e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home Telangana మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

మంచినీరు, రహదారులు, విద్యుత్, గృహ నిర్మాణం లాంటి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నది.

ప్రతీ ఇంటికి ప్రతిరోజు సురక్షిత మంచినీరు అందించడానికి ‘మిషన్ భగీరథ’

స్వతంత్ర్యం సిద్దించి ఏడు దశాబ్దాలు దాటినా చాలా ప్రాంతాల్లో ప్రజలు మంచీనీటికి అలమటించారు. పరిశుభ్రమైన మంచినీరు లేక ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. మారుమూల పల్లెలు, ఆదివాసీ గూడేలు, లంబాడి తండాలు, ఎరుకుల వాడలు తదితర ఆవాస ప్రాంతాలకు మంచినీటి భాగ్యమే కలగలేదు. ఎండాకాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ప్రధాన ఆవాసాలకు కూడా ప్రతీ రోజు మంచినీటి సరఫరా జరిపే పరిస్థితి లేదు. దీంతో ప్రజలు మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లి, వ్యవసాయ బావుల వద్ద, చెరువుల వద్ద, నదుల చెలిమల ద్వారా మంచినీరు తెచ్చుకునే వారు. ఈ అవస్థలు గమనించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సురక్షిత మంచినీరు ఇవ్వడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం అని  ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రతీ ఇంటిలో నల్లా ద్వారా మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకం చేపట్టింది. తెలంగాణకు ఇరువైపులా ఉన్నా గోదావరి, కృష్ణా నదుల ద్వారా నీటిని తోడి, వాటిని శుద్ధి చేసి, ప్రతీ రోజు ప్రతి ఇంటికి నల్లా ద్వారా అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

2015 జూన్ 8న శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రోజుల తరబడి మేధోమథనం చేసి మిషన్ భగీరథ పథకం స్వయంగా రూపొందించారు. మొత్తం ప్రాజెక్టు డిజైన్ కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగింది. ప్లానింగ్ అంతా పూర్తయ్యాక పనులను కూడా కేసీఆర్ ప్రతిరోజూ పర్యవేక్షించారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సీఎం నేరుగా రంగంలోకి దిగేవారు. దీంతో శరవేగంగా ఈ పథకం పూర్తయింది. ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో ఈ పథకానికి సీఎం కేసీఆర్ 2015 జూన్ 8వ తేదీన శంకుస్థాపన చేశారు.

మిషన్ భగీరథ స్వరూపం : రూ.45,028 కోట్ల వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును 26 ప్రధాన సెగ్మెంట్లుగా విభజించారు. కృష్ణ, గోదావరి నదులతోపాటు, ఇతర జలాశయాల నుంచి 86 టీఎంసీల నీరు తీసుకోవడానికి 67 ఇన్ టేక్ వెల్స్, 153 నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు నిర్మించారు. మొత్తం 1 లక్ష 40 వేల కి.మీ. పైప్ లైన్లతో, 35,514 ఓ.హెచ్.ఆర్. ల ద్వారా పల్లెకు, పట్టణానికి, ప్రతీ ఇంటికీ భగీరథ నీరు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంచినీటి సరఫరా వ్యవస్థకు అవసరమైన 180 మెగావాట్ల విద్యుత్ ను ఎక్కడా అంతరాయం లేకుండా అందించేందుకు 44 డెడికేటెడ్ సబ్ స్టేషన్లు, 1210 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు వేశారు.

తెలంగాణ చూపిన దారిలో మిషన్ భగీరథ పథకం అమలు చేయడానికి 11 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి.దేశంలోనిఅన్నిరాష్ట్రాలుమిషన్భగీరథపథకాన్నిఅమలుచేయడంమంచిదనినీతిఆయోగ్సిఫారసుచేసింది. ఇదిమిషన్భగీరథకుదక్కినగొప్పప్రశంస.

మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోడీ

మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని నరేంద్రమోడీ మిషన్ భగీరథ పథకాన్ని 2016 ఆగస్టు 7న ప్రారంభించారు. మిషన్‌ భగీరథ పైపుల ద్వారా ప్రతీ ఇంటికి మంచినీళ్లు ఇవ్వడంతోపాటు, ప్రతీ ఇంటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ కూడా వేశారు.

