నుంచి ప్రతీబతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేస్తున్నారు. 500 డిజైన్లలో రూపొందించే ఈ చీరల కోసం ప్రభుత్వంప్రతిఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నది.సిరిసిల్ల మరమగ్గ కార్మికులతో ఈ చీరలను తయారుచేయిస్తున్నారు.సుమారుగా కోటి చీరలను.. 80 సెంటీమీటర్ల జాకెట్ తో కలిపి ప్రతి చీరె 6.30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. చీరెలను ప్రీడైడ్ ఫిలమెంట్ యార్న్ టెక్నాలజీతో బంగారు, వెండి రంగు జరీలతో తయారుచేస్తున్నారు.కుల, మతాలకు సంబంధంలేకుండా మహిళలకు బతుకమ్మ చీరెలను రేషన్‌షాపుల వారీగాస్థానిక ప్రజా ప్రతినిధుల చేతులమీదుగా పంపిణీ చేస్తున్నారు. అర్హులైన మహిళలు చీరలు తీసుకునేందుకు రాకపోతే వారి తరఫున భర్త లేదా తండ్రి, లేదా తల్లి ఎవరైనా గుర్తింపు కార్డు చూపిస్తే వారికి కూడా చీరలు అందిస్తున్నారు.
 1. తెలంగాణ మొక్కులు తీర్చుకున్న కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వెంకన్న, విజయవాడలోని కనకదుర్గమ్మతోపాటు రాష్ట్ర దేవాలయాలకు కానుకలు, ఆభరణాలు సమర్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొక్కులు మొక్కుకోగా ఇపుడు నెరవేరుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ఈ మొక్కుబడులకు బంగారు ఆభరణాల తయారీకి నిధులు విడుదల చేస్తూ 2015 ఫిబ్రవరి 24న జీవో జారీచేసింది. ఆంధ్రాలో 3 దేవాలయాలు, తెలంగాణలో 2 దేవాలయాల్లో మొక్కుల కోసం రూ. 8 కోట్ల 73 లక్షల నిధులు  విడుదల చేశారు.

వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం

వరంగల్ లో భద్రకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ 2016 అక్టోబర్ 9న మొక్కులు సమర్పించారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రూ 3.60 కోట్ల వ్యయంతో 11 కిలోల బంగారంతో చేయించిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు.

కురవి వీరభద్ర స్వామికి కోరమీసాలు

కురవిలోని వీరభద్రస్వామి దేవాలయానికి 25 గ్రాములబరువుండే రూ.75 వేల విలువైన  బంగారు కోరమీసాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున సమర్పించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన 2017 ఫిబ్రవరి 24న మొక్కులు తీర్చుకున్నారు. 

తిరుపతి వెంకన్నకు రూ.5 కోట్లతో ఆభరణాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతి దేవస్థానాన్ని 2017 ఫిబ్రవరి 24న కుటుంబ సమేతంగా దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రూ.5 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. ఇందులో రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల స్వర్ణసాలగ్రామహారం, రూ.1.21 కోట్ల విలువైన 4.650 కిలోల స్వర్ణ కంఠాభరణాలు ఉన్నాయి. 

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక

తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 10 నుంచి 15 గ్రాములముక్కుపుడక – దీనికి 45 వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముక్కుపుడక

విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి 11.29 గ్రాముల బంగారంతోముక్కుపుడకను  పాలపిట్ట రంగులో విలువైన రాళ్లు, రత్నాలు పొదిగించి చేయించారు. దీని నిమిత్తం ప్రభుత్వం రూ.45 వేలు విడుదల చేసింది. 2018 జూన్ 28న ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్లి కనకదుర్గ అమ్మవారికి ముక్కుపుడక సమర్పించి, మొక్కు తీర్చుకున్నారు.

 1. తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఫిబ్రవరి 13న జీవో 6,7లను జారీ చేసింది. దీనికి సీఎం అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

 • అతిపెద్ద జాతీయ జెండా

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న దేశంలోనే అతి ఎత్తైన 303 అడుగుల ఎత్తున్న జాతీయజెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.  ఇందుకోసం రూ.1.96 కోట్లు నిధులు విడుదల చేస్తూ 6 మే, 2016న ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ జెండా ఏర్పాటు బాధ్యతను కోల్‌కతా స్కిప్పర్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. ఇందులో 303 అడుగులు కర్ర ఎత్తు కాగా, జాతీయ పతాకం 100 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తులో ఉంది.

21.అమరులకు నివాళిగా మహా దీపకళిక

తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల స్మృతికి ఘనంగా నివాళులు అర్పించేందుకు, అమరుల త్యాగాలను స్మరించేందుకు ఒక మహాస్మృతికేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారులు ఆ స్థూపం నమూనాను ఖరారు చేశారు. ప్రపంచంలో అపూర్వమైన రీతిలో ఈ అమరవీరుల స్థూపం ఉండేలా సీఎంఅన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్వహంగులతో ప్రత్యేకతను చాటుకునేలా స్మృతికేంద్రం నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. అమరవీరుల స్తూపం, స్మృతివనం నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసే అమరవీరుల స్తూపాన్ని ప్రమిద ఆకృతిలో డిజైన్ చేశారు. ఈ అపురూప స్మారకానికి రూ.90 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. సాధారణంగా స్మృతి స్తూపాలను రాయి లేదా సిమెంటుతో నిర్మిస్తుంటారు. కానీ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పూర్తిస్థాయిలో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు 23 మీటర్ల వరకు ఉంటుంది. సాధారణంగా ఆరు లేదా ఏడు అంతస్తుల భవనంతో ఇది సమానం. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అమరవీరుల స్తూపం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించేలా వుండబోతోంది.  25 మంది ప్రఖ్యాత డిజైనర్లు, ఆర్టిస్టులు కలిసి ఈ డిజైన్ రూపొందించారు. ఇక్కడికి వచ్చినవారు కొంత సమయం గడిపేలా, తెలంగాణ ప్రాంత చరిత్ర, అమరవీరుల త్యాగాలు తెలుసుకునేలా ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో హుస్సేన్‌సాగర్ తీరాన 12 ఎకరాల స్థలంలో అమరవీరుల భారీ స్థూపానికి 2016 జూన్ 2న శంకుస్థాపన చేశారు. స్థూపం, స్మృతివనం నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.

 • విద్యా సంస్థలకుతెలంగాణప్రముఖులపేర్లు

ప్రొఫెసర్ జయశంకర్

హైదరాబాద్‌లోని ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్‌ పేరు పెట్టింది.  2014 ఆగస్టు6న వర్సిటీ ప్రాంగణంలో జయశంకర్‌ జయంతిని అధికారికంగా జరపగా,జయశంకర్‌ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అలాగే, నూతనంగా ఏర్పడ్డ భూపాలపల్లి జిల్లాకు జయశంకర్‌ పేరు పెట్టారు.

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు :తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రి పీవి పేరు పెట్టింది.

వరంగల్ లో కాళోజీ పేరిట హెల్త్ యూనివర్సిటీ :వరంగల్ నగరంలో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాళోజీ  హెల్త్ యూనివర్సిటీకి 2016 ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. వరంగల్ లో ఏర్పాటు చేసే హెల్త్  యూనివర్సిటీకి కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పేరును ఖరారు చేశారు. దీంతో తెలంగాణలోని వివిధ వైద్య కళాశాలలు ఇక నుంచి కాళోజీ  నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయి. విభజన తర్వాత ఇప్పటి వరకు విజయవాడలోని ఎన్టీయార్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోనే పనిచేశాయి. కాళోజీ నారాయణరావు తెలంగాణ హెల్త్‌ యూనివర్సిటీ మనుగడలోకి రావడంతో ఆ కాలేజీల్ని దీని పరిధిలోకి తీసుకొస్తూ 2016 ఫిబ్రవరి 9న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మోడరన్ మెడిసిన కాలేజీ, టెంటల్‌ సైన్స, నర్సింగ్‌, ఆయుర్వేద, హోమియోపతి, యూనానీ, నేచురోపతి, ఎంఎల్‌టి, ఫిజియోథెరపీ, న్యూట్రిషన అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కాలేజీలు, ఉద్యోగులు కూడా దీని పరిధిలోకి వస్తారు.

క్రీడామైదానాలకు శ్రీకాంతాచారి, సర్వాయి పాపన్నల పేర్లు

బోరబండలోని రెండు క్రీడా మైదానాల్లో ఒకదానికి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి, మరో మైదానానికి సర్వాయి పాపన్న పేర నామకరణం చేయాలని 27 సెప్టెంబర్, 2018 ప్రభుత్వం నిర్ణయించింది.

చాకలి ఐలమ్మ: పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కు చాకలి అయిలమ్మ పేరు పెట్టారు.

 • అధికారికంగా తెలంగాణ ప్రముఖుల జయంతులు, వర్థంతులు 

మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు

జూన్‌ 28న మాజీ ప్రధాని పీవీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తోంది. పీవీకి భారత రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది. వరంగల్‌లో పీవీ నరసింహరావు విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అలాగే, హైదరాబాద్ నాగోల్ లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

హెచ్‌సీయూకు పీవీనరసింహారావు పేరు పెట్టాలి: ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌సెంట్రల్‌యూనివర్సిటీకిపూర్వప్రధానిపీవీనరసింహారావుపేరుపెట్టాలనిముఖ్యమంత్రికె.చంద్రశేఖర్రావు 28 జూన్ 2020నప్రధానిమోడీకిలేఖరాశారు. 1991లోకుదేలైపోయినదేశఆర్థికవ్యవస్థనుగాడిలోపెట్టడానికిసంస్కరణలనుచేపట్టినపీవీదేశంలోవిప్లవాత్మకమార్పులుతెచ్చారనిగుర్తుచేశారు.    హెచ్‌సీయూకుపీవీపేరుపెట్టాలనేదితెలంగాణప్రజలడిమాండ్‌అనిప్రధానికిరాసినలేఖలోసీఎంకేసీఆర్‌పేర్కొన్నారు.

‘పీవీతెలంగాణఠీవి’.. ఏడాదిపొడవునాశతజయంతిఉత్సవాలు (28 జూన్ 2020)

భారతదేశరాజకీయాల్లోఅత్యంతఅరుదైన.. అసాధారణప్రజ్ఞాశీలి.. తెలంగాణపోరుగడ్డనుంచిఎదిగి.. ఎర్రకోటపైత్రివర్ణపతాకాన్నిసగర్వంగాఎగురవేసినతెలుగుబిడ్డ.. నెహ్రూవంశంతరువాతప్రధానమంత్రిబాధ్యతనుఅయిదేండ్లపాటునిరాటంకంగానిర్వహించినరాజనీతిజ్ఞుడుపీవీనరసింహారావుశతజయంతిఉత్సవాలువిశ్వవ్యాప్తంగాఘనంగానిర్వహించాలనిరాష్ట్రప్రభుత్వంనిర్ణయించినట్టుముఖ్యమంత్రికే.చంద్రశేఖర్‌రావుప్రకటించారు. పీవీజయంతిఅయిన 2020 జూన్ 28నహైదరాబాద్‌లోనిపీవీజ్ఞానభూమిలోప్రధానకార్యక్రమంఉంటుందనివెల్లడించారు. అదేరోజుప్రపంచవ్యాప్తంగాదాదాపు 50 దేశాల్లోజయంతివేడుకలునిర్వహిస్తామనితెలిపారు. శతజయంతిఉత్సవాలనిర్వహణకుతక్షణంరూ.10 కోట్లుకేటాయిస్తున్నట్టుసీఎంకేసీఆర్‌ప్రకటించారు. ‘పీవీతెలంగాణఠీవి’అనిప్రతితెలంగాణబిడ్డగర్వపడేలాఆయనచరిత్రఉన్నదని, ఆయనగొప్పతనం, చేసినసేవలువిశ్వవ్యాప్తంగాతెలిసేలాఏడాదిపొడవునావిభిన్నకార్యక్రమాలనునిర్వహించాలనిచెప్పారు. పీవీకిభారతరత్నఇవ్వాలనిఅసెంబ్లీలోతీర్మానంచేస్తామని, ఇదేవిషయంలోస్వయంగాప్రధానినికలిసివిన్నవిస్తాననిసీఎంకేసీఆర్పేర్కొన్నారు.

