e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home Telangana విశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్

విశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్

విశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్

తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బ‌హుముఖ‌ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌళిక సదుపాయాల కల్పనతోపాటు సిటీ ఇమేజ్ ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలనురూపొందించి అమలు చేస్తున్నారు. న‌గ‌రం చరిత్రలోనే తొలిసారిగా రూ.30వేల కోట్లకు పైగా వ్య‌యంతో ప‌లు నిర్మాణ కార్య‌క్ర‌మాలు జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నాయి. దీంతో ఉపాధి మెరుగై నిర్మాణరంగ ముడి ప‌దార్థాలు, దాని అనుబంధ రంగాల్లో విస్తృత‌మైన పురోగ‌తి లభించింది. నగర అభివృద్ధికి తోడు ప్రపంచ దేశాల నుండి ఎన్నోబ‌హుళ‌జాతి కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంప‌లు ప్రణాళికలను రూపొందించింది. నగర అభివృద్ధికి 2017-18 లో రూ.1000 కోట్లు, 2015-16 బడ్జెట్లో రూ.526 కోట్లు, హైద‌రాబాద్ మెట్రో రైల్‌కి రూ.416 కోట్లు, జ‌ల‌మండ‌లికి రూ.1000 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్లో రూ.3503 కోట్లు, 2020-21లో రూ.10,000 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితోపాటు మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అమలుకు ఈ నిధులను కేటాయించింది. ఇక నుంచి ఐదేండ్ల పాటు రూ.50 వేల కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్వరాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌ నగర ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతున్నది. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మలచడానికి తొలి అడుగు విజయవంతంగా పడింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా రూ.67,351 కోట్లను ఖర్చుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఇంత భారీ స్థాయిలో నిధులను ప్రభుత్వాలు హైదరాబాద్‌ కోసం ఖర్చు చేయలేదు. భారీ, మాధ్యమిక, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు, సేవల సంస్థలకు వేదిక అయిన హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థ అక్షరాలా 74 బిలయన్‌ డాలర్లు.

 1. గ్రేట‌ర్‌హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు

నిరుపేదలకు డబ్బా ఇండ్లు కాకుండా.. డబుల్ బెడ్రూం ఇళ్ళు కట్టివ్వాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసాకూడా పేదలపై భారం పడకుండా డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇస్తున్నది. ఈ తొలిద‌శ‌ లోనే 3 లక్షల ఇళ్ళు పేదలకు అందివ్వడానికి కృషి జరుగుతున్నది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ ప‌నులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. ఇందుకోసం రూ.8,541 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నగరం మొత్తం 109చోట్ల ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 7 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నది. పైలెట్ ప్రాజెక్టుగా ఐ.డి.హెచ్.కాలనీలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.36.54 కోట్లతో 396 ఇండ్లు నిర్మించింది.

బీహెచ్ఈఎల్ దగ్గరలో 15,600 మెగా డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీ

బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం వద్ద కొల్లూరులో 124 ఎకరాల స్థలంలో రూ.1,355 కోట్లతో మెగా డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీ నిర్మిస్తున్నారు.పోలీస్ స్టేష‌న్‌, పాఠ‌శాల‌, ఆసుప‌త్రి, బ‌స్టాండ్‌తోపాటు అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న ఈ మెగా కాలనీని 117 బ్లాకుల్లో 11 అంతస్తులతో 15,600 ఇండ్లు నిర్మిస్తున్నారు.

స్ట్రాట‌జిక్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్‌డిపి)ఏప్రిల్ 2020 నాటికి