ప్రాజెక్టుకు అవసరమైన నిధులు – నీళ్లు :  గోదావరి, కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రధాన రిజర్వాయర్ల నుంచి 2018 జనాభా అవసరాలకు అనుగుణంగా 86 టీఎంసీల నీటిని తీసుకుంటున్నారు. ఈ పథకానికి 180 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ప్రాజెక్టు అమలు, నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ ఛైర్మన్‌గా, పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎండీగా తెలంగాణ తాగునీటి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను నాబార్డ్, హడ్కోతో పాటు 18 జాతీయ బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. రూ. 12 వేల కోట్ల రుణాన్ని వివిధ ఆర్ధిక సంస్థలు అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 6660 కోట్లను మార్జిన్ మనీగా చెల్లించింది. రూ.5366 కోట్ల రుణాన్ని హడ్కో, నాబార్డ్, మిగతా నిధులు ఇతర సంస్థలు అందించాయి.

మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదు

 • ఐ.ఎన్.ఆర్.ఈ.ఎం అధ్యయనంలో వెల్లడి (29 ఫిబ్రవరి 2020)
 • ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ప్రభుత్వం ఫ్లోరోసిస్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నది.
 • మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లగొండ జిల్లా ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందిస్తున్నది.
 • దీంతో గత 6 సంవత్సరాలుగా జిల్లాలో ఎక్కడా ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు.
 • ఆర్వో సిస్టం ద్వారా శుద్ధి చేసిన నీటికంటే, మిషన్ భగీరథ నీళ్లే స్వచ్ఛమైనవి, సురక్షితమైనవి.
 • ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫ్లోరైడ్ బాధితులకు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
 • ఇండియన్ నేచురల్ రిసోర్స్ ఎకానమిక్ అండ్ మేనేజ్ మెంట్ (ఐ.ఎన్.ఆర్.ఈ.ఎం) ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ నారాయణ్ ఇందు కోరారు.

మారుమూల జనావాసాలకు కూడా పైపు లైన్లు : గిరిజన తండాలు, ఎస్సీ వాడలు, గోండు గూడేలు, అటవీ ప్రాంతాల్లోని మారుమూల జనావాసాలకు కూడా  పైప్ లైన్ల ద్వారా మంచినీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రాజెక్టు పూర్తి చేసిన కాంట్రాక్టర్లే పదేండ్లు నిర్వహణ చేపట్టేలా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. 

మంచినీటికి ప్రభుత్వాలు చేసిన ఖర్చు

2004-14 వరకు పది సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో మంచినీటికి పెట్టిన ఖర్చు కేవలం రూ.4,198 కోట్ల మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్ల కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రూ.32,500 కోట్లు ఖర్చు పెట్టింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5,672 గ్రామాలకే మంచినీళ్లు సరిగా అందేవి. 1,169 గ్రామాలకు మంచినీటి పథకాలే లేవు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మొత్తం 23,930ఆవాస ప్రాంతాలకు నీరందుతుంది.

మిషన్ భగీరథ కోసం విద్యుత్ శాఖ చేసిన ఏర్పాట్లు: మిషన్ భగీరథకు నిరంతరాయంగా 180 మెగావాట్ల విద్యుత్తును అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి, డెడికేటెడ్ లైన్లు కూడా వేశారు. మిషన్ భగీరథ కు నిరంతర విద్యుత్ అందించడానికి విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా గౌరిదేవిపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లూరులో 220/11 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించారు. మొత్తం 44 సబ్‌స్టేషన్లు 603.57 కిలోమీటర్ల మేర. 33 కేవీ లైన్లు 606.3 కిలోమీటర్ల మేర నిర్మించారు. 11 కేవీ లైన్లు, 46 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 314 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో రెండు 220/11 కేవీ సబ్‌స్టేషన్లు, పదహారు 33/11 సబ్‌స్టేషన్లు, 249.94 కిలోమీటర్ల  33 కేవీ లైన్లు, 254.94 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 126 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇరవై ఆరు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, 353.63 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 348.36 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 46 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 188 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలన్నీ 24 గంటల పర్యవేక్షణతో నిరంతరాయంగా పనిచేస్తాయి.

గడువుకంటే ముందే పనులు పూర్తిచేసిన విద్యుత్ సంస్థలు : మిషన్ భగీరథ పథకానికి కావాల్సిన విద్యుత్ సరఫరా వ్యవస్థను తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణీత గడువుకన్నా ముందుగానే సిద్ధం చేశాయి.రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పంపుసెట్లు నడవడానికి అనువుగా రూ.280 కోట్ల వ్యయంతో కొత్త సబ్‌స్టేషన్లు, పవర్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన విద్యుత్ వ్యవస్థలన్నీ 2018 ఆగస్టు15 నాటికి పూర్తికావాలని ప్రభుత్వం గడువు విధించగా, గడువు కంటే ముందుగానే 15 జూలై, 2018 నాటికే పూర్తిచేశారు.