పీవీ జ్ఞానవేదికకు రూ. 7 కోట్లు (22 జనవరి 2021)

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన వంగరలో పీవీ జ్ఞానవేదిక ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్లను విడుదల చేసింది. వంగరను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. పీవీ ఇంటిని మ్యూజియంగా రూపొందించడంతోపాటు, అక్కడే విజ్ఞాన వేదిక, థీమ్‌ పార్క్‌ ఏర్పాటుకు అధికారులు  ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

కాళోజీ నారాయణరావు : 2014 సెప్టెంబర్‌ 9న కాళోజీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. రూ.46 కోట్లతో కాళోజీ కళా కేంద్రం పేరిట వరంగల్ బాలసముద్రంలో 4.25 ఎకరాల స్థలంలో ఆడిటోరియం, ఉద్యానవనం నిర్మిస్తున్నారు. నాలుగు అంతస్తుల సువిశాల భవనంలో 1,500 మంది కూర్చునేలా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2020 నాటికి ఈ భవనం పూర్తికానుంది.సెప్టెంబర్ 9న కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని, కాళోజీ పేరిట పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

దాశరథి కృష్ణమాచార్య : జూలై 22న అధికారికంగా దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహించాలని, దాశరథి పేరిట అవార్డు ఇవ్వాలని,  పేదరికంలో వున్న ఆయన కుటుంబానికి అండగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ : హైదరాబాద్‌లో పలు జలాశయాల నిర్మాణానికి రూపకల్పన చేసిన ప్రఖ్యాత ఇంజనీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ జయంతి – జూలై 11న – అధికారికంగా నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని,  జంగ్‌ జయంతిని తెలంగాణ ఇంజనీర్స్‌ డేగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈశ్వరీబాయి వర్ధంతి : తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రధాత ఈశ్వరీబాయి వర్దంతిని ఫిబ్రవరి 24న  ప్రతీ సంవత్సరం ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది.

కాకా వర్థంతి, జయంతి : ప్రముఖ రాజకీయవేత్త జి.వెంకటస్వామి జయంతి (అక్టోబర్ 5)న, వర్ధంతిని 22 డిసెంబర్ న  ప్రతీ సంవత్సరం ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. ట్యాంక్‌బండ్‌పై వెంకటస్వామి విగ్రహాన్ని నెలకొల్పింది.

కొమురం భీమ్‌ వర్ధంతి : ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పోరాట యోధుడు కొమురం భీమ్‌ 74వ వర్ధంతిని 2014 అక్టోబర్‌ 8న జోడే ఘాట్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. రూ. 25 కోట్లతో కొమురం భీమ్‌ స్మారక చిహ్నానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం, వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నిర్ణయించింది. జోడేఘాట్‌ కేంద్రంగా 100 ఎకరాల స్థలంలో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.  కొత్తగా ఏర్పాటు చేసిన ఒక జిల్లాకు కొమురం భీమ్‌ పేరు పెట్టారు.

కొండా లక్ష్మణ్‌ బాపుజీ :  ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు  కొండా లక్ష్మణ్‌ బాపుజి జయంతి – సెప్టెంబర్‌ 27న ప్రతిఏటా అధికారికంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.

సి.నారాయణ రెడ్డి కి ఘన నివాళి : ప్రముఖ కవి, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత సి.నారాయణ రెడ్డి2017 జూన్ 12న మరణించగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, సినారె పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. సినారె అంత్యక్రియలు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సినారె అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. సినారె స్మారక భవనానికి స్థలం కేటాయించి స్మారక మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. సినారె పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఓ ప్రముఖ సంస్థకు ఆయన పేరు పెడతామని ప్రకటించారు. ట్యాంక్‌బండ్‌పైన, కరీంనగర్‌లో, సిరిసిల్ల లో, సినారె స్వగ్రామమైన హన్మాజీపేటలో ప్రభుత్వపరంగా సినారె కాంస్య విగ్రహాలు పెట్టనున్నట్లు ప్రకటించారు. సినారె ఎంతగానో ప్రేమించే సారస్వత పరిషత్తుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

 • తెలంగాణకుంభమేళా.. మేడారంజాతర

సమ్మక్క సారక్క జాతర  ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ప్రతీ రెండేండ్లకు ఒకసారి ఈ జాతర నిర్వహిస్తారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. దేశంలో కుంభమేళా తరువాత అత్యధిక భక్తులు పాల్గొనే జాతర ఇదే. ఈ జాతరకు జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం స్పందించలేదు. 900 ఏళ్లుగా గిరిజనులు మాత్రమే తమ ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మలను కొలిచేవారు. 1940 తరువాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ఆతరువాత క్రమంగా దేశం నలుమూలనుండి అన్ని వర్గాల ప్రజలు ఈ జాతరకు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆదిమ తెగల ప్రజలు పెద్దసంఖ్యలో జాతరలో పాల్గొని మొక్కులు చెల్లిస్తారు. నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరకు 1 కోటి 50 లక్షల మంది వరకు భక్తులు  హాజరవుతున్నారు. జాతర నిర్వహణకు ప్రభుత్వం అధిక నిదులు కేటాయిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర నిధులతో జాతర నిర్వహించేవారు. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర నిర్వహణ ఏర్పాట్ల కోసం 2016 (ఫిబ్రవరి 17నుంచి 20 వరకు) లో రూ.178 కోట్లు, 2018 (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3)లో రూ.102 కోట్లు, 2020 (ఫిబ్రవరి 5 నుంచి 8)లో రూ.81 కోట్లు కేటాయించింది. శాశ్వత ప్రాతిపధికన ఏర్పాట్లు చేస్తుండడంతో క్రమంగా ఖర్చుకూడా తగ్గుతున్నది.

నాలుగురోజులపాటుజాతరనిర్వహణ

జాతరమొదటిరోజునకన్నెపల్లినుంచిసారలమ్మనుగద్దెకుతీసుకువస్తారు. రెండవరోజునచిలుకలగుట్టలోభరిణెరూపంలోఉన్నసమ్మక్కనుగద్దెపైప్రతిష్ఠిస్తారు. దేవతలుగద్దెలపైప్రతిష్ఠించేసమయంలోభక్తులుపూనకంతోఊగిపోతారు.మూడవరోజునఅమ్మవార్లుఇద్దరుగద్దెలపైకొలువుతీరుతారు. నాలుగవరోజుసాయంత్రంఆవాహనపలికిదేవతలనుఇద్దరినీతిరిగియద్దస్థానానికితరలిస్తారు.

జాతరకుఅన్నిఏర్పాట్లు

ప్రతీ రెండేండ్లకోసారి జరిగే ఈ జాతరకు ప్రభుత్వం రూ.వందల కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నది. ఈ జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖల ఆధ్వర్యంలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. శాశ్వతప్రాతిపధికన పనులు చేపడుతున్నది. సీఎం కేసీఆర్‌ చొరవతో జాతర నిర్వహించే ప్రతీసారి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్‌, ఖమ్మం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్ష, చంద్రాపూర్‌ వంటి ప్రాంతాల నుంచి నడిపిస్తున్నది. పర్యాటక శాఖ ప్రజలకు హెలికాప్టర్ల సౌకర్యాన్ని కల్పించింది. 2020 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు ఆర్టీసీ 4000 నుంచి 5000 బస్సులను నడిపింది. మెరుగైన వైద్యంకోసం 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో 15 కు పైగా వైద్య శిభిరాలు ఏర్పటు చేసి నిపుణులైన వైద్య సిబ్బందిని నియమించారు. సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని కల్పించింది. ఇందుకోసం ఇన్ ఫిల్టరైజేషన్ బావులను ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ జంపన్న వాగులో నిండుగా నీటిని ఉంచుతుంది. 3500 మీటర్ల స్నానఘట్టాలను ఏర్పాటు చేసింది. భక్తుల రక్షణార్థం 150 మందికి పైగా గజ ఈతగాల్లను అందుబాటులో ఉంచారు. నిరంతరాయ విద్యుత్ సౌకర్యం కల్పించింది. 10,000 మందికి పైగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. జాతరను నిత్యం పర్యవేక్షించేందుక బుల్లెట్‌ సీసీ కెమెరాలు, పీటీజెడ్‌ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫేసియల్‌ రికగ్నైజ్‌డ్‌, ఫింగర్‌ ప్రింట్స్  బ్యూరోను సైతం రంగంలోకి దింపి జాతరను పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించారు.సమాచార, పౌరసంబంధాల శాఖ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌, వైఫై, ఈమెయిల్‌, వాట్సాఫ్‌, ఫేస్‌బుక్‌ తదితర ప్రచార సామాజిక మాధ్యమాలను వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

కుటుంబ సమేతంగా జాతరకు హాజరవుతున్నముఖ్యమంత్రి

ముఖ్యమంత్రికె.చంద్రశేఖర్రావుకుటుంబసమేతంగాజాతరకుహాజరైసమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులనుదర్శించుకొనిమొక్కులుచెల్లిస్తున్నారు. వనదేవతలకునిలువెత్తుబంగారం (బెల్లం), పట్టువస్త్రాలుకానుకలుగాసమర్పిస్తున్నారు. 2018 ఫిబ్రవరి 2న, 2020 ఫిబ్రవరి 7నముఖ్యమంత్రిజాతరకుహాజరయ్యారు.

 • ఘనంగా గోదావరి పుష్కరాల నిర్వహణ

ప్రకృతితో మానవజీవితం పెనవేసుకున్నదనడానికి పుష్కరాలు ఒక గొప్ప ఉదాహరణ. జీవకోటిని బతికించే నీటి జాడలను నదీమ తల్లులను దేవతారూపంలో కొలిచే గొప్ప సంస్కృతి భారతదేశానిది. ఈ పరంపరలో ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు కొత్త తెలంగాణ రాష్ట్రం మొదటి పాదంలోనే రావడం సంతోషకరం. నూతన ప్రభుత్వం అయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించి ప్రజలచేత మెప్పు పొందింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుపుకొనే తొలి గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం 2015లో జులై 14 నుండి 25 వరకు  ఘనంగా నిర్వహించింది. తెలంగాణలోనే గోదావరి, కృష్ణా నదులు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాయి కానీ, ఆంధ్ర పాలకులు ఆంధ్రలోనే ఘనంగా పుష్కరాలు జరిపేవారు. పుష్కరాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది తెలంగాణ. ఈ నేపథ్యంలో గోదావరి నది ప్రవహించే అన్ని జిల్లాల్లో పుష్కరాలు ఘనంగా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. పుష్కరాలకు1700 ఆర్టీసీ బస్సులు, అదనంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయగా, కోట్లాది మంది ప్రజలు పుణ్యస్నాణాలు ఆచరించారు. పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం రూ. 700 కోట్ల కేటాయించింది.

గొప్పగా కృష్ణా పుష్కరాల నిర్వహణ

తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా కృష్ణా  పుష్కరాలు 2016-17 ఆగష్టు 12 నుండి 23 వరకు వచ్చాయి. ఈ పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 2016-17 బడ్జెట్ రూ. 825.16 కోట్లను కేటాయించింది. ఇందులో ఆర్‌ అండ్‌ బి రహదారుల నిర్మాణానికి రూ.398 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ.38.04 కోట్లు,పంచాయతీరాజ్‌ శాఖకు రూ.10.22 కోట్లు,తాగునీటి సౌకర్యానికి రూ.18.30 కోట్లు కేటాయించారు. అలాగే, మత్స్యశాఖకు రూ. 1.19 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.8.6 కోట్లు, ప్రజారోగ్య శాఖకు 0.16 కోట్లు,వైద్య ఆరోగ్యశాఖకు రూ.1.75 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ. కోటి,దేవాదాయ శాఖకు రూ.4.54 కోట్లు ఖర్చు చేసింది. అలాగే, శక్తిపీఠమైన ఆలంపూర్‌ జోగుళాంబ ఆలయంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాల మరమ్మత్తు పనులను రూ.2.46 కోట్లు వెచ్చించింది. ఈ పుష్కరాల్లో 12రోజులపాటు మొత్తం 2కోట్ల 56 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు చేశారు. పాలమూరు జిల్లావ్యాప్తంగా 52 ఘాట్లు ఏర్పాటు చేయగా దాదాపు 1.84 కోట్ల భక్తులు, నల్లగొండ జిల్లాలోని 28 పుష్కరస్నానవాటికల్లో 72 లక్షల మంది పుష్కరస్నానాలు చేశారు.

టూరిజం పాలసీ విడుదల

రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన టూరిజంపాలసీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోని పర్యాటకప్రదేశాలన్నింటినీ సర్క్యూట్‌లుగా విభజించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. టూరిజంశాఖలో రెవెన్యూ భారీగా పెంచుకునే లక్ష్యంగా టూరిజం ప్రమోషన్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు సీఎం కేసీఆర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

కరీంనగర్ మానేరు డ్యాం మధ్యలో కేసీఆర్ ఐలాండ్

కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) పర్యాటక ప్రాంతంగా మార్చనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే లోయర్ మానేరు డ్యాంలో ఏడాదిపొడవునా పూర్తిస్థాయి నీటిమట్టం ఉంటుంది. డ్యాం మద్యలో 4 ఎకరాల విస్థీర్ణంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మైసమ్మగుట్ట ఉంది. ఈ గుట్టను మరింత రమణీయంగా తీర్చిదిద్ది, పర్యాటకరంగానికి అనువుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్యాం మధ్యలో నాలుగు ఎకరాల్లో ఉన్న మైసమ్మగుట్టపై రూ.20 కోట్లతో కేసీఆర్ ఐలాండ్ పేరు తో అత్యాధునిక హంగులతో టూరిస్టులను ఆకట్టుకునేలా పలు రకాల నిర్మాణాలు చేపట్టాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. మొదటి దశలో రూ.5 కోట్లు కేటాయించారు.రాష్ట్రం లో ప్రాజెక్టు మధ్యలో గుట్ట ఉండి, నలువైపు లా నీళ్లున్న ప్రాంతం ఎక్కడా లేదన్న విషయా న్ని గుర్తించిన పర్యాటకశాఖ కేసీఆర్ ఐలాండ్‌కు ఆమోదముద్ర వేసింది.