పెరుగుతున్నజనాభాతోపాటునగరంలోట్రాఫిక్సమస్యలుకూడాఎక్కువయ్యాయి. దీనిని అధిగమించేందుకు నగరంలో ట్రాఫిక్స మస్యలులేని రోడ్లకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని అన్నివిభాగాల రహదారులు కలిపి 9204 ల‌కుపైగా కిలోమీటర్లు ఉన్నాయి. న‌గ‌రాన్ని ట్రాఫిక్ ర‌హిత న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డానికి వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల‌ అభివృద్ధి ప‌థ‌కం(ఎస్‌.ఆర్‌.డి.పి)ని రాష్ట్ర ప్ర‌భుత్వం రూపొందించింది. హైద‌రాబాద్లో సిగ్న‌ల్ ఫ్రీ ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేయడానికి ఉద్దేశించి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంలో భాగంగా ప‌లు ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు, కారిడార్ల నిర్మాణాలను చేపట్టింది. 400 ఏళ్లచారిత్ర‌క‌ పురాత‌న న‌గ‌ర‌మైన హైద‌రాబాద్ న‌గ‌రంలో అత్యంత ర‌ద్దీగా ఉన్న ర‌హ‌దారుల‌పై ఫ్లైఓవ‌ర్లు, కారిడార్లు, అండ‌ర్‌పాస్‌ల నిర్మాణం చేప‌ట్ట‌డం అంత్య‌త క‌ఠిన‌మైన‌ప్ప‌టికీ, వివిధ విభాగాల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ, ప్రభుత్వం ఎస్.ఆర్.డి.పి ప‌నుల‌ను అత్యంత వేగ‌వంతంగా నిర్వ‌హిస్తోంది. హైదరాబాద్‌మహానగరంలోఎస్‌ఆర్డీపీపనులుయుద్ధప్రాతిపదికనకొనసాగుతున్నాయి. ఎస్‌ఆర్డీపీలోభాగంగాప్రభుత్వంరూ.29,695.20కోట్లఅంచనావ్యయంతోనగరంలోని 54 జంక్షన్లలో 111 కిలోమీటర్లమేరఎలివేటెడ్‌కారిడార్లు/స్కైవేలు, అండర్‌పాస్‌లునిర్మించాలనిప్రణాళికలురూపొందించింది. ఇందులోభాగంగామొదటరెండుదశల్లోరూ. 6 వేలకోట్లతోనగరంలోనివివిధప్రాంతాల్లోపనులుచేపట్టింది. మొదటిదశలోరూ. 2,982.64 కోట్లతోఈస్ట్‌జోన్‌లోనిఎల్బీనగర్‌కారిడార్‌, వెస్ట్‌జోన్‌లోనిమైండ్‌స్పేస్‌కారిడార్‌లోనాలుగుఅండర్‌పాస్‌లు, 16 ప్రాంతాల్లోఫ్లైఓవర్లనిర్మాణంచేపట్టింది. కేబీఆర్‌పార్కుచుట్టూఆరుఫ్లైఓవర్లనిర్మాణంచేపట్టాలనినిర్ణయించినప్పటికీపర్యావరణఅనుమతుల్లోజాప్యంవల్లతాత్కాలికంగాఈప్రతిపాదననువెనక్కితీసుకున్నారు. రెండోదశలోరూ.2,353.17 కోట్లతోఏడుప్రాంతాల్లోఫ్లైఓవర్లునిర్మిస్తున్నారు.

లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప‌నుల్లో వేగాన్ని పెంచిన ప్ర‌భుత్వం

కరోనానేపథ్యంలోలాక్‌డౌన్‌సమయాన్నిపూర్తిస్థాయిలోసద్వినియోగంచేసుకొంటూఎస్.ఆర్.డి.పి. పనులనుశరవేగంగాచేపట్టారు. రోడ్లపైట్రాఫిక్‌లేకపోవడాన్నిఅదునుగాతీసుకొనిరేయింబవళ్లుపనులు చేశారు. ఈమోకానుసద్వినియోగంచేసుకోవాలన్నప్రభుత్వఆదేశాలతోఈపనులపర్యవేక్షణకుజీహెచ్‌ఎంసీఅధికారులుఓబృందంగాఏర్పడి శ్రమించారు. గడువులోగానిర్మాణాలుపూర్తిచేసేందుకుసాధ్యమైనంతఎక్కువగాయంత్రాలను, మ్యాన్‌పవర్‌నువినియోగించుకుంటూవిరామంలేకుండా 24 గంటలుపనులుజరిపారు. పది నెలల సమయం పట్టే రోడ్ల విస్తరణ, స్కైవేలు, అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేశారు. సెప్టెంబర్ 2020 నాటకి 18 ప్రాజెక్టులను పూర్తిచేసి నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు.