మిషన్ భగీరథ ద్వారా పరిశ్రమలకు నీరు:  మిషన్ భగీరథ ద్వారానే పరిశ్రమలకు కూడా శుద్ధిచేసిన మంచినీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంచినీరు అవసరం ఉన్న పరిశ్రమల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని, వారికి ప్రత్యేకంగా పైపులైన్లు వేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని అదేశించారు. మిషన్ భగీరథకు కేటాయించిన 80 టి.ఎం.సిల నీటిలో పది శాతం (8 టిఎంసీలు) పరిశ్రమలకు అందించనున్నారు.హైదరాబాద్ నగర మంచినీటి అసవరాల కోసం పది టిఎంసీల డెడికేటెడ్ రిజర్వాయర్ కడుతున్నారు. అక్కడినుంచి పరిశ్రమలకు నీరు అందించనున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా మిషన్ భగీరథ ద్వారానే మొత్తం నీటిని సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు.

మంచి నీటి సరఫరాలో దేశంలోనే తెలంగాణ నెంబర్వన్

మంచినీటి సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. తెలంగాణలో 2021 జనవరి నాటికి 98.27 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని మొత్తం23,930 ఆవాసాల్లోని 54.06 లక్షల ఇండ్లకు నీరందుతున్నది. దీంతో మొత్తం 2 కోట్ల 72 లక్షల (రూరల్- 2.17 కోట్లు/అర్బన్ -55 లక్షల) మందికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందుతున్నది. 2013-14 లో కేవలం 5,672 ఆవాసాలకు మాత్రమే నీరందేది. రాష్ట్రంలో100శాతం నల్లాల ద్వారా మంచి నీళ్లు అందిస్తూ తెలంగాణ గొప్ప విజయం సాధించిందని కేంద్రప్రభుత్వ జల్జీవన్మిషన్ప్రశంసించింది. మంచినీటి పథకాలకు

క్రమసంఖ్యరాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలునల్లా కనెక్షన్ల శాతం శాతం
1తెలంగాణ98.27
2గోవా89.05
3పుదుచ్చెరి87.02
4హరియానా79.78
5గుజరాత్74.16
6సిక్కిం67.13
7హిమాచల్ ప్రదేశ్61.81
8పంజాబ్54.56
9బీహార్46.19
10జమ్ము – కశ్మీర్44.16
11మహారాష్ట్ర42.90
12ఆంధ్రప్రదేశ్34.71
13కర్ణాటక28.94
14కేరళ26.29
15మిజోరం24.50
16తమిళనాడు20.50
17అరుణాచల్ ప్రదేశ్18.97
18మధ్యప్రదేశ్18.41
19ఉత్తరాఖండ్17.06
20రాజస్థాన్14.19
21మణిపూర్12.52
22చత్తీస్ గఢ్11.93
23ఒడిశా11.71
24త్రిపుర10.77
25ఝార్ఖండ్9.08
26నాగాలాండ్4.82
27లద్దాఖ్4.67
28ఉత్తర్ ప్రదేశ్4.55
29అస్సోం3.51
30మేఘాలయ2.09
31పశ్చిమ బెంగాల్2.05

భగీరథ నీటితో లాభాలు :

-మిషన్‌ భగీరథ నీటిలో తగిన మోతాదులో లవణాల శాతం (టీడీఎస్‌) ఉండటం వల్ల నీరసం రాదు. అంతర్గత అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి. గుండె రక్తనాళాల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది.

-శరీరానికి అవసరమైన పీహెచ్‌ పెరిగి నీటి ఆమ్ల స్థితి తగ్గి.. క్షార స్థితి పెరిగి శరీర అంతర్భాగంలోని అవయవాలు బాగా పనిచేస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

-నీటిలో తాగడానికి ఉండాల్సిన ఆల్కాలినిటీ (క్షారత్వం) పెరిగి ఆమ్లత్వం తగ్గి శరీర అంతర్గత అవయవాలు సరిగా పనిచేస్తాయి.

-శరీరానికి కావాల్సిన కాల్షియం మోతాదులో ఉండటం వల్ల ఎముకల పెరుగుదల సాఫీగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.

-మెగ్నీషియం మోతాదు స్థాయిలో ఉండటం వల్ల శరీరంలోని అన్నిరకాల జీవ రసాయన క్రియలు మెరుగ్గా జరుగుతాయి.

-మిషన్‌ భగీరథ నీటిలో నైట్రేట్‌ మోతాదు స్థాయిలో ఉండటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలోని నరాల సంకోచ, వ్యాకోచాలు మెరుగ్గా జరుగుతాయి.