వివిధ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యానికే కాకుండా, సామాజిక వికాసానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రంలోని అన్నికులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నది. వారి సామాజిక, సాంస్కృతిక, విద్య, వికాసం, ఆర్థిక పురోగతికి చర్యలు తీసుకోవడానికి, ప్రతీ కులానికి హైదరాబాద్ లో ప్రభుత్వమే భవన్ లను నిర్మిస్తున్నది. ఇందుకోసం అవసరమైన స్థలాలను సేకరిస్తున్నది. బీసీ కులాలు, ఎస్సీలలో ఉన్న బుడగ జంగాల, ఎస్టీలలో ఉన్న ఎరుకల కులం భవనానికి కూడా స్థలం కేటాయించి, భవనం నిర్మించనుంది. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం దేశంలోనే ఇది ప్రథమం. రాష్ట్రంలోని మున్నూరు కాపుల కులస్తులకు 5 ఎకరాల స్థలం, భవన నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు,దూదేకుల కులం వారికి 3 ఎకరాల స్థలం, రూ.3 కోట్ల నిధులు, గంగ పుత్రులకు 2 ఎకరాల స్థలం, రూ. 2 కోట్లు, విశ్వకర్మలకు 2 ఎకరాల స్థలం, రూ. 2 కోట్లు, నాయీ బ్రాహ్మణులు, ఆరె క్షత్రియులు, వడ్డెర, కుమ్మరి, ఎరుకల, ఉప్పర, మేర, బుడిగ జంగాల, మేదర, పెరిక, చాత్తాద శ్రీ వైష్ణవ, కటిక తదితర కులస్తులకు ఒక్కో ఎకరం, రూ. కోటి నిధులు, భట్రాజులకు అర ఎకరం స్థలం, రూ.50 లక్షలు కేటాయించనుంది. పూసల కులస్థుల భవన నిర్మాణానికి రూ.కొటి, రంగ్రేజ్ భవసార క్షత్రియ కులస్థుల భవననిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశారు.

బీసీ భవనాల నిర్మాణానికి రూ.58.75 కోట్లు విడుదల

హైదరాబాద్ లో 30 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.58.75 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు తేదీ 29 ఆగస్టు 2018 రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం 104 ఎకరాల భూమిని కేటాయిస్తూ జిఓ నెం.189 ని జారీ చేసింది. ఈ భూమి హెచ్.ఎం.డి.ఎ. పరిధిలో ఉన్నది. హెచ్.ఎం.డి.ఎ. ఈ భూమిని రెవెన్యూశాఖకు అందజేసింది. ఇందులో 49 ఎకరాలు రంగారెడ్డి కోకాపేటలో, 55 ఎకరాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ లో ఉన్నాయి. ఉప్పల్ లోని 55 ఎకరాలను 22 కులాలకు కేటాయించారు.

ఆత్మగౌరవ భవనాలకు నిధులు

సంచార జాతుల ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి రూ.10 కోట్లు, మున్నూరు కాపులు, విశ్వబ్రాహ్మణ, రజక భవన్ లకు రూ.5 కోట్ల చొప్పున, తెలంగాణ కౌండిన్య (గౌడ) ట్రస్టుకు రూ.5 కోట్లు,  గంగపుత్ర, శాలివాహన (కుమ్మరి) భవన్ కు రూ.3 కోట్లు, పెరిక(పురగిరి క్షత్రియ), సగర (ఉప్పర), నాయీ బ్రాహ్మణ, దూదేకుల భవన్ లకు రూ. 2 కోట్ల చొప్పున, వాల్మీకి బోయ, ఆర్య క్షత్రియ (నకాస్), మేదరి, వడ్డెర, బొందిలి,ఆరె (ఆరోళ్ల) భవన్, ఆరెకటిక, మేర, వడ్డెర, చాత్తాద శ్రీవైష్ణవ, గాండ్ల (తెలి), ఎల్లాపి (ఎల్లాపు) భవనాలకు రూ.1 కోటి చొప్పున, దేవాంగ, పట్కారి భవన్ లకు రూ.75 లక్షలు చొప్పున, భట్రాజు, కచ్చి, లొద్ద కులాల భవన్ లకు రూ.50 లక్షల చొప్పున, భుంజ్వ, జంద్ర, నీలి కులాల భవన్ లకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

36 సంచార కులాల వారికి 10 ఎకరాల్లో ఆత్మగౌరవ భవన్

దాదాపు 36 సంచార కులాలకు కలిపి హైదరాబాద్ నగరంలో 10 ఎకరాల స్థలంలో సంచార ఆత్మగౌరవ భవన్ నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులను తేదీ.29 ఆగస్టు, 2018న విడుదల చేసింది.  ఈ  భవన్ లో అన్ని సంచార కులాల వారు తమ అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయనున్నది.

 • గిరిజనభవన్లు

రాష్ట్రవ్యాప్తంగా గిరిజనభవన్లను నిర్మిస్తున్నది. ఇందుకు రూ.66.40 కోట్ల నిధులను ప్రత్యేకంగా మంజూరుచేసింది. ఒక్కో భవనం నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 కోట్ల చొప్పున మంజూరుచేసింది. ఆయా జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో 24 గిరిజనభవన్లను నిర్మిస్తున్నారు. మరికొన్నింటిని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ లో చేపట్టిన బంజారాభవన్‌, కుమ్రంభీంభవన్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి.

దొడ్డి కొమురయ్య కురుమ మెమోరియల్

హైదరాబాద్ లోని మల్కాజిగిరి పరిధిలో ఎకరంన్నర విస్తీర్ణంలోదొడ్డి కొమురయ్య భవన్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణానికి రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తూ, 2014డిసెంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడిన తరగతుల కులాలసాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి భవన్ ఉపయోగపడుతుంది.

 • రజకుల సంక్షేమం కోసం తేదీ 11 ఆగస్టు 2018 రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లో రజక భవన్ నిర్మించుకోవడానికి వీలుగా ఎకరం స్థలాన్ని కేటాయిస్తామని, రూ.5 కోట్లతో రజక హస్టల్, కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తామని, హైదరాబాదులో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

హైదరాబాద్ లో ఎరుకల భవన్ కు స్థలం

హైదరాబాద్ లో ఎరుకల కులస్తుల సామాజిక, విద్యా ప్రగతికి దోహదపడేలా ప్రత్యేకంగా ఒక భవనం నిర్మిస్తామని తేదీ 11 ఆగస్టు 2018 రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ ఎరుకల భవన్ కోసం అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎరుకల కులస్తుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు.

బంజారా, ఆదివాసీలకు హైదరాబాద్ లో భవన్ ల నిర్మాణం

హైదరాబాద్‌ లో బంజారా, ఆదివాసీల కోసం చెరొక భవన్‌ నిర్ణయించాలని భావించిన ప్రభుత్వం 2014 డిసెంబర్ 11న శంకుస్థాపన చేసింది. ఒక్కో భవనానికి ఒక్కో ఎకరం స్థలం కేటాయిస్తూ, ఒక్కో భవననిర్మాణానికిగాను రూ. 2.5 కోట్ల చొప్పున మొత్తం రూ. 5 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.

అజ్మీర్ దర్గా వద్ద రూ. 5 కోట్లతో వసతి గృహం

తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే అజ్మీర్ దర్గాలో వసతి గృహాన్ని నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి  రూ.5కోట్లు మంజూరు చేస్తూ 2015 ఫిబ్రవరి 4న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే యాత్రికుల కోసం ఈ వసతి గృహాన్ని నిర్మించనున్నారు. మక్కాలో ఉండే మక్కాభవన్ మాదిరిగా దీన్ని నిర్మించనున్నారు.

శబరిమలలో తెలంగాణ భవన్ కోసం 5 ఎకరాల స్థలం

శబరిమల క్షేత్రానికి వెళ్లే తెలంగాణ భక్తుల కోసం తెలంగాణ భవన్ నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో అక్కడ భవన సముదాయం నిర్మించేందుకు 5 ఎకరాల స్థలం కేటాయించింది కేరళ ప్రభుత్వం. కేరళ విద్యాశాఖ మంత్రి పీ.కే.అబ్ దరూబ్ 2015 ఫిబ్రవరి 13న సచివాలయంలో సీఎం కేసీఆర్ ను కలిసి 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు.

తెలంగాణలో కేరళ భవన్

తెలంగాణలో కేరళ భవన్ కు హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎకరం స్థలం ఇవ్వడంతో పాటు రూ. కోటి నిధులు మంజూరు చేసింది. 2015 సెప్టెంబర్ 20న  కేరళ భవన్ కు  ఫిల్మ్ నగర్ లో శంకుస్థాపన చేశారు.  పేద మలయాళీ కుటుంబాల వారు 350 మంది వరకు ఉంటారని గుర్తించిన ప్రభుత్వం వారందరికీ ఉచితంగా 350 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లుకట్టించి ఇవ్వాలని నిర్ణయించింది.

 • బ్రాహ్మణ సదన్

సమాజంలో అన్ని సామాజిక తరగతుల్లోని పేదల అభ్యున్నతికి కృషి జరిగినట్లే, బ్రాహ్మణుల సంక్షేమానికి, ఆ సామాజిక తరగతిలోని పేదల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 23న ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో బ్రాహ్మణ ప్రతినిధులతో జరిగిన భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయిస్తూ 2016 డిసెంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. 2017 జూన్ 5న గోపనపల్లి లో బ్రాహ్మణ సదన్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణ సంక్షేమ భవన నిర్మాణానికి 6 ఎకరాల స్దలాన్ని, రూ.10 కోట్లు కేటాయించారు. ఈ విప్రహిత బ్రాహ్మణ సదన భవనంలో  విద్యార్థులకు వసతి, పీఠాధిపతులకు వసతిని ఏర్పాటు చేయనున్నారు.  బ్రాహ్మణ యువతీ, యువకుల నైపుణ్య అభివృద్ధికి శిక్షణ నిర్వహించనున్నారు.  కళ్యాణాలకు కళ్యాణ మండపం నిర్మించడంతోపాటు, అశుభకార్యక్రమాలు నిర్వహించేందుకు వేరుగా మరొక ఒక హాలును నిర్మిస్తున్నారు.

 • ఐదు కోట్లతో లింగాయత్ భవన్

తెలంగాణలోని వీర శైవ లింగాయత్, లింగ బలిజలకోసం హైదరాబాద్‌లో లింగాయత్ భవన్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2015 ఏప్రిల్ 21న రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 882వ జయంతి వేడుకలో ప్రకటించారు. ఎకరంభూమి, భవన నిర్మాణానికి రూ.5 కోట్ల తో ఈ భవనం నిర్మిస్తారు. అలాగే, మహాత్మ బసవేశ్వర వేడుకలను అధికారికంగా నిర్వహించాలని, బసవేశ్వర విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠ్యాంశాల్లో పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణాన్ని చేర్చేందుకు నిర్ణయంచిన ప్రభుత్వం లింగాయత్‌లను ఓబీసీల్లోకి చేర్చాలని ప్రధానమంత్రికి లేఖ కూడా రాసింది.

 • తెలంగాణలోని ముదిరాజ్ కులస్తుల కోసం హైదరాబాద్ లో కమ్యూనిటీ భవనం నిర్మించాలనుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కోకాపేట్ దగ్గర ఐదెకరాల భూమిని కేటాయిస్తూ, భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు నిధులు మంజూరు చేస్తూ  2018 ఫిబ్రవరి 26న ఉత్తర్వులు జారీ చేశారు.
 • క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి రూ.10 కోట్లు

క్రిస్టియన్ల కోసం హైదరాబాద్ నగరంలో క్రైస్తవ భవన్ నిర్మించనున్నారు. క్రిస్మస్ వేడుకలు ఆ భవన్‌లోనే నిర్వహించేందుకు వీలుగా ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు.  మంచి ఆర్కిటెక్చర్‌తో అంతర్జాతీయ స్థాయిలో దీని నిర్మాణం ఉంటుంది. ఈ భవనం కోసం యాప్రాల్ లో 2 ఎకరాల స్థలం కేటాయించారు. 1.2 లక్షల చదరపు అడుగుల విస్థీర్ణంలో అత్యాధునిక హంగులతో రూ.25 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. హెచ్.ఎం.డి.ఎ. ద్వారా పనులు  నిర్వహిస్తారు. 