బ‌యో డైవ‌ర్సిటీ జంక్ష‌న్ వ‌ద్ద ఫ్లై ఓవ‌ర్ ప్రారంభం

జీహెచ్ఎంసీపరిధిలోనిబయోడైవర్శిటీజంక్షన్దగ్గరరూ.30.26 కోట్లతోనిర్మించినఫ్లైఓవర్నుమంత్రికేటీఆర్ 20 మే, 2020నప్రారంభించారు. ఈఫ్లైఓవర్తోబయోడైవర్శిటీజంక్షన్దగ్గరట్రాఫిక్సమస్యతీరనుంది.  గచ్చిబౌలినుంచిరాయదుర్గంమీదుగామెహిదీపట్నంవైపువెళ్లేప్రయాణికులకుఇబ్బందులుతగ్గనున్నాయి. మూడులైన్లఈప్లైఓవర్పైఒకేవైపువాహనాలనుఅనుమతిస్తారు. సెకండ్లెవల్వంతెన 04 నవంబర్, 2019నఅందుబాటులోకివచ్చింది.

SRDP  ప్యాకేజీ-4లో…

SRDP  ప్యాకేజీ-4లోభాగంగాఐటీకారిడార్లోనిపలుజంక్షన్లలోరూ. 379  కోట్లతోవంతెనలు,  అండర్పాస్లనిర్మాణపనులనుప్రభుత్వంప్రారంభించింది.  మే 2020 నాటికిఅయ్యప్పసోసైటీజంక్షన్అండర్పాస్, మైండ్స్పేస్చౌరస్తాలోవంతెన,  అండర్పాస్,  రాజీవ్గాంధీజంక్షన్ఫ్లైఓవర్,  బయోడైవర్సిటీసెకండ్లెవల్వంతెనఅందుబాటులోకివచ్చాయి.  త్వరలోనేకామినేనికుడివైపువంతెన, ఎల్బీనగర్అండర్పాస్లుఅందుబాటులోకివస్తాయంటున్నారుజీహెచ్ఎంసీఅధికారులు.

ఎస్.ఆర్.డి.పి. పనుల్లోపురోగతి…

 • పురోగతిలోపనులు- రూ.2,155.64 కోట్లు
 • దుర్గంచెరువుకేబుల్‌బ్రిడ్జి (రూ.184 కోట్లు) – 25 సెప్టెంబర్,2020నప్రారంభం
 • జూబ్లీహిల్స్‌రోడ్‌నం- 45 ఎలివేటెడ్‌కారిడార్‌ (రూ.150 కోట్లు) – 25.09.2020నప్రారంభం
 • షేక్‌పేట్‌ఎలివేటెడ్‌కారిడార్‌ (రూ.333.55 కోట్లు) – జూన్‌ 2021 లక్ష్యం.
 • కొత్తగూడగ్రేడ్‌సెపరేటర్‌ (రూ.263.09 కోట్లు) – జూన్‌ 2021 లక్ష్యం.
 • బాలానగర్‌గ్రేడ్‌సెపరేటర్‌ (రూ.387 కోట్లు, హెచ్‌ఎండీఏఆధ్వర్యంలో)- సగంపూర్తి
 • ఒవైసీహాస్పిటల్‌, బహదూర్‌పురఫ్లైఓవర్‌ (రూ.132 కోట్లు)- 30శాతంపనులుపూర్తి.
 • అంబర్‌పేట్‌ఛేనెంబర్‌ఫ్లైఓవర్‌ (రూ.270 కోట్లు, ఎన్‌హెచ్‌ఆధ్వర్యంలో)- పనులుప్రారంభంకావాలి.
 • కేబీఆర్‌పార్కుచుట్టూఆరుఫ్లైఓవర్లు (రూ.436 కోట్లు)- పర్యావరణఅనుమతులురావాల్సిఉన్నది.

మంజూరుకావాల్సినపనులు

 • ఖాజాగూడటన్నెల్‌, ఎలివేటెడ్‌కారిడార్‌ (రూ.875 కోట్లు)- పరిపాలనాఅనుమతులురావాలి.
 • ఉప్పల్‌క్రాస్‌రోడ్‌ఫ్లైఓవర్‌ (రూ.311కోట్లు)- పరిపాలనాఅనుమతులురావాలి.