-నీటిలో ఫ్లోరైడ్‌ మోతాదుస్థాయిలో ఉండటంతో వృద్ధులు, మధ్య వయస్కులు, చిన్నపిల్లల్లో ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఆర్వో నీటిలో మినరల్స్‌ ఉండవు

మిషన్ భగీరథ నీటిలో సమపాళ్లలో లవణాలు ఉండటంతో ఎలక్ట్రోడ్స్‌ పెట్టినప్పుడు సాధారణ వెలుగునిస్తున్నది. అదే ఆర్వో వాటర్‌లో ఎలక్ట్రోడ్స్‌ పెట్టినప్పుడు లైట్‌ వెలుగదు. అంటే ఆర్వో వాటర్‌లో ఎలాంటి ఖనిజాలు లేవని తెలిసిపోతుంది. ఆర్వో నీళ్లు ఫిల్టర్‌ అవుతాయి. లవణాలు, బ్యాక్టీరియా కూడా ఫిల్టర్‌ అవుతాయి. అది నిర్జీవ జలం. ఆర్వో నీళ్లు తాగడం వల్ల చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వస్తున్నాయి. మిషన్‌ భగీరథ నీరు నది నుంచి వచ్చిన నీరు. ఇందులో అన్నిరకాల లవణాలుంటాయి. రసాయనాలు కావాల్సిన మోతాదులో లభిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు నిర్వహించాకే ఆర్వో నీళ్లు వాడొద్దని సూచించారు.

ఇక దేశమంతటా ‘‘మిషన్ భగీరథ’’

కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. హైదరాబాద్ లో 2019 నవంబర్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్ భగీరథ స్వరూపాన్నిపవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించగా, ఆయన ప్రశంసించారు.

తెలంగాణ మిషన్భగీరథ స్ఫూర్తితో పశ్చిమ బెంగాల్రాష్ట్రంలో జల్స్వప్న ప్రాజెక్ట్..

తెలంగాణలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం స్ఫూర్తితో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జల్ స్వప్న ప్రాజెక్టు చేపట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.. దాదాపు రూ. 58 వేలకోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును ఐదు సంవత్సరాలలోపు పూర్తిచేయాలని సంకల్పించారు. అయితే, తెలంగాణలో కేవలం మూడు సంవత్సరాల్లోనే దానికంటే తక్కువగా కేవలం రూ.45,028కోట్ల వ్యయంతోపూర్తి చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 90శాతం ఇండ్లకు నల్లానీళ్లు అందాయి.

తెలంగాణ మిషన్భగీరథ దేశానికే మార్గదర్శకం..

అన్ని రాష్ట్రాలకు జాతీయ జల్జీవన్మిషన్డైరక్టర్మనోజ్కుమార్సాహు లేఖ

తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మిషన్భగీరథ పథకం ద్వారా మంచి నీటి సరఫరా నిర్వహణలో అవలంబిస్తున్న విధానం దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని జాతీయ జల్జీవన్మిషన్డైరక్టర్మనోజ్కుమార్సాహు అన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు 16 జూలై 2020న లేఖ ద్వారా తన సందేశాన్ని పంపారు. తెలంగాణప్రభుత్వంమంచినీటిసరఫరాలో అనుసరిస్తున్న అత్యున్నత సాంకేతిక విధానం ద్వారా నీటివృధాను అరికట్టి, అవసరమైనమేరకే నీటిని సరఫరా చేయవచ్చునని ఆయన అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా నీటి సరఫరా నిర్వహణలో ఫ్లోకంట్రోల్వాల్వ్సాంకేతికను ఉపయోగించాలని ఆయన సూచించారు. ఆయా రాష్ట్రాలు అధ్యయనానికి టెక్నికల్టీములను తెలంగాణ రాష్ట్రానికి పంపి మంచినీటి సరఫరాలో తెలంగాణ మోడల్ను అనుసరించాలని చెప్పారు.

జల్‌జీవన్‌ మిషన్‌లో అగ్రగామి తెలంగాణ

కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి షెకావత్‌ ప్రశంస (3.11.2020)

 కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ కార్యక్రమం అమలు తీరుతెన్నులపై 2020 నవంబర్ 3న అన్ని రాష్ర్టాల మంత్రులు, అధికారులతో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 54.37 లక్షల గృహాలకు నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్న తెలంగాణను ప్రత్యేకంగా ప్రశంసించారు. జల్‌జీవన్‌మిషన్‌ అమలులో ప్రతిభ చూపుతున్న రాష్ర్టాలకు ఇన్సెంటివ్‌ గ్రాంట్స్‌ ఇస్తామని ఆయన చెప్పారు. అన్ని రాష్ర్టాల్లో 2024 వరకు ఇంటింటికీ తాగునీరు అందించే ఉద్దేశంతో కేంద్రం 2019 ఆగస్టు 15న జల్‌జీవన్‌ మిషన్‌ను ప్రారంభించింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో కేంద్ర ప్రభుత్వంకన్నా ముందే మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. రూ.45,028 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి నల్లా ల ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గోవా మినహా ఇతర రాష్ర్టాలు ఏవీ తెలంగాణ దరిదాపుల్లో లేవు.. అని ఆయన సమావేశంలో పేర్కొంటూ, తెలంగాణ ముందుచూపును ప్రశంసించారు.