క్రైస్తవుల స్మృతి వనాలకు 40 ఎకరాలు

మైనార్టీల అభివృద్ధిలో భాగంగానేప్రభుత్వం క్రైస్తవుల కోసం హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో 40 ఎకరాలను స్మృతివనాల నిర్మాణం కోసంకేటాయించింది.

 • హైదరాబాద్ లో అంతర్జాతీయ యువనాయకత్వ సదస్సు

ఎన్నోఅంతర్జాతీయసదస్సులకువేదికఅవుతున్నహైదరాబాద్నగరంలోఅంతర్జాతీయయువనాయకత్వసదస్సునుఆసంస్థఅధ్యక్షురాలు, ఎంపీకల్వకుంట్లకవితనిర్వహించారు. నగరంలోనిహెచ్ఐసీసీలోజరిగినఈసదస్సునుఉపరాష్ట్రపతివెంకయ్యనాయుడుప్రారంభించారు.  ‘గాంధీమార్గంలోస్థిరత్వసాధన, నూతనఆవిష్కరణలు’అనేఅంశంపైసదస్సులోచర్చనిర్వహించారు. ఈసదస్సు103 దేశాలనుంచి550 మందియువప్రతినిధులుహాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగాఅద్భుతాలుసృష్టిస్తున్నయువతనుఒకేచోటకుచేర్చిసమావేశపర్చారు.

 • హైదరాబాద్ లో వరల్డ్ టూరిజం సదస్సు 

హైదరాబాద్లోనినేషనల్ఇనిస్టిట్యూట్ఆఫ్టూరిజంఅండ్హాస్పిటాలిటీమేనేజ్మెంట్ (నిథమ్) ఆధ్వర్యంలో 9 జనవరి, 2019న 23వఇంటర్నేషనల్జాయింట్వరల్డ్కల్చర్టూరిజంసదస్సునునిర్వహించారు. హైదరాబాద్లోదేశవిదేశాలసంస్కృతి, పర్యాటకంపైతొలిసారిగాజరిగినఈసదస్సుకుముఖ్యఅతిథిగాప్రభుత్వప్రధానకార్యదర్శిఎస్.కె.జోషిహాజరవగా, 15 దేశాలనుంచిప్రతినిధులుపాల్గొన్నారు. ఆయాదేశాలపర్యాటకరంగప్రతినిధులు, సీనియర్ప్రొఫెసర్లుఈసదస్సులోపాల్గొని, వారిసంస్కృతిసంప్రదాయాలు, పర్యాటకరంగఅంశాలపైచేసినపరిశోధనాపత్రాలనుప్రవేశపెట్టారు.

 • అంతర్జాతీయక్రీడాకారులకుప్రోత్సాహంపెంపు

క్రీడాకారుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రతిభ గల క్రీడాకారులకిచ్చే ఆర్ధిక సాయాన్ని భారీస్థాయిలో పెంచింది. అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు లాంటి అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తాచాటిన రాష్ట్ర క్రీడాకారులకుతోడు వాళ్లను ఈస్థాయికి తీర్చిదిద్దిన కోచ్‌లకూ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయిస్తూ 2016 జనవరి 4న అధికారికంగా జీవో జారీచేసింది. అలాగే గ్రామీణస్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఖో ఖో, కబడ్డీలాంటి ఒలింపికేతర క్రీడాంశాల్లో రాణించే ఆటగాళ్లకూ ఇకనుంచి ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

క్రీడాకారులకు అందనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు

 • ఒలింపిక్స్: స్వర్ణం నెగ్గితే రూ. 2 కోట్లు (గతంలో రూ. 25 లక్షలు), రజతానికి రూ. కోటి (గతంలో రూ. 16 లక్షలు, కాంస్యానికి రూ. 50లక్షలు (గతంలో రూ. 10 లక్షలు), ప్రాతినిథ్యానికి రూ. 5 లక్షలు (గతంలో లేదు).
 • పారాలింపిక్స్(గతంలో రివార్డు లేదు): స్వర్ణం నెగ్గితే రూ. 5 లక్షలు, రజతానికి రూ. 3 లక్షలు, కాంస్యానికి రూ. 2 లక్షలు
 • స్పెషల్ ఒలింపిక్స్ (గతంలో రివార్డు లేదు): స్వర్ణానికి రూ. 3లక్షలు, రజతానికి రూ. 2 లక్షలు,కాంస్యానికి రూ. లక్ష.
 • ప్రపంచ చాంపియన్‌షిప్: స్వర్ణానికి రూ. 50 లక్షలు (గతంలో రూ. 16లక్షలు), రజతానికి రూ. 30 లక్షలు (గతంలో రూ. 7.5లక్షలు), కాంస్యానికి రూ. 20 లక్షలు (గతంలో రూ. 5లక్షలు).
 • ఆసియా క్రీడలు: స్వర్ణానికి రూ. 30 లక్షలు (గతంలో రూ. 10లక్షలు),రజతానికి రూ. 20 లక్షలు (గతంలో రూ. 7.5లక్షలు), కాంస్యానికి రూ.10లక్షలు (గతంలో రూ. 5లక్షలు), ప్రాతినిథ్యానికి రూ. 2 లక్షలు (గతంలో లేదు).
 • కామన్వెల్త్ క్రీడలు: స్వర్ణానికి రూ. 25లక్షలు (గతంలో రూ. 10లక్షలు), రజతానికి రూ. 15లక్షలు (గతంలో రూ. 7.5లక్షలు), కాంస్యానికి రూ. 10 లక్షలు (గతంలో రూ. 5 లక్షలు).
 • జాతీయ క్రీడలు: స్వర్ణానికి రూ. 5 లక్షలు (గతంలో రూ. 3లక్షలు), రజతానికి రూ. 3 లక్షలు (గతంలో రూ. 2 లక్షలు), కాంస్యానికి రూ. 2 లక్షలు (గతంలో 1 లక్ష).
 • దక్షిణాసియా క్రీడలు (గతంలో లేదు): స్వర్ణానికి రూ. 3 లక్షలు, రజతానికి రూ. 2 లక్షలు, కాంస్యానికి రూ. లక్ష.
 • చెస్ టైటిళ్లు: ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్ (ఐజీఎమ్)కు రూ. 3 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎమ్)కు రూ. లక్ష, ఇంటర్నేషనల్ వుమెన్ మాస్టర్ (ఐడబ్లూఎమ్)కు రూ. లక్ష.
 • విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్

విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2018 మే 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో క్రీడాశాఖకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 74, 2012 ప్రకారం గుర్తించిన 29 క్రీడాంశాలకు ఈ జీవో ద్వారా రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుంది. రాష్ట్రంలోని క్రీడాకారులకు ఉన్నత విద్యలో కల్పిస్తున్న రిజర్వేషన్లను అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలకు విస్తరిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రోస్టర్ విధానంలో క్రీడాకారులకు 48, 98 పాయింట్లు కేటాయించారు. ప్రతివంద ప్రభుత్వ పోస్టులలో 48వ పోస్టు, 98వ పోస్టును వారికి కేటాయించారు. ఒలింపిక్స్,ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు నెగ్గినవారికి, గ్రాండ్‌స్లామ్ టోర్నీలతోపాటు చాంపియన్ స్థాయిని బట్టి రిజర్వేషన్ అమలు ప్రక్రియలో క్రీడాకారుల అర్హత నిర్ణయిస్తారు. ఒకవేళ అర్హులైన క్రీడాకారులు అందుబాటులో లేకపోతే ఈ రెండు పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు.

 • ఒలంపిక్ విజేతలకు నజరానాలు

ఒలంపిక్ క్రీడల్లో రజత పతకం కైవసం చేసుకున్న తెలుగు తేజం పి.వి.సింధూకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అంతే కాకుండా హైదరాబాద్ లో వెయ్యి గజాల స్థలాన్ని ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆమెకు శిక్షణనిచ్చిన కోచ్ గోపీచంద్ కు రూ.కోటి ప్రోత్సాహకాన్ని అందించింది. రియో నుండి ఆమె స్వదేశం చేరగానే హైదరాబాద్ లో భారీ ఎత్తున స్వాగత కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశారు. రెజ్లింగ్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ కు కూడా తెలంగాణ ప్రభుత్వం  కోటిరూపాయిల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అలాగే పివి సింధుకు ఫిజియోథెరపిస్టుగా వ్యవహరించిన డాక్టర్ చల్లగుండ్ల కిరణ్ కు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఒలంపిక్స్ లో ప్రతిభ కనబర్చిన శ్రీకాంత్ కు కూడా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందించాలని సీఎం నిర్ణయించారు. 

 • సమగ్రక్రీడావిధానంపైక్యాబినెట్‌సబ్‌కమిటీ ( తేదీ.19ఏప్రిల్2020 )

తెలంగాణరాష్ట్రసమగ్రక్రీడావిధానాన్ని, క్రీడాపాలసీనితయారుచేసేందుకు, స్పోర్ట్స్సిటీఏర్పాటుచేసేందుకుగానుప్రభుత్వంక్యాబినెట్సబ్కమిటీనిఏర్పాటుచేసింది. 19ఏప్రిల్2020నసీఎంకేసీఆర్అధ్యక్షతనజరిగినక్యాబినెట్సమావేశంలోఈనిర్ణయంతీసుకున్నారు.  క్రీడాశాఖమంత్రిశ్రీనివాస్‌గౌడ్‌అధ్యక్షతన.. మున్సిపల్‌మంత్రికేటీఆర్‌, విద్యాశాఖమంత్రిసబితాఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖమంత్రిఎర్రబెల్లిదయాకర్‌రావుసభ్యులుగాఈకమిటీఏర్పాటైంది. రాష్ట్రానికున్నస్టేడియంలు, శామీర్‌పేట, హకీంపేటఎయిర్‌పోర్ట్‌వద్దఉన్న300ఎకరాలస్పోర్ట్స్‌స్థలాలు, హైదరాబాద్‌నగరంలోవిస్తరించిఉన్నఅనేకస్థలాలు.. వీటన్నింటినిర్వహణ, అభివృద్ధి, స్పోర్ట్సిటీఏర్పాటుతదితరఅంశాలపైఈకమిటీఅధ్యయనంచేసి, ప్రభుత్వానికినివేదికసమర్పిస్తుంది.

 • సానియా మీర్జా.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్

తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపుతెచ్చిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను రాష్ట్ర ప్రభుత్వంరాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. 2014 జులై 21న ఈ విషయాన్ని ప్రకటించి,రూ. కోటి నజరానా ప్రకటించింది. 

 • ఎవరెస్టు విజేతలకు నగదు ప్రోత్సాహం

ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన గిరిజన, ఎస్సీ బిడ్డలు పూర్ణ, ఆనంద్‌లకు చెరో 25 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందించింది. గోల్కోండ కోటలో 2014 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వారిని అభినందించారు. ఆనంద్‌ చెంపపై ముద్దు పెట్టుకుని యావత్‌ ఎస్సీ జాతి పొంగిపోయేలా చేశారు. వారి కుటుంబాలకు 5 ఎకరాల భూమిని కూడా  ప్రకటించారు.ఈ ఇద్దరు పిల్లల కోచ్‌ శేఖర్‌కు కూడా రూ. 25 లక్షల నగదు ప్రొత్సాహం అందించారు.