ఎల్బీనగర్కారిడార్.. రూ.448 కోట్లు, పనులపురోగతి

 • చింతలకుంటఅండర్‌పాస్‌ – పూర్తి
 • కామినేనిఎడమవైపుఫ్లైఓవర్‌ – పూర్తి
 • ఎల్బీనగర్‌ఎడమవైపుఫ్లైఓవర్‌ – పూర్తి
 • ఎల్బీనగర్‌ఎడమవైపుఅండర్‌పాస్‌ -తుదిదశలోపనులు
 • బైరామల్‌గూడకుడివైపుఫ్లైఓవర్‌ -తుదిదశలోపనులు
 • కామినేనికుడివైపుఫ్లైఓవర్‌ – తుదిదశలో..
 • ఎల్బీనగర్‌కుడివైపుఫ్లైఓవర్‌ -సగానికిపైగాపనులుపూర్తి

మైండ్స్పేస్కారిడార్.. రూ.379 కోట్లు, పనులపురోగతి

 • అయ్యప్పసొసైటీఅండర్‌పాస్‌ – పూర్తి
 • మైండ్‌స్పేస్‌అండర్‌పాస్‌ – పూర్తి
 • మైండ్‌స్పేస్‌ఫ్లైఓవర్‌ – పూర్తి
 • బయోడైవర్శిటీఫ్లైఓవర్‌ – పూర్తి
 • రాజీవ్‌గాంధీవిగ్రహంఫ్లైఓవర్‌ – పూర్తి

పనులుచేపట్టాల్సినవి (2,353.17 కోట్లు)

 • ఇందిరాపార్క్‌- వీఎస్టీఎలివేటెడ్‌కారిడార్‌ (స్టీల్‌బ్రిడ్జి, రూ.426 కోట్లు)- టెండర్లుపూర్తి.
 • సైబర్‌టవర్స్‌ఎలివేటెడ్‌రోటరీ (రూ.225 కోట్లు)- సాంకేతికకారణాలతోతాత్కాలికంగానిలిపివేత.
 • రేతీబౌలి- నానల్‌నగర్‌ఫ్లైఓవర్‌ (రూ.175 కోట్లు)- సాంకేతికకారణాలతోతాత్కాలికంగానిలిపివేత.
 • శిల్పాలేఔట్‌- గచ్చిబౌలిఫ్లైఓవర్‌ (రూ.330 కోట్లు)- ఇటీవలేపనులుప్రారంభం.
 • నల్లగొండక్రాస్‌రోడ్స్‌- ఒవైసీహాస్పిటల్‌ఎలివేటెడ్‌కారిడార్‌ (రూ.523.37 కోట్లు, స్టీల్‌బ్రిడ్జి)- టెండర్లుపూర్తి.
 • జూపార్క్‌- ఆరాంఘర్‌ఎలివేటెడ్‌కారిడార్‌ (రూ.636.80 కోట్లు)- టెండర్లుపూర్తి.
 • చాంద్రాయణగుట్టఫ్లైఓవర్‌ఎక్స్‌టెన్షన్‌ (రూ.37 కోట్లు)- పురోగతిలోపనులుకావొచ్చాయి.

ఎస్సార్డీపీ కింద పూర్తయిన పనులు

రూ.16,622.63 కోట్లతోవ్యూహాత్మకరహదారిఅభివృద్ధిప్రణాళిక (ఎస్సార్డీపీ), నమూనారహదారికారిడార్లు, అనుసంధానరోడ్లు, సమగ్రరహదారినిర్వహణకార్యక్రమం (సీఆర్‌ఎంపీ), హైవేట్రాఫిక్‌నిర్వహణవ్యవస్థ (హెచ్‌టీఎంఎస్‌), ఔటర్‌రింగ్‌రోడ్డుప్రాజెక్టు (ఓఆర్‌ఆర్‌)లతోప్రధానరద్దీప్రాంతాలనుప్రభుత్వంసిగ్నల్‌ఫ్రీగామార్చింది. వ్యూహాత్మకరహదారిఅభివృద్ధిప్రణాళికలోభాగంగారూ. 8,410 కోట్లతోట్రాఫిక్‌సమస్యలనుపరిష్కరించింది. దుర్గంచెరువుపైనిర్మించినకేబుల్‌వంతెనప్రపంచంలోనేఅత్యంతపొడవైనఎక్స్‌ట్రాడోస్డ్‌కేబుల్‌బ్రిడ్జి. దీనిపొడవు 233.85 మీటర్లు. ఎస్సార్డీపీలోభాగంగాప్రభుత్వం 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 రోడ్డుఓవర్‌బ్రిడ్జిలనిర్మాణంపూర్తిచేసింది. స్వచ్ఛహైదరాబాద్‌కోసంరూ.1716.33 కోట్లనుఖర్చుచేసింది.