…………………………………………

‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు’

పేదలు ఆత్మగౌరవంతో జీవించడానికి ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు’

కూడు, గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలు. నాగరికత అభివృద్ధి చెందిన నేటి కాలంలో అవి ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనాలు. ఏదో ఒకటి అనే స్థాయినుంచి తాము కోరుకున్నదే ఎంచుకునే స్థాయికి సమాజం చేరుకుంటున్నది. ఈ నేపథ్యంలో పేదలకు నివాసం అంటే చాలీ చాలని ఇరుకుగది కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కనీసం రెండు తరాలకు ఉపయోగపడే విధంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి ఉచితంగా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలో మొత్తం రెండు లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి 2016 ఏప్రిల్ 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణాలు:1982 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు బలహీనవర్గాల గృహనిర్మాణాల పేరిట ఇండ్లు నిర్మించినా, అవి పేదలకు పెద్దగా మేలు చేయలేదు.  చాలావరకు ఇండ్ల నిర్మాణంలో అవినీతి జరిగింది. కొద్దో గొప్పో ఇండ్ల నిర్మాణం జరిగినా, అవి ఒక్కగది (260 చదరపు అడుగుల) ఇల్లు మాత్రమే కావడంతో కుటుంబ అవసరాలు తీరలేదు.

ఇండ్ల స్వరూపం – మౌళిక సదుపాయాలు:తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు నివాసయోగ్యంగా, వారి ఆత్మ గౌరవం కాపాడేలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు (560 చదరపు అడుగులు) నిర్మించి ఇస్తున్నది. ఈ డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు, ఇండ్లలో రెండు పడక గదులతోపాటు, హాలు, వంటగది, 2 టాయిలెట్లు ఉంటాయి. ప్రత్యేక కాలనీల్లో కొత్తఇండ్లను నిర్మిస్తున్నారు. మోడల్‌ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకిరువైపులా చెట్లు, ప్రతీ ఇంటిముందూ మొక్కలు నాటుతున్నారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతున్నా ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రతీఇంటికి వేర్వురుగా మెట్లు, వాటర్‌ట్యాంక్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. 

ఒక్కో యింటికి అయ్యే ఖర్చు : ఈ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూరల్ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షలు ఖర్చు చేస్తున్నది. వీటిలో రూ. 5.04 లక్షలు ఇంటి నిర్మాణానికి, రూ.1.24 లక్షలు మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, జిహెచ్ఎంసి పరిథిలో రూ.7 లక్షలు (జి+3), రూ. 7.9 లక్షలు (సి+ఎస్+9) ఖర్చు చేస్తున్నది. మోడల్ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకి ఇరువైపులా చెట్లు, ప్రతి ఇంటిముందు మొక్కలు నాటుతున్నారు.

బడ్జెట్ కేటాయింపులు – పొందిన రుణాలు :2015-16 మరియు 2016-17 బడ్జెట్లో కలిపి 1441.70 కోట్లను కేటాయించింది. 2017-18 బడ్జెట్లో గృహనిర్మాణానికి రూ.1898.39 కోట్లు కేటాయించింది. 2018-19 లో గృహనిర్మాణ శాఖకు రూ.2795 కోట్లు (డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ.2,643 కోట్లు) కేటాయించారు. 2019-20 బడ్జెట్లో (ఓటాన్ అకౌంట్) రూ.4,709 కోట్లు, 2020-21 బడ్జెట్లో గృహనిర్మాణాలకు రూ.11,917 కోట్లు (రూ.10,500 కోట్లుడబుల్ బెడ్ రూం ఇండ్లకు) కేటాయించారు. హడ్కో నుంచి ప్రభుత్వం 3344.76 కోట్ల రుణాన్ని తీసుకొని ఈ ఇండ్లకు ఖర్చు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం 11 వేల కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ. 18,663 కోట్లు ఖర్చు చేస్తున్నది. అప్పటి ప్రభుత్వాలు ఈ గృహాలకు కేవలం 30 శాతం భారం భరించి, లబ్ధిదారుడి మీద 70 శాతం భారం మోపేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం లబ్ధిదారునిపై రూపాయి భారం కూడా పడకుండా పూర్తిగా ఉచితంగా ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇళ్ల నిర్మాణానికి రూ. 230ల‌కే  బ‌స్తా సిమెంట్‌ను అందించ‌డానికి సిమెంట్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం  3 ఏళ్లు ( అక్టోబర్ 2019 వరకు) ఒప్పందం చేసుకుంది.