 • మహిళల క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్ కు చేర్చినందుకు,  వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు కెప్టెన్ మిథాలీ రాజ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని 2017 డిసెంబర్ 28న అందించారు. మిథాలికి బంజారాహిల్స్లో 600 గజాల ఇంటిస్థలం పత్రాల్ని  అందజేశారు. మిథాలీ కోచ్ మూర్తికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు.
 • గోల్డ్కోస్ట్లో 2017 సెప్టెంబర్ 4 నుంచి 6 వరకుజరిగినకామన్వెల్త్వెయిట్‌లిఫ్టింగ్చాంపియన్‌షిప్‌లోజూనియర్మహిళల58కేజీలవిభాగంలోభారత్‌కుప్రాతినిధ్యంవహించినతెలంగాణలిఫ్టర్ఎర్రదీక్షితస్వర్ణపతకాన్నిదక్కించుకుంది. మహబూబాబాద్జిల్లాలోనిమానుకోటపట్టణానికిచెందినదీక్షితస్నాచ్‌లో73కేజీలబరువు, క్లీన్అండ్జెర్క్‌ లో94కేజీలుబరువెత్తిఓవరాల్‌గా167కేజీలతోపసిడిపతకాన్నికైవసంచేసుకుంది. బంగారుప‌త‌కంసాధించినదీక్షితకురూ. 15 లక్షలనగదుపురస్కారాన్నిరాష్ట్రప్రభుత్వంఅందించింది. దీక్షితతోపాటుఆమెకోచ్మాణిక్యాలరావుకురూ. 3 లక్షలచెక్కునుఅందజేశారు. కామన్వెల్త్వెయిట్లిఫ్టింగ్టోర్నమెంట్‌లో53కిలోలవెయిట్కేటగిరీలోదీక్షితగోల్డ్మెడల్సాధించింది.
 • మెట్ బోర్న్ లో ఫిబ్రవరి 2018న జరిగిన జిమ్నాస్టిక్ ప్రపంచకప్పోటీల్లో.. మహిళల వాల్ట్‌ ఈవెంట్లో భారత్ కు తొలి కాంస్య పతకం అందించిన హైదరాబాదీబుడ్డా అరుణారెడ్డికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.2 కోట్ల నగదుప్రోత్సాహకం అందించారు. ఈ విభాగంలో తొలి పథకం సాధించిన భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 4 మార్చి, 2018న ఆమెను సీఎం కేసీఆర్ సత్కరించారు. అరుణారెడ్డికి కోచ్‌గా వ్యవహరిస్తున్నబ్రిజ్ కిశోర్ కూడా సాయం అందించారు.
 • నాగపురి రమేష్ ధ్రోణాచార్య 

ఎంతో మంది మెరికల్లాంటి క్రీడాకారులను దేశానికి అందించిన మన రాష్ర్టానికి చెందినఅంతర్జాతీయ కోచ్ నాగపురి రమేశ్ కు కేంద్రంప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య పురస్కారాన్ని ప్రకటించింది. భారతక్రీడాప్రాథికార సంస్థ(సాయ్)లో కోచ్‌గా పనిచేస్తూ ఎందరో అథ్లెట్లనుఅంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా సానబెట్టిన రమేశ్‌కు ఈ అవార్డును ప్రకటించారు. తెలంగాణ ఖ్యాతిని దేశానికి చాటిచెప్పాడు. వరంగల్ జిల్లావాసి అయిన నాగపురిరమేష్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా అతన్ని అభినందిస్తూ 03 జనవరి, 2017న రూ.25 లక్షలను అందించింది. 2016 రియోఒలింపిక్స్‌లో పాల్గొన్న ద్యుతీచంద్‌కు రమేష్ శిక్షణ ఇచ్చాడు. ద్యుతీచంద్‌ రూపంలో 36 ఏండ్ల తర్వాత భారత్‌కు ఒలింపిక్స్‌ లో 100 మీటర్లస్ప్రింట్‌లో బెర్త్ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. అదేవిధంగావీవీఎస్ లక్ష్మణ్, ముఖేష్ కుమార్, ఎంఎస్‌కే ప్రసాద్,    హాకీ స్టార్ ముఖేష్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గోపీచంద్ తదితర ఆటగాళ్లకుఅథ్లెటిక్ కోచ్‌గా రమేశ్ శిక్షణ ఇచ్చాడు.

 • చెస్క్రీడాకారులకు  27.02.2016

రాష్ర్టానికి చెందిన ఇద్దరు చెస్ క్రీడాకారులువీ.నందిత, వీ.వర్షితలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి కేచంద్రశేఖర్‌రావు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని అడ్వాన్డ్స్చెస్ కోచింగ్, వివిధ జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ప్రత్యేకంగాపాల్గొనే సందర్భాల్లో వినియోగించేలా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకుఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి వీటిని ఖర్చుచేస్తారు.

 • ఒలంపిక్ సంఘం అద్యక్షునిగా జయేశ్ రంజన్

ఉమ్మడి రాష్ట్రం లో ఆంద్రప్రదేశ్ ఒలంపిక్ సంఘం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత తెలంగాణలో కూడా ప్రత్యేకంగా ఒలంపిక్ సంఘం 2018 సం.లో(Telangana State Olympic Association) ఏర్పడింది.  ఈ ఒలంపిక్ సంఘానికి ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించి అధ్యక్షులను, ఉపాధ్యక్షులను ఎన్నుకోవటం జరుగుతుంది. 10 ఫిబ్రవరి, 2020 న తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా జయేష్ రంజన్ విజయం సాధించారు. జయేష్ రంజన్‌కు 46 ఓట్లు పోలవ్వగా, ప్రత్యర్థి రంగారావుకు 33 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్ధిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా జయేష్ రంజన్-రంగారావు ప్యానెళ్ల మధ్య కొనసాగింది. వారిద్దరి మధ్యే పోటీ ప్రధానంగా కొనసాగింది. అలాగే జయేష్ రంజన్‌తో పాటు వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థులు మహ్మద్ అలీ, ప్రేమ్‌రాజ్, సరల్ తల్వార్, వేణుగోపాలచారి గెలుపొందారు. గతంలో ఎంపీ జితేందర్ రెడ్డి కూడా అధ్యక్షునిగా పనిచేశారు.

చరిత్ర, జీవన విధానం, అకాంక్షల ప్రతిబింబం ‘తెలంగాణ రాజముద్ర’

తెలంగాణ ప్రజల ఆశల్ని, అకాంక్షల్ని, సమూలదృష్టిని పరిగణలోకి తీసుకుని, రాష్ట్ర ప్రగతికి, ప్రజాశ్రేయస్సుకు పనిచేయాలనే ప్రభుత్వ దృక్పథం ప్రస్పుటమయ్యేలా తెలంగాణ అధికారిక రాజముద్ర రూపొందింది. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు రచించిన ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ రాజముద్ర రూపకల్పన జరిగింది. 

వృత్తాకారంలో రూపొందించిన తెలంగాణ రాష్ట్ర రాజముద్ర రాష్ట్ర ప్రజల ఐక్యతను, విశాలత్వాన్ని, నిరంతర ప్రగతిని ప్రతిబింభిస్తున్నది. నాలుగున్నరకోట్ల ప్రజల స్వప్నమైన బంగారు తెలంగాణ, ఆకుపచ్చని తెలంగాణ నూటికినూరుపాళ్లు ప్రతిబింబించేలా ఈ లోగోను ప్రముఖ చిత్రకారుడుఏలె లక్ష్మణ్రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరించే సానుకూల వైఖరికి, ప్రగతి కాముక విధానానికి, సాధనా పటిమకు అద్దం పట్టేలా ఈ లోగోకు రూపకల్పన చేశారు. రాష్ట్రం సమగ్ర ప్రగతి సాధించాలని, సమాజంలో శాంతి స్థాపన జరగాలని, ప్రజాజీవితంలో ప్రశాంతత నెలకొనాలనే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం ప్రస్పుటమయ్యేలా ఆకుపచ్చని రంగును లోగోకు ఎక్కువగా వాడారు.

రోజు వారీ అధికారిక వ్యవహారాల్లో తెలుగు, ఇంగ్లీషు, ఉర్ధూ భాషలకు ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతనిస్తుందనే సంకేతం ఇవ్వడానికి రాజముద్రలో తెలంగాణ ప్రభుత్వం అనే పదాలను మూడు భాషల్లో పొందుపరిచారు.

శక్తి సామర్థ్యాలకు, ధీరత్వానికి, సగర్వానికి, ఆత్మ విశ్వాసానికి చిహ్నాలైన నాలుగు సింహాలను, దానికింద సత్యపాలనను ప్రకటిస్తూ సత్యమేవజయతే అనే పదాలను చేర్చారు.

వరంగల్ రాజధానిగా క్రీ.శ. 1083 నుంచి 1323 వరకు దక్షిణ భారతదేశంలో సువిశాల రాజ్యాన్నిపాలించిన కాకతీయు రాజవంశానికి గుర్తుగా కాకతీయ కీర్తి తోరణం ఈ రాజముద్రలో ప్రధానమైనదిగా కనిపిస్తుంది. భారతదేశంలోని ప్రముఖ నిర్మాణాల్లో ఒకటిగా నిలిచి, హైదరాబాద్ నగరానికి చిహ్నంగా మారిన చార్మినార్ చిత్రం రాజముద్రలో భాగంగా ఉంటుంది. 15వ శతాబ్దం చివరిలో ప్లేగు వ్యాధి సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతే బతుకుకు చిహ్నంగా చార్మినార్ ను అప్పటి కులీ కుతుబ్ షాహీ రాజులు నిర్మించారు. అన్ని వర్గాల ప్రజలకు సామరస్యపూరక, సౌభ్రాతృత్వంతో కూడిన, ఉదారమైన జీవన విధానాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ప్రస్పుటమయ్యేలా ఈ రాజముద్రలో రెండు రాజవంశాలకు చెందిన స్మారకాలను చేర్చారు.  లోగో ఏ సైజులో ఉన్నా కనిపించేలా స్పష్టత సంతరించుకుంది. ఇంక్‌తో ముద్రవేస్తే అచ్చుగుద్దినట్లే ఉండేందుకు అనువుగా తయారు చేశారు.

కాకతీయ కీర్తి తోరణం నేపథ్యం

తెలంగాణ రాజముద్రలో ప్రస్పుటంగా కనిపించే కాకతీయ తోరణానికి ఘనమైన చరిత్ర ఉంది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం(ప్రస్తుత వరంగల్)లోని కోట మధ్యలో నాలుగు దిక్కులా నాలుగు కీర్తి తోరణాలు దర్శనమిస్తాయి. ఇవి కాకతీయుల రాజసాన్ని మాత్రమే కాదు, కాకతీయుల కాలం నాటి పరిస్థితులను కూడా కళ్లకు కడతాయి. నిటారుగా నిలబడిన జంట శిలాస్థంభాలతో, శిల్పాలంకరణతో వెలిగిపోయే కీర్తితోరణం కాకతీయుల సామ్రాజ్య విజయ చిహ్నం. కాకతీయ సామ్రాజ్యపు కీర్తి రాజకీయంగా, భౌగోళికంగా నాలుగు వైపులా విస్తరించందని చెప్పడానికే ఓరుగల్లు కోటలో నాలుగు దిక్కులా నాలుగు తోరణాలు ఏర్పాటు చేశారనే భావన ఉంది. కానీ, కీర్తి తోరణంపై ఉన్న శిల్పాకృతులను గమనిస్తే కాకతీయ సామ్రాజ్యం సాధించిన జల సమృద్ధి, దాని ఫలితంగా వచ్చిన ఆర్థిక సౌష్టవానికి గుర్తింపుగానే వీటిని నెలకొల్పినట్లు తేటతెల్లమవుతుంది. ఈ తోరణాలు జలసంపదకు, పశుపక్షాదుల రక్షణకు, పౌరాణిక జంతువుల ఆరాధరణకు, సమస్త ప్రాణకోటిపై ఉన్న ప్రేమకు ప్రతీకలు కనిపిస్తాయి. చాలా లోతైన, నిర్మలమైన నీటిలో మాత్రమే ఉంటాయని చెప్పే హంసలు, మొసళ్లు కాకతీయ కీర్తి తోరణంలో ప్రముఖంగా కనిపిస్తాయి. భుజానికెత్తుకున్నట్లు తోరణ స్తంభాలకు రెండు వైపులా రాజసం ఒలక బోస్తున్న హంసలు, ఆకాశానికి ఎగురుతున్నట్లుండే మొసళ్లు, పద్మాలు, మొక్కలు, పూసలు, ముత్యాలు ఆనాటి జలసంపదకు ప్రతీకలు. తలక్రిందులుగా వేలాడినట్లున్న పూర్ణకుంభాలు అన్నపూర్ణకు, సప్త మాతృకలకు ప్రతీకలు. సింహం, గుర్రం పోలికలతో ఉండే దేవలోక జంతువు ఆకారం జంతుప్రేమకు నిదర్శనం. కీర్తి తోరణం నిజంగా చెప్పాలంటే జలసాధనా విజయకేతనం. కాకతీయుల మొదటి రాజధాని హన్మకొండ పద్మాక్షి గుట్ట దగ్గర ఏర్పాటు చేసిన మొదటి దశ తోరణం, ఐనవోలు, కొలనుపాకల్లో ఏర్పాటు చేసిన రెండో దశ తోరణంలో లేని ప్రత్యేకతలెన్నో వరంగల్ కోటలో ప్రతిష్టించించిన కీర్తి తోరణంలో కనిపిస్తాయి. కాకతీయుల తోరణాన్ని కేవలం వరంగల్ వాసులకు, తెలంగాణ ప్రాంతానికే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ప్రతీ తెలుగువాడు తన వారసత్వ ప్రతీకగా చూసుకుంటాడు. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ప్రపంచ తెలుగు మహాసభల్లో అధికారిక ముద్రగా ఈ కాకతీయ తోరణాన్నే వాడారు.

తోరణం నిర్మాణం

కాకతీయులు హన్మకొండ నుంచి శతృదుర్బేధ్యంగా ఉండే రాజధానిని నిర్మించుకునే క్రమంలో వరంగల్ కోటపై దృష్టి పడింది. రెండో ప్రోలరాజు కొత్త రాజధాని నిర్మాణానికి సంకల్పిస్తే, రుద్రదేవుడు ఆ పని ప్రారంభించాడు. 1252లో కాకతీయుల రాజధాని హన్మకొండ నుంచి ఏకశిలానగరానికి మారింది. రాజధానిగా మారిన తర్వాత కూడా గణపతిదేవుడి కాలం వరకు కోటలో నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాలంలోనే కోట మధ్యలో ఏకశిలకు సమీపంలో స్వయంభూ కేశవాలయం నిర్మించారు. ఆ ఆలయానికి నాలుగు దిక్కులా పెట్టిన స్వాగత తోరణాలే ఈ కాకతీయ తోరణాలు. కాకతీయుల ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడంతో ఇవే కీర్తి తోరణాలయ్యాయి.

తెలంగాణ రాజముద్రలో కాకతీయుల తోరణం ఉండాలనే భావన తెలంగాణ ఉద్యమ సమయంలోనే అందరిలో వచ్చింది. ఉద్యమం జరిగే సందర్భంలో కూడా మాటల్లో, చిత్రాల్లో, పాటల్లో కాకతీయ తోరణం ప్రస్తావన వచ్చేది. పరిపాలనలో కూడా సముద్రాల్లాంటి చెరువులను తవ్వించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసినారు కాకతీయులు. వారి ప్రభావం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై ఉందని చెప్పడం కూడా ఈ రాజముద్రలో కీర్తితోరణం ఉండడానికి కారణం కావచ్చు.

ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి 1261 లో పూర్తి చేసారు

చార్మినార్ చరిత్ర

ప్రపంచ చారిత్రక కట్టడాల్లో ఒకటైన చార్మినార్.. కులీ కుతుబ్ షాల అద్భుత నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యం. భారతదేశంలో అతితక్కువ స్థలం (840 చదరపు గజాల్లో) నిర్మించిన చారిత్రక కట్టడాల్లో ఒకటి.  క్రీ.శ.15వ శతాబ్దంలో కులీకుతుబ్ షాలు తమ రాజధానిని గోల్కొండ కోట నుంచి ప్రస్తుత హైదరాబాద్ నగరానికి మార్చారు. ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాద్ లో ప్లేగు (గత్తర) వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని పూర్తిగా అరికట్టాలని రాజు మహ్మద్ కులీ కుతుబ్ షా ప్రభువు అల్లాకు మొక్కుకోగా అది తగ్గిపోయింది. ఆ జ్ఞాపకార్థంగా రాజు మహ్మద్ కులీ కుతుబ్ షా  క్రీ.శ. 1591లో నాలుగు గోపురాలతో కూడిన ( చార్ మినార్) అందమైన  చార్మినార్ ను ఇండో పర్షియన్ పద్ధతిలో నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

చార్ తో విడదీయరాని బంధం

400 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్ కు చార్ తో విడదీయరాని బంధం ఉన్నది. నాలుగు మీనార్లు (గోపురాలు)తో కట్టడం వల్ల దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది. చార్మినార్ కు నలువైపులా 40 ముఖాల కొలతలు 4తో భాగించేలా నిర్మించారు. అలాగే 4 మినార్ ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా 4తో భాగించవచ్చు. ఈ చారిత్రక కట్టడం 4 రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికుడిలా ఉంటుంది. కాగా, చార్మినార్ నిర్మాణంలో ఆర్చ్ ల మొత్తాన్ని కలిపితే వచ్చే సంఖ్య 44, దీన్ని కూడా 4 తో భాగించవచ్చు. ప్రతి మినార్ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలున్నాయి. చార్మినార్ కట్టడంలోని ప్రతి కొలతలోనూ 4 అంకె ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రతి కోణంలోనూ నాలుగును ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కాగా, ప్రభుత్వం ఈ చార్మినార్ చుట్టూ 30 ఎకరాల స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసింది. ఫర్లాంగు దూరం వరకూ రక్షిత ప్రదేశంగా ప్రకటించి ప్రహరీ నిర్మించింది. చుట్టూ చెట్లు నాటించి, పచ్చదనాన్ని పెంచి అభివృద్ధి చేసి, ఈ చారిత్రక కట్టడాన్ని పరిరక్షిస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు

తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలకు అద్దం పట్టేలా అధికారిక చిహ్నాలను 2014 నవంబర్ 17న ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక చిహ్నాల ఎంపికలో చరిత్ర, పౌరాణిక నేపథ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు తదితర అంశాలను పరిగణ లోకి తీసుకుంది.  జింకను రాష్ట్ర జంతువుగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, జమ్మిచెట్టును రాష్ట్ర వృక్షంగా, తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్ర జంతువు జింక

భారతదేశ చరిత్రలో జింక భాగం. రామయణం లాంటి ఇతిహాసాల్లో జింకకు ప్రముఖ స్థానం ఉంది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో జింకలున్నాయి. చిన్నపాటి అడవులు, చెట్లలో కూడా జింకలు మనుగడ సాగిస్తున్నాయి. అడవి జంతువుల్లో అత్యంత సున్నితమైనదిగా, అమాయకమైనదిగా జింకకు పేరున్నది. నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, అనుక్షణం ప్రాణభయంతో, ఎవరికీ ఏ హాని తలపెట్టకుండా జింక తన జీవనాన్ని కొనసాగిస్తుంది. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందనే ఉద్దేశ్యంతో జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు.

రాష్ట్ర పక్షి పాలపిట్ట

తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ప్రతీ ఏటా ఘనంగా జరుపుకున్న దసరా పండుగ రోజు పాలపిట్టను దర్శించుకోవడం ఓ పుణ్య కార్యక్రమంగా భావిస్తారు. పాలపిట్టను శుభసూచనంగా ప్రజలు భావిస్తారు. లంకా నగరం మీద దండయాత్ర చేసే ముందు రాముడు పాలపిట్టను సందర్శించుకున్నారని, అందుకే అతడికి విజయం వరించిందని పౌరాణిక గాధలు తెలుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం విజయపథంలో నడవడానికి శుభసూచకంగా పాలపిట్టను రాష్ట్ర అధికార పక్షిగా ఎంపిక చేశారు.

రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు

జమ్మిచెట్టు తెలంగాణ ప్రజాజీవితంలో అంతర్భాగం. పాండవులు అజ్ఞాత వాసం చేసే సందర్భంలో ఆయుధాలను జమ్మిచెట్టుపైనే భద్రపరచారని పురాణగాథలు తెలుపుతున్నాయి. జమ్మిచెట్టుకు పూజలు చేసి, అక్కడి నుంచి ఆయుధాలు తీసుకెళ్లి యుద్ధం చేశారని, ఆ యుద్ధంలో పాండవులు విజయం సాధించారని చెబుతారు. జమ్మి చెట్టు శక్తిని, ఆశీర్వాదాన్ని అందింస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది.  దసరా పండుగ సందర్భంగా కూడా తెలంగాణ ప్రజలు జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. తెలంగాణకు మేలు చేస్తుందనే నమ్మకంతో జమ్మిచెట్టును రాష్ట్ర వృక్షంగా ఎంపిక చేశారు.

రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు

తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అడవిలో సహజసిద్ధంగా పెరిగే తంగేడు పువ్వు ప్రకృతికే అందాన్ని తెస్తుంది. తంగేడు పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా తెలంగాణ ఆడపడుచులు విశ్వసిస్తారు. బతుకమ్మను పేర్చడానికి ఖచ్చితంగా తంగేడు పూలనే వాడతారు. ఔషధ గుణాలు కూడా కలిగిన తంగేడు పువ్వు తమ బతుకును పచ్చగా మారుస్తుందని, చెరువు నీటిని శుద్ది చేస్తుందని ప్రజల విశ్వాసం.

ఐదురోజుల పాటు అయుత చండీ యాగం నిర్వహణ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యక్తిగత హోదాలో అత్యంత భక్తి శ్రద్ధలతో 2015 డిసెంబర్ 23 నుంచి 27 వరకు అయిదు రోజుల పాటు అయుత చండీయాగం నిర్వహించారు. శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి ఆధ్వర్యంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన 15 వందల మంది రుత్విక్కులు యాగాన్ని ప్రారంభించారు. 

మొదటిరోజు: ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు ఆవరణ ప్రవేశం చేశారు. గురు ప్రార్థనతో చండీమాత విగ్రహం ముందు మొదటి రోజు కార్యక్రమం మొదలయింది. గణపతి మహాపూజ, మహా సంకల్పం జరిగింది. ఇందులో గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా పాల్గొన్నారు. గోపూజ, మహా మంటప స్థాపనం, చండీయంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతా ఆవాహనము, ప్రాణప్రతిష్ట, నవావరణార్చన, ఏకాదశ న్యాసపూర్వక సహస్ర చండీ పారాయణము, పంచబలి, యోగినీ బలి, మహారుద్రయాగ సంకల్పం, రాజశ్యామల, మహారుద్ర పురశ్చరణా చతుర్వేద యాగ ప్రారంభం, మహా సౌరము, ఉక్తదేవతా జపములు, మంత్ర పుష్పం తదితర కార్యాలు జరిగాయి. చండీయాగం విజయవంతం కావాలని శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి సందేశంతో కూడిన లేఖను పంపారు. ఈ లేఖను యాగశాలలో రుత్విజులు చదివి వినిపించారు.

రెండోరోజు : చండీమాత విగ్రహం ముందు ప్రధాన రుత్విజులు గోపీకృష్ణ శర్మ, పణిశశాంక శర్మ, హరినాథశర్మలు శృంగేరి పీఠం నుంచి ప్రత్యేకంగా వచ్చిన నరహరి సుబ్రహ్మణ్య భట్ ఆధ్వర్యంలో గురుప్రార్థన జరిపారు. ‘‘శ్రీ సచ్చిదానంద.. చంద్రశేఖర భారతీ తీర్థ… విద్యాతీర్థ గురుంభజే… వందే గురు పంరంపఠ.. సాష్టాంగ ప్రమాణ సమర్పయామి’’ అంటూ రుత్వికులంతా ముఖ్యమంత్రి దంపతులతో సహా గురు ప్రార్థన చేశారు. తర్వాత రెండువేల సప్తశతి, 30 లక్షల నవారణః పూజ, శతుష్షష్టి యోగిని బలి, మహా గణపతి పూజలు ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. రెండో రోజు కార్యక్రమంలో గురుప్రార్థనతో పాటు గోపూజ, ఏకాదశన్యాస పూర్వక ద్విసహస్ర చండీ పారాయణములు, మహా ధన్వంతరీ యాగము, రాజశ్యామల చతుర్వేద మహరుద్ర పురశ్చరణలు, మహా సౌరము, ఉక్త దేవతా జపములు, కుమారి, సువాసినీ, దంపతీ పూజ, మహా మంగళ హరతి తదితర కార్యక్రమాలు జరిగాయి. 

శివపార్వతుల విగ్రహాల దగ్గర రుద్రక్రమార్చనలో సిఎం పాల్గొన్నారు. మంగళహారతి కార్యక్రమం, చతుర్వేద పారాయణం జరిగాయి. ధార్మిక ప్రవచనంలో భాగంగా యాగమహిమ, దత్త జయంతి విశేషాలు పురాణం మహేశ్వరశర్మ సవివరంగా ఆహుతులకు తెలియజేశారు. మరోసారి హరతి కార్యక్రమం ముగిసిన తర్వాత కార్యక్రమం చండీ విగ్రహం దగ్గర జరిగింది. లలితా నామావళి, కోటి నవాక్షరీ పురశ్చరణ, విశేష పూజ ఆశ్లేషాబలి, అష్టవధర సేవ జరిగాయి. మొదటిరోజు మాదిరిగానే శ్రీరామ లీల హరికథా కార్యక్రమం జరిగింది.

        సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథిరెడ్డి, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, యశోదా హాస్పిటల్స్ డైరెక్టర్ సురేందర్ రావు తదితరులు పూజలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పాల్గొన్నారు. శృంగేరి బాలి పీఠాధిపతి విధుశేఖర భారతీ మహాస్వామి తండ్రి కుప్ప శివసుబ్రహ్మణ్యం, తాత కుప్ప గోపాల వాజపేయి యుజి యాగంలో పాల్గొని సిఎం కేసీఆర్ ను ఆశీర్వదించారు. సాయంత్రం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, ఎన్.టి.వి. భక్తి టివి చైర్మన్ టి.నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. దాదాపు లక్షకు పైగా భక్తులు రెండోరోజు యాగంలో పాల్గొనగా, వారందరికీ అన్న ప్రసాదం, తీర్ధ ప్రసాదాలు, పసుపు కుంకుమ అందించారు.