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో సాంకేతికత : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో వేగాన్ని పెంచేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రయోగాత్మకాం షీర్ వాల్, టన్నెల్ ఫామ్, ప్రీకాస్ట్ విధానాల్లో ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఇండ్లు నాణ్యతతో పాటు, భూకంపాలను కూడా తట్టుకునేవిధంగా ఉంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రాణ, ఆస్తినష్టం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ ఇండ్లు నిర్మించవచ్చు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో పురోగతి :

డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చివరిదశకు చేరుకుంటున్నాయి. మెజార్టీ బ్లాక్‌ల నిర్మాణం దాదాపు పూర్తయింది. రాష్ట్రప్రభుత్వం రూ.18,663 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. కేంద్రం నుంచి రూపాయి సాయం రాకున్నా ప్రభుత్వం బడ్జెట్లో ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేయిస్తున్నది. ప్రభుత్వం మొత్తం 2,83,401డబుల్‌బెడ్‌రూం ఇండ్లను కేటాయించి, పరిపాలనా అనుమతులు జారీచేసింది. ఇందులో 2,60,060 ఇండ్లకు టెండర్లు పిలవగా.. 1,99,001 ఇండ్లకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి ఆయా కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్‌ చేశారు. వీటిల్లో 1,79,078 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. 2020 ఫిబ్రవరి మొదటివారం నాటికి 1,09,725 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఈ ఇండ్లకు మిషన్‌భగీరథ నల్లాలు, ఇంటిముందు మొక్కలతో సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. మరో 32వేల ఇండ్ల నిర్మాణాలు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. కాగా, ఇప్పటివరకే 38,740 ఇండ్లల్లో లబ్ధిదారుల సామూహిక గృహప్రవేశాలు జరిగాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 97వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టగా.. 76,895 ఇండ్లు పూర్తిదశకు చేరుకున్నాయి. జీహెచ్‌ఎంసీలో 8,052 ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 18,433 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉండగా.. ఇప్పటికే 15,598 ఇండ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. ఇక మున్సిపాలిటీల్లో 14,397 ఇండ్లు నిర్మాణాలు పూర్తిచేసుకుని తయారయ్యాయి. మున్సిపాలిటీల పరిధిలో 15,090 ఇండ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేశారు. పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ ఐడిహెచ్ కాలనీలో నిర్మించిన ఇండ్ల మాదిరిగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎర్రవెల్లిలోని ఇండ్ల మాదిరిగా డబుల్ బెడ్ రూముల ఇండ్ల నిర్మాణం జరుగుతుంది.

డబుల్ బెడ్ రూం ఇండ్లకు చేస్తున్న ఖర్చు : తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను మొత్తం 18,663 కోట్లతో చేపట్టింది. వీటిలో ఇప్పటివరకు రూ.7,394.54 కోట్లు వెచ్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,605.05 కోట్లు, మున్సిపాలిటీల్లో రూ.1,139.49 కోట్లు, జీహెచ్‌ఎంసీలో రూ.4,650 కోట్లు ఖర్చుపెట్టారు. ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షల చొప్పున వెచ్చిస్తున్నారు. వీటిలో రూ.5.04 లక్షలు ఇంటి నిర్మాణానికి, రూ.1.24 లక్షలు మౌలిక సదుపాయాల కోసం ఖర్చుచేస్తున్నారు. ప్రత్యేక కాలనీల్లో కొత్తఇండ్లను నిర్మిస్తున్నారు. మోడల్‌ కాలనీల్లో సీసీ రోడ్లు, రోడ్లకిరువైపులా చెట్లు, ప్రతీ ఇంటిముందూ మొక్కలు నాటుతున్నారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతున్నా ప్రభుత్వమే భరిస్తున్నది. ప్రతీఇంటికి వేర్వురుగా మెట్లు, వాటర్‌ట్యాంక్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. 

డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులు :రూరల్ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనారిటీలకు 7శాతం, ఇతరులకు 43శాతం ఈ ఇండ్లను కేటాయిస్తున్నారు. అలాగే,అర్బన్ ప్రాంతాల్లో ఎస్సీలకు 17శాతం, ఎస్టీలకు 6శాతం, మైనారిటీలకు 12శాతం ఇతరులకు 65శాతం  కేటాయిస్తున్నారు.