మూడవ రోజు : సప్తశథీ పారాయణం ప్రారంభించే ముందు పూర్వాంగం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అంతర మాతృకన్యాసాలు, బహిర్ మాతృకన్యాసాలు, చండీ కవచం, అర్గళ, కీలక పఠనం, ఏకాదశిన్యాసాలు నిర్వహించారు. శరీరంలో అమ్మవారిని ఆవాహన చేసుకునేందుకు రుత్విజులు పాటించే సంప్రదాయ కార్యక్రమమిది. యాగశాల ప్రాంగణాన్ని చామంతి, బంతి పూలతో ప్రత్యేకంగా అలంకరించి ఆకర్శనీయంగా మార్చారు. గురు ప్రార్థన, పూర్వాంగం తర్వాత ముఖ్యమంత్రి దంపతులు యాగశాలను కలియతిరిగి రుత్విజులకు అభివాదం చేశారు. చతుర్వేద పారాయణ యాగశాలల్లో చేసిన పూర్ణాహుతి కార్యక్రమంలో అతిథులతో సహా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాజశ్యామల యాగశాలలో కూడా పూర్ణాహుతి జరిగింది. పదివేల జపాలతో వేయి పుష్పాలతో యాగశాల నలుదిక్కులా శాస్త్రోక్తంగా, సంప్రదాయ బద్దంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అతిథులతో పాటు ప్రదక్షిణ చేసిన వేలాదిమంది భక్తి శ్రద్దలతో తిలకించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి, శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిలకు ముఖ్యమంత్రి పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు ఉదయం పూట పూజల్లో పాల్గొని, అన్న పాసాదాలు స్వీకరించారు. ఆంద్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ కొడెల శివప్రసాద్ రావు, మీడియా సంస్థల అధిపతులు గిరీష్ సంఘి, గౌతమ్, వి.రాధాకృష్ణ, శైలజా కిరణ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

నాల్గవ రోజు :

వివిధ జిల్లాలు, పరిసర గ్రామాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు చేస్తున్న ప్రదక్షిణ, భక్తి శ్రద్దల కోలాహలం, చండీమాత నామస్మరణ మధ్య నాలుగవ రోజు అయుత చండీ మహాయాగం సాగింది.  ముందు మహా సరస్వతి, మహకాళి, మహలక్ష్మి విగ్రహాల ముందు గరుప్రార్థన చేశారు.  వివిధ రకాల పూలతో అలంకరించడంతో అమ్మవారి విగ్రహాలు, చండీయాగం ప్రాంగణం సువాసనలతో, ఆకర్షణీయమైన ఆకృతులతో ఆకట్టుకుంది. శృంగేరి పీఠం నుంచి చండీయాగం నిర్వహణ కోసం వచ్చిన ప్రధాన యజ్ఞ బ్రాహ్మణులు నరహరి సుబ్రహ్మణ్య భట్‌, తంగిరాల శివకుమార్‌ శర్మ ఆధ్వర్యంలో  రుత్విజులు, ముఖ్యమంత్రి సహా ప్రాంగణంలో ఉన్న వారంతా కృతజ్ఞతా, ఆరాధానా భావంతో చేసిన గురుప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. “శంకరాచార్యమాశ్రయే… శ్రీ సచ్చిదానంద స్వామినా… భారతీ తీర్థ మాశ్రయే… ఓం శాంతిశాంతి శాంతి.. శ్రీమత్‌ జగద్గురు… గురుబ్రహ్మ, గరువిష్ణు, గురు సాక్షాత్‌ పరమేశ్వరా” అంటూ రుత్విజులు చేసిన భారతీ తీర్థ గురు స్తోత్ర పఠనతో ప్రాంగణం మారు మోగింది.  మహా గణపతి పూజ, సప్తశతి చండీ పారాయణం, నవావరణ పూజ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం తదితర కార్యక్రమాలు ఉదయం పూట జరిగాయి. 

ముఖ్యమంత్రితో పాటు పూజల్లో పాల్గొన్న నరసింహన్‌ దంపతులు యాగశాల చుట్టూ సిఎంతో పాటు ప్రదక్షిణ చేశారు. తమిళనాడు గవర్నర్‌ కోణిజేటి రోశయ్య, సుప్రింకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ,  సుప్రింకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి, తమిళనాడు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుభాషణ్‌ రెడ్డి,  మాజీ న్యాయమూర్తులు స్వరూప్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాష్ట్ర  హైకోర్టు న్యాయమూర్తులు నవీన్‌రావు, రాజశేఖర్‌ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి శరద్‌పవార్‌, టిటిడి జెఇఒ శ్రీనివాసరాజు, రాజ్యసభసభ్యుడు సుబ్బరామిరెడ్డి, మాజీ మంత్రులు జె.గీతారెడ్డి,  దానం నాగేందర్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌. ప్రభాకర్‌,  సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌, శివాజిరాజా, మిమిక్రి శివారెడ్డి,  సీనియర్‌ ఎడిటర్‌ కె.రామచంద్రమూర్తి, టివి 5 చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

పుష్పగిరి పీఠాధిపతి, హలిదీపురం పీఠాధిపతి, గోపాలకృష్ణ మఠ పీఠాధిపతి, మాదవీనంద స్వామి, కపిలేశ్వరస్వామి,  కమలానంద భారతి తదితరులు పాల్గొని కేసిఆర్‌ దంపతులను ఆశీర్వదించారు. 

జస్టిస్‌ రమణ పండ్ల బుట్టలతో వచ్చి  చండీ రూపాలకు సమర్పించారు.  టిటిడి తరపున జెఇఓ శ్రీనివాసరాజు ముఖ్యమంత్రికి స్వామి వారి ప్రసాదం అందించారు.   మఠాధిపతులకు పండ్లు, వస్త్రాలను ముఖ్యమంత్రి అందించి, పాదాభివందనం చేశారు.

వేద విద్యా వికాసానికి ఆరు దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా కొనసాగిస్తున్న కార్యదీక్షకు గుర్తింపుగా మాడుగుల మాణిక్య సోమయాజులు దంపతులకు ముఖ్యమంత్రి దంపతీపూజ,  ప్రత్యేక సన్మానం చేశారు.   స్వర్ణ కంకణం తొడిగి సోమయాజులును ఘనంగా సత్కరించారు.  

సాయంత్రం జరిగిన రుద్ర క్రమార్చన, సప్తశతీ పారాయణం, ఇతర కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దంపతులు, మఠాధిపతి విద్యా స్వరూపానంద స్వామి, సినీ నటుడు అక్కినేని నాగార్జున, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, 6 టివి ఛైర్మన్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మృదంగ విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. కుంకుమార్చనను ముఖ్యమంత్రి దంపతులు ప్రారంభించారు. మహిళలకు చీరలు, కుంకుమ, పసుపు పంపిణీ చేశారు.

ఐదవ రోజు : చివరిరోజు కార్యక్రమంలో గురుప్రార్థన, పూర్వాంగం తర్వాత పూర్ణాహుతికి ఆరంభంగా ప్రధాన హోమ గుండంలో అగ్ని ప్రతిష్ట జరిగింది. చతుర్వేద యాగశాలల్లో, రాజశ్యామల యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయ్యింది. ప్రధాన గుండంలోని అగ్ని ద్వారా మొత్తం వంద గుండాల్లో అగ్ని ప్రతిష్ట జరిగింది. అంతిమ పూర్ణాహుతి కార్యక్రమానికి గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. దాదాపు రెండు వేల మంది రుత్వికులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి జరిపారు.

యాగం ఆదివారం సాయంత్రం పూర్ణాహుతితో ముగిసింది. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌  రావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అయుత మహా చండీ యాగం గత నాలుగు రోజుల మాదిరిగానే  గురుప్రార్థన,  మహాగణపతి పూజ, పుణ్యహవచనం, కుండ సంస్కారం జరిగిన తర్వాత  ప్రధాన హోమ గుండంలో అగ్ని ప్రతిష్టను రుత్విజులు నిర్వహించారు.   యాగశాల  లోపల వున్న 101 హోమ గుండాల దగ్గర 1100 మంది రుత్వికులు, వారికి కావాల్సిన సమిధలు, పాయసం, నెయ్యి, కర్పూరం తదితర పూజా సామాగ్రిని ఇతర బ్రాహ్మణులు సమకూర్చారు.  ప్రధాన గుండంలో  అగ్ని ప్రతిష్ట తర్వాత అగ్నిని ఆవాహన చేశారు.  దానిని అగ్ని విహరణము అనే ప్రక్రియ ద్వారా మిగిలిన నూరు గుండాలలో ప్రతిష్ట చేశారు.   మహా పూర్ణాహుతి చేయడానికి ముందు చతుర్వేద, మహారుద్ర, రాజశ్యామల యాగశాలల్లో పూర్ణాహుతి జరిగింది.  అగ్ని విహరణలో భాగంగా జరిగిన హోమంలో ప్రతి రుత్విజుడు సప్తశతి మంత్రాలతో 700  ఆహుతులను పరమాన్న ద్రవ్యంగా ఇచ్చారు.  1000 ఆహుతులను ఆజ్యద్రవ్యంగా ఇచ్చారు.  7 లక్షల పరమాన్న ద్రవ్యం, 10 లక్షల ఆజ్య ద్రవ్యం ఆహుతి చేశారు.  అంతకుముందు జరిగిన తర్పణంలో వంద మంది రుత్వికులు పూర్వాంగ, ఉత్తరాంగ సహితంగా 700 మంత్రాలతో తర్పణం ఇచ్చారు.  7 లక్షల నవాక్షరి మంత్రం కూడా జపించారు.   అభిషేక జలాలతో యజమాని (కేసిఆర్‌) దంపతులకు అవభృతం చేయించారు.   పూర్ణాహుతి కార్యక్రమాల్లో హాజరైన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఉప ముఖ్యమంత్రి కెఇ.కృష్ణముర్తి, మంత్రి ఘంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు, స్పీకర్‌ మధుసూధనాచారి, రిటైర్డ్‌ జడ్జి ఎల్‌. నర్సింహరెడ్డి, సినీ ప్రముఖులు జమున, తనికెళ్ల భరణి, డి.సురేష్‌బాబు వున్నారు.

శ్రీ సహస్ర మహా చండీయాగం : (21 జనవరి, 2019 నుంచి 25 జనవరి 2019 వరకు)

దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ లోక కల్యాణార్థం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపెట్టిన శ్రీ సహస్ర మహా చండీయాగాన్ని 21 జనవరి    సోమవారం  ఉదయం 11.00 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో యజ్ఞ వాటికలో వేదోక్తంగా ప్రారంభించారు. విశాఖ పట్టణం నుంచి ప్రత్యేకంగా తరలివచ్చిన శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సమక్షంలో యజ్ఞం ప్రారంభమయింది. కర్ణాటకలోని శృంగేరి  పీఠానికి చెందిన తంగిరాల సీతారామ శాస్త్రి, మాడుగుల మాణిక్య సోమయాజులు,  ఋగ్వేద పండితులు  నరేంద్ర కాప్రే తదితర ప్రముఖులు యాగానికి వైదిక సారథ్యం వహించారు. పూజా కార్యక్రమాలు వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ,  మంగళంపల్లి వేణుగోపాలశర్మ, శాస్త్రుల వెంకటేశ్వరశర్మ , ఫణి శశాంకశర్మ, గంగవరం నారాయణశర్మ, జి.కామేశ్వరశర్మ, కాసుల చంద్ర శేఖరశర్మల నిర్వహణలో అత్యంత వైభవంగా జరుగుచున్నవి. ఈ యాగ కార్యక్రమ సమన్వయకర్తగా శ్రీ అష్టకాల రామ్మోహనరావు వ్యవహరిస్తున్నారు.

300 మంది ఋత్విజులు 1000 మోదకాలతో ప్రత్యేక హవనం

దుర్గా సప్తశతి పారాయణ క్రతువును ప్రారంభించడానికి ముందు నిర్విఘ్నంగా కొనసాగాలనే తలంపుతో సుమారు 300 మంది ఋత్విజులు 1000 మోదకాలతో ప్రత్యేక హవనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు ఋత్విజులు వేద మంత్రాలు వల్లిస్తుండగా.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు పసుపురంగు పట్టువస్త్రాలు ధరించి యజ్ఞవాటిక చుట్టూ  ప్రదక్షిణలు చేసి చండీ యజ్ఞవాటికలో పుణ్యాహవచనం నిర్వహించారు.  అనంతరం శాస్త్రోక్తంగా గోపూజ, గురుపూజ జరిగింది.  అరణి నుంచి అగ్నిని మధించడం ద్వారా రగిలిన నిప్పుతో  4 యజ్ఞాలు ప్రారంభమయ్యాయి. సుమారు 3 గంటలపాటు సీఎం దంపతులు యాగవాటికలోనే ప్రత్యేక పూజలు జరిపారు. వైవాహిక స్వర్ణోత్సవాలు జరిగిన వయో వృధ్ధ దంపతులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు దంపతీ పూజలు, కన్యాకుమారి పూజలు నిర్వహించారు.   

రెండవ రోజు..

మహా రుద్ర సహిత శ్రీ సహస్ర మహా చండీ యాగ పాంచాహ్నిక దీక్షలో భాగంగా రెండవ రోజు మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుండి వంద మంది ఋత్వికులు గులాబీరంగు వస్త్రాలు ధరించి 200 చండీ పారాయణాలు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు మహాహారతి, మంత్ర పుష్పముతో మాద్యాహ్నిక పూజలు పూర్తి చేశారు . సాయంత్రం 4 గంటల నుండి 3 లక్షల నవార్ణ జపము పూర్తి చేశారు . రాత్రి 7.30 కి మహా హారతి మంత్ర పుష్పము , చతుర్వేద సేవలు , తీర్ధ ప్రసాద వితరణ కార్యక్రమాలు పూర్తి చేశారు .