 • మొదటి విడతగా అధునాతన పద్ధతుల్లో ఒక్కో యూనిట్‌కు 7 లక్షల 90 వేలు ఖర్చు చేసి ఐడిహెచ్ కాలనీలో ఇళ్లనిర్మాణం చేపట్టారు. మొత్తం 33 బ్లాకుల్లో నిర్మించిన 396 గృహాల‌కు 36 కోట్ల 54 ల‌క్షల రూపాయ‌లు ఖర్చు చేశారు.
 • సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో దాదాపు 600 ఇండ్లలో ఒకేసారి గృహప్రవేశాలు చేశారు. ఈ గృహప్రవేశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 డిసెంబర్ 23న ప్రారంభించారు.
 • ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని మ‌ద్దులప‌ల్లిలో 2017 మార్చి 29 ఉగాది రోజున డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. 
 • ముఖ్యమంత్రి స్వగ్రామం చింతమడకకు 1800 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం 03 ఆగస్ట్, 2019న ఆదేశాలు జారీ చేసింది.
 • సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సర్కిల్ లోని కొల్లూరులో రూ.1355 కోట్లతో.. 124 ఎకరాల్లో 15,660 డబుల్ బెడ్ రూం ఇండ్ల భారీ టౌన్ షిప్ నిర్మించారు. 117 బ్లాక్ లలో 11 అంతస్తుల భారీ హౌసింగ్ ప్రాజెక్టు ప్రభుత్వం చేపట్టడం దేశంలోనే ఇది ప్రథమం.దేశంలోనే పెద్దదైన ఈ టౌన్ షిప్ లో షాపింగ్ కాంప్లెక్సులు, పోలీసు స్టేషన్, ఫైర్ స్టేసన్, కమ్యూనిటీ హాల్స్, స్టేడియం తదితర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. 
 • మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని వీరన్నపేటలో 660 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ 14 జూలై 2020న ప్రారంభించారు. లబ్ధిదారులందరికీ ఇండ్ల పత్రాలను అందజేశారు.
 • హైదరాబాద్‌నగరంలోనికంటోన్మెంట్‌లోనిర్మించిన 264 డబుల్‌బెడ్‌రూంఇండ్లను 29 జనవరి 2021నహోంమంత్రిమహమూద్‌అలీప్రారంభించారు.

జీహెచ్‌ఎంసీలో 85,000 ఇండ్లు రెడీ

డిసెంబర్‌ కల్లా పేదలకు పంపిణీ: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పేదలకు సుమారు 85 వేల ఇండ్లను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పంపిణీ చేయనున్నట్టు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇందులో 75 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కాగా, మరో పదివేలు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లు ఉన్నట్టు తెలిపారు.  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై 2020 ఆగస్టు 26న సమీక్షించారు. నిర్మాణపనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో.. తాగునీరు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇండ్ల స్థలాలు ఉండి ఇండ్లు కట్టుకోలేనివారికి నగదు సాయం :2018 ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి పేద ప్రజలకు వారి స్వంత స్థలంలో రెండు పడక గదుల ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. ఇండ్ల స్థలాలు ఉండి ఇండ్లు కట్టుకోలేని పేద ప్రజలకు ఉచితంగా రూ.5 లక్షలు అందివ్వనుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది.

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పక్కా ఇండ్లను కూడా పూర్తి చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. 2014 కు ముందు మంజూరై ఇంకా నిర్మాణ దశలోనే వున్నఇందిరమ్మ ఇండ్లకు రూ. 369.48 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. మరో 2,10,442 ఇండ్లు వివిధ దశల్లో వున్నాయి. ఈ ఇండ్లన్నీ పూర్తయ్యాక 1159.85 కోట్లు చెల్లించాల్సి వుంటుంది.

రాజీవ్ స్వగృహకు పరిష్కారం

సమైక్య రాష్ట్రంలో పాలకులు వదిలేసి వెళ్లిన రాజీవ్‌ స్వగృహ ఇండ్లను తెలంగాణ ప్రభుత్వం కొలిక్కి తెస్తున్నది. రాజీవ్‌ స్వగృహ కింద 36 ప్రాజెక్టులు చేపట్టిన నాటి ప్రభుత్వం.. ఆ భూములను తనఖాపెట్టి బ్యాంకుల నుంచి రూ.1,000 కోట్ల అప్పు తీసుకుంది. అందులో ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వంపై భారం మోపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అప్పుతోపాటు రూ.1,200 కోట్ల వడ్డీని బ్యాంకులకు చెల్లించి తనఖాలో ఉన్న 784 ఎకరాల భూములను విడిపించింది. ఆ భూములను లబ్ధిదారులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అప్పట్లో ఫ్లాట్లు బుక్‌చేసుకొన్న లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యమిచ్చి మిగిలిన ఫ్లాట్లను మార్కెట్‌ ధర ప్రకారం అమ్మాలని భావిస్తున్నది.

ప్రతీఇంటికిమరుగుదొడ్డి

రాష్ట్రంలోనిప్రతీఇంటికిమరుగుదొడ్డినిర్మించిఇవ్వాలన్నదృడసంకల్పంతోప్రభుత్వంముందుకుపోతున్నది. స్వచ్ఛతెలంగాణలోభాగంగానగరాలు, పట్టణాల్లోనిప్రతీఇంటికీ 02 అక్టోబర్, 2020 నాటికిమరుగుదొడ్డినిర్మించేవిధంగాప్రభుత్వంచర్చలుచేపట్టింది. మరుగుదొడ్లనిర్మాణంకోసంవచ్చినదరఖాస్తులనుఆన్లైన్లోఅప్లోడ్చేసివేగంగానిర్మాణాలుపూర్తిచేయాలని 26 ఆగస్టు, 2020నప్రభుత్వంఉత్తర్వులుజారీచేసింది. కొత్తమరుగుదొడ్లునిర్మించడంతోపాటుఅశాస్త్రీయపద్ధతిలోనిర్మించినవాటికిమరమ్మతులుచేసుకునేందుకువీలుగారూ.7 వేలుచెల్లిస్తారు. కొత్తమరుగుదొడ్లుఒక్కోదానికిరూ.12 వేలుఖర్చవుతుండగా.. రాష్ట్రప్రభుత్వంరూ.8 వేలు, కేంద్రంరూ.4 వేలులబ్దిదారులకుఅందజేస్తుంది.

వందశాతంనల్లాకనెక్షన్లతోతెలంగాణటాప్

కేంద్రజల్శక్తిమంత్రిగజేంద్రసింగ్షెకావత్అభినంద‌న‌లు  (20జనవరి2021)

తెలంగాణరాష్ర్టప్రభుత్వానికికేంద్రప్ర‌భుత్వంఅభినంద‌న‌లుతెలిపింది. వంద‌శాతంఫంక్ష‌న‌ల్ట్యాప్క‌నెక్ష‌న్రాష్ట్రంగాతెలంగాణనిల‌వ‌డంపైకేంద్రజ‌ల్‌శ‌క్తిమంత్రిగజేంద్రసింగ్షెకావ‌త్అభినంద‌నలుతెలిపారు. ఈమేర‌కు20జనవరి2021ఆయ‌నట్విట్ట‌ర్ద్వారాస్పందిస్తూ.. ఇప్పటివరకువందశాతంఎఫ్‌హెచ్‌టీసీపూర్తిచేసినరాష్ట్రాలుగాగోవా, తెలంగాణనిలిచాయ‌న్నారు. మొత్తం54,06,070గృహాలకుట్యాప్కనెక్షన్ద్వారానీటిసరఫరాజ‌రుగుతోంద‌న్నారు. భారతదేశగ్రామీణగృహాలకునీటికనెక్షన్లుఉండేలాచూడడానికితాముదగ్గరగాఉన్నామన్నారు. హర్ఘర్జల్అనేత‌మ‌ఆలోచనత్వరలోనేనిజమవుతుందనికేంద్రమంత్రిఅన్నారు.

తెలంగాణ‌కుకేంద్రంఅభినంద‌న‌లు (21జనవరి2020)  – ప్రశంసలు

తెలంగాణరాష్ర్టప్ర‌భుత్వానికికేంద్రప్ర‌భుత్వంఅభినంద‌న‌లుతెలిపింది. వంద‌శాతంఫంక్ష‌న‌ల్ట్యాప్క‌నెక్ష‌న్రాష్ట్రంగాతెలంగాణనిల‌వ‌డంపైకేంద్రజ‌ల్‌శ‌క్తిమంత్రిగజేంద్రసింగ్షెకావ‌త్అభినంద‌నలుతెలిపారు. ఈమేర‌కు20జనవరి2021నఆయ‌నట్విట్ట‌ర్ద్వారాస్పందిస్తూ.. ఇప్పటివరకువందశాతంఎఫ్‌హెచ్‌టీసీపూర్తిచేసినరాష్ట్రాలుగాగోవా, తెలంగాణనిలిచాయ‌న్నారు. మొత్తం54,06,070గృహాలకుట్యాప్కనెక్షన్ద్వారానీటిసరఫరాజ‌రుగుతోంద‌న్నారు. భారతదేశగ్రామీణగృహాలకునీటికనెక్షన్లుఉండేలాచూడడానికితాముదగ్గరగాఉన్నామన్నారు. హర్ఘర్జల్అనేత‌మ‌ఆలోచననిజమవుతున్నదనికేంద్రమంత్రిఅన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

ట్రెండింగ్‌

Advertisement