మూడో రోజు..

శ్రీ సహస్ర మహా చండీయాగం మూడో రోజు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉదయం చతుర్వేద యాగ పురస్సర మహారుద్ర జపాభిషేక హవన సహిత సహస్ర శ్రీ చండీ మహా యాగమును పురస్కరించుకుని ప్రాతఃకాల పూజానంతరం ఋత్విజులు 300 చండీ పారాయణాలు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దంపతులు, కుటుంబ సభ్యులు ధవళ వస్త్రాలు ధరించి యాగశాలకు చేరుకొని సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మొదట రాజశ్యామల మంటపానికి చేరుకొని అమ్మవారికి తొలి పూజ చేశారు. మహాకాళీ, మహా సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. బ్రహ్మ స్వరూపిణి మంటపంలో పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి అభిషేకం చేశారు. నవగ్రహ పూజలు నిర్వహించారు. వేద పారాయణ చతుర్వేద పారాయణ మంటపంలో ప్రార్థనలు చేశారు. సూర్య నమస్కారాలు చేశారు . సహస్ర మహా చండీ పారాయణ మంటపంలో చండీమాత పూజలు నిర్వహించారు. మహారుద్ర మంటపంలో రుద్ర హవనం , రుద్ర పారాయణ నిర్వహించారు. అనంతరం  ఋత్విజులు సాయంకాలం 4 గంటల నుండి 2 లక్షల నవార్నజపములు పూర్తిచేశారు. సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు మహాహారతి, మంత్ర పుష్పము తీర్ధ ప్రసాద వితరణతో సహస్ర చండీయగం మూడో రోజు పరిసమాప్తి అయింది.

నాలుగవ రోజు..

శ్రీ సహస్ర  మహా ఛండీయాగం నాలుగవ రోజు కార్యక్రమంలో భాగంగా తేదీ.24 జనవరి 2019 గురువారం రోజున యాగకర్త, ఋత్విక్కులు, వేద పండితులు ఎరువురంగు వస్త్రాలు ధరించి పూజల్లో పాల్గొన్నారు. ఎరుపురంగు వస్త్రాలు ధరించి ఉదయమే సతీసమేతంగా యాగశాలలో  ప్రవేశించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మొదట రాజశ్యామల మాత మంటపంలో పూజలు నిర్వహించారు. శ్రీ మహాకాళి , మహాలక్ష్మి , మహా సరస్వతి , స్వరూపిణిగా శ్రీ రాజశ్యామలాదేవిని సువర్ణ మంత్ర పుష్పాంజలితో సీఎం కేసీఆర్ దంపతులు ప్రార్ధించారు. రాజశ్యామల మంటపంలో సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.

అనంతరం మహారుద్ర మంటపంలో జరిగిన పూజలో సీఎం పాల్గొన్నారు. మహారుద్ర సహిత రుద్ర ఏకాదశిని పఠన రుద్ర నమకం , రుద్ర చమకం పటించారు. పంచాక్షరి జపంలో భాగంగా శివశివ శంకర భూత పతే , శంకర శివ , శంభో మహాదేవ , హరహర మహాదేవ అనే ప్రార్ధనలు యగశాలలో మార్మోగాయి .

బ్రహ్మ స్వరూపిణి బగళాముఖి మంటపంలో సీఎం దంపతుల సమక్షంలో వేదపండితులు , ఋత్వికులు పూజలు చేశారు. గౌరీ నారాయణ నమస్తుతే , పీతాంబర దేవీ నమస్తుతే , జయతే, విజయతే, జయ విమలే బగలే అంటూ దేవిని స్తుతించారు. శతమానం భవతే అంటూ పండితులు సీఎం దంపతులను దీవించారు. నవగ్రహ మంటపంలో ఆదిత్య హృదయం పఠనం, సూర్య నమస్కారాలు నిర్వహించారు. చండీమాత ప్రధాన యాగశాలలో రాజరాజేశ్వరి మాత ప్రార్ధన చేశారు. భువనేశ్వరి, బ్రహ్మాండ కుటుంబినీ, శ్రీ గణనాధ పార్వతీ నందన, పాపవిమోచన అంటూ ప్రార్థనలు నిర్వహించారు. ఋత్వికులు 400సార్లు చండీ సప్తశతి పారాయణం చేశారు. వేదపండితులు యాగం వీక్షించడానికి వచ్చిన భక్తులకు సుభాషితాలు వినిపించారు. యాగ విశిష్టతను వివరించారు. మహా హారతితో ఉదయం పూట కార్యక్రమాలు ముగిశాయి.

వివిధ యాగాల వివరాలు :

మహారుద్ర యాగము..

ఉదయం 9 గంటలకు శాంతి పాఠంతో ప్రారంభమైన మహా రుద్ర యాగం 41 ఏకాదశ అభిషేకాలు పూర్తి చేశారు. సాయంత్రం 3 గంటల నుంచి 41 ఏకాదశ రుద్ర హోమాలు పూర్తి చేసుకొని క్రమార్చణ  హారతి , మంత్ర పుష్పము , తీర్ధ ప్రసాద వితరణతో పూర్తయింది .

రాజశ్యామల యాగము..

రాజశ్యామల యాగములో భాగంగా మంగళవారం  ఋత్వికులు రాజశ్యామల అనుష్టానం , హోమం, రాజశ్యామల మహావిద్య పారాయణం , హోమం , సహస్ర నామార్చన నిర్వహించారు.

బగళాముఖి..

ఉదయం 9 గంటలకు 10 మంది ఋత్వికులు  పది వేల జపము పూర్తి చేశారు . సాయంకాలం 10 మంది ఋత్వికులు 10 వేల జపాలు, హరిద్రాన్నంతో 2 వేల మూల మంత్ర హవనము పూర్తి చేశారు.

ప్రతిరోజూ వేద పారాయణాలు

ప్రతి రోజూ ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అధర్వణ వేదము మరియు శుక్ల యజుర్వేదము పారాయణములు హవనాదులు, సుందరాకాండ, విరాటపర్వ, మహా సౌర పారాయణాలు జరుగుచున్నవి . ఈ కార్యక్రమాలన్నీ శృంగేరి పీఠాధిపతులు, శారదా పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో విద్వదాహితాగ్ని  బ్రహ్మశ్రీ మాడ్గుల మాణిక్య సోమయాజులు గురువు గారి పర్యవేక్షణలో జరుగుచున్నవి.

ఐదవ రోజున మహా పూర్ణాహుతి…

శ్రీ సహస్ర చండీ యాగం చివరి రోజు (ఐదవ రోజు) 25 జనవరి 2019 రోజున ఇప్పటివరకు చేసిన పారాయణాలు, జపాలకు తద్దశాంశ హోమ తర్పణాలను నిర్వహించారు. ప్రధాన కలశం అధిష్ఠాన దేవత మంటపం వద్ద శారదా కల్పవృక్షం అనుసరించి అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించారు. అనంతరం చతుషష్టి యోగినీ బలి, మంగళ నీరాజన సేవ నిర్వహించారు. తదుపరి అగ్నిమథనం ద్వారా అగ్నిప్రతిష్ఠ చేసి పది కుండాల వద్ద ఇదే అగ్నితో హోమం ఆరంభించారు. పది యజ్ఞ కుండాలలో ఒక్కో యజ్ఞకుండం వద్ద ఆచార్య బ్రహ్మతో కలిపి పదకొండు మంది వేద పండితులు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన• ద్రవ్యాన్ని ఆహుతులిస్తూ హోమాన్ని నిర్వహించారు. అనంతరం అష్టదిక్పాలక బలి, ప్రాయశ్చిత్త హోమాలను నిర్వహించారు. 700 సప్తశతి (చండీ) శ్లోకాల స్వాహాకారాలకు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని యజ్ఞభగవానుడికి హవిస్సుగా సమర్పించారు.

మహాపూర్ణాహుతిలో భాగంగా చండీయాగ మంటపంలోని అన్ని యజ్ఞకుండాల అగ్నిని ప్రధాన యజ్ఞ కుండంలోకి తీసుకువచ్చి మహాపూర్ణాహుతిని ఆరంభించారు. యజ్ఞ ఆచార్యుడు మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, ఖర్జూర, వక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జీడిపప్పు, పటికబెల్లం, బాదం, పచ్చకర్పూరం, గంధకచూరాలు, పూలు, పండ్లు, తమలపాకులు, పట్టుచీర, మారేడుకాయలు తదితరాలను పూర్ణాహుతిలో భాగంగా యజ్ఞభగవానుడికి సమర్పించారు. తరువాత వసోర్ధార.. అంటే నెయ్యిని ధారగా పూర్ణాహుతి అనంతరం యజ్ఞభగవానుడికి సమర్పించే పక్రియ సాగింది. ఇదేవిధంగా మహారుద్ర, రాజశ్యామల, బగళాముఖి, చతుర్వేద, నవగ్రహ యాగ మంటపాల్లో కూడా షోడశోపచార పూజలు చేసి, హోమాల అనంతరం పూర్ణాహుతిని నిర్వహించారు. సువాసిని పూజ, మహదాశీర్వచనం, ఋత్విక్‌ సన్మానం నిర్వహించారు.

పాయస ద్రవ్య విశేషాలు : యాగంలో చివరి రోజు శుక్రవారం నాడు చండీమాత యాగశాలలో అగ్నిస్థాపన చేసి (మిగిలిన నాలుగు రోజులు కేవలం పారాయణం, జపం మాత్రమే చేశారు) హోమాన్ని నిర్వహించారు. చండీ సప్తశతి(700)లోని ప్రతి శ్లోకానికీ (‘‘ప్రతి శ్లోకం జుహుయాత్‌ పాయసం, తిల సర్పిషా’’) నువ్వులు, నెయ్యితో పాటు పాయసాన్ని కలిపి ఆహుతులు ఇచ్చారు. సుమారు వెయ్యి కిలోల పాయస ద్రవ్యాన్ని దీని కోసం వినియోగించారు. ఈ పాయసాన్ని బియ్యం, నెయ్యి, పాలు, బెల్లం, తేనె, యాలుకలు, జీడిపప్పు, కిస్మస్‌ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారుచేశారు.

  ” కలే చండీ విశిష్యతే ” కలియుగంలో త్వరగా ఫలితాన్ని ఇచ్చేది చండీ దేవత. ఆమెను ఉపాసించి ఎంతోమంది సత్ఫలితాలను పొందారు. అమ్మవారితోనే ఈ సప్తశతిలో ఒక మాటను అన్నది. ఎక్కడైతే ఈ సప్తశతి పఠించబడుతుందో అక్కడ నేనుంటాను. కేవలం ఉండటమే కాకుండగా సదామత ద్విమోక్షామి, ఎప్పుడూ ఆ ప్రాంతాన్ని విడిచి ఉండను అన్నది.ఆమె ఎక్కడ ఉంటే అది మణి ద్వీపము, సుభిక్షము, సస్యశ్యామలము అయి ఉంటుంది. అందువల్ల చండీ ఉపాసన ప్రశస్త్యమై యున్నది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు చండీ సంబంధమైన అన్ని రకాల ఉపాసనలు చేశారు. దేశ క్షేమము, లోక సంరక్షణమే ప్రధాన ద్యేయంగా సంకల్పించి రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, చతుర్వేద, మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగాన్ని చేయతల పెట్టి శృంగేరీ జగద్గురులు శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి, విధుశేఖర భారతీ మహా స్వాములవారి ఆశీస్సులను అందుకొని గత నాలుగు రోజుల నుండి గణపతి సహస్ర మోదక హోమము, రాజశ్యామలా మహా మంత్రానుష్టానము, లక్ష బగలాముఖీ మహా మంత్రానుష్టానము, వెయ్యి చండీ పారాయణములు, మహారుద్ర మంత్రముల అనుష్టానములను చేసి, దశాంశ హోమ పక్షమును ఆశ్రయించి, శుక్రవారం 25 వ తేదీనాడు ఉదయం 11 గంటల నుండి మహాద్భుతంగా అన్ని యాగముల పూర్ణాహుతులు చేసి సహస్ర చండీ మహా యాగ పూర్ణాహుతి ని అత్యంత వైభవముగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విశాఖ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యక్షంగా పాల్గొని అనుగ్రహించారు. శృంగేరీ, జీయర్, ఉడిపి పీఠాల నుండి ప్రసాదాలు ప్రసాదాలు వచ్చినయి. కార్యక్రమానంతరం సీఎం కేసీఆర్ ఋత్వికులను ఘనంగా సన్మానించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పర్యాటకంపై ప్రత్యేక దృష్టి

ట్రెండింగ్‌

Advertisement