దుర్గంచెరువుపై 4 లేన్ల కేబుల్ బ్రిడ్జి ప్రారంభం

జూబ్లీహిల్స్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మధ్య దూరం తగ్గించడానికి నిర్మించిన 4 లేన్ల కేబుల్ బ్రిడ్జి ను 25 సెప్టెంబర్, 2020న ప్రారంభించారు. 735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. తెలంగాణ ప్రభు త్వం, జీహెచ్‌ఎంసీ కలిసి రూ.184 కోట్ల వ్యయంతో దుర్గంచెరువుపై పర్యావరణానికి హానిలేకుండా.. రెండు పిల్లర్లపై శక్తివంతమైన తీగల సహాయంతో నిర్మించారు. ఈ కేబుల్‌ బ్రిడ్జి ఆసియాలోనే మొదటిది. మిరుమిట్లు గొలిపే ఎల్‌ఈడీ లైటింగ్‌తో వంతెన అందాలు నగరానికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి. దుర్గంచెరువులో బోటింగ్‌ను, వేలాడే వంతెనకు అనుసంధానంగా నిర్మించిన జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 ఫ్లైఓవర్‌ను కూడా ప్రారంభించారు.

 • హైదరాబాద్ నాలుగు దిక్కులా ఎక్స్ ప్రెస్ హైవేలు

హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ రద్దీని తట్టుకునే విధంగా, రాబోయే 20 నుంచి 40 సంవత్సరాల వరకు మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రహదారుల వ్యవస్థను మెరుగుపరచేందుకు హైదరాబాద్‌ నాలుగు దిక్కులా ఎక్స్‌ప్రెస్‌ హైవేలను నిర్మించడంతో పాటు ఆకాశవీధులు (స్కైవే)లను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయించారు. ఇస్తాంబుల్‌ తరహాలో చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించుకుంటునే రహదారుల వ్యవస్థను మెరుగుపరుస్తారు. పరెడ్‌ గ్రౌండ్‌, తూంకుంట, ఎల్బినగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌, ఘట్‌కేసర్‌లలో ఎక్స్‌ ప్రెస్‌ ఎలివేటెడ్‌ హైవేలు నిర్మించాలని ప్రతిపాదించారు.  ఎల్బి నగర్‌ నుంచి మియాపూర్‌ వరకు, ఉప్పల్‌ నుండి హైటెక్‌ సిటి వరకు విపరీతమైన ట్రాఫిక్‌ రద్ది అధికంగా ఉన్నందున ఈ మార్గంలో హైవే నిర్మించాలని నిర్ణయించారు.  మొదటి దశలో రెండు వేల కిలోమీటర్లను గుర్తించి ఆ మార్గాలలొ ఆకాశ వీధులు (స్కైవే) నిర్మిస్తారు. ఇప్పుడున్న ఫ్లై ఓవర్ల మాదిరిగా కాకుండా మ‌ల్టీ లేయర్‌ ఫ్లై ఓవర్లు, ఫ్లై ఓవర్స్‌ మధ్య ఉపరితలంపై ఆకాశంలోనే జంక్షన్లు నిర్మిస్తారు. రోడ్లతో పాటు భూగర్బ డ్రైనేజి, భూగర్బ కేబుల్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు.  హైదరాబాద్ ఎల్.బి.నగర్ కామినేని హాస్పిటల్ సమీపంలో రూ.49 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను 10 ఆగస్టు 2019న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ 4 నవంబర్ 2019న ప్రారంభించారు.

ఇందిరాపార్కు, రాంనగర్ వద్ద రెండు ఉక్కువంతెనలకు శంకుస్థాపన

రూ.426 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టి వరకు 4 లేన్లు, రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లి వరకు 2 లేన్లతో నిర్మించే ఉక్కు వంతెనలకు తేదీ.11 జూన్ 2020న కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ కలసి శంకుస్థాపన చేశారు.

స్కైవేలకు రక్షణ స్థలాల కోసం కేంద్రానికి వినతి

తెలంగాణ నుంచి నాగ్ పూర్, రామగుండం వెళ్లే మార్గాల్లో రెండు స్కైవేల నిర్మాణానికి రక్షణశాఖ భూములు కేటాయించాలని రాష్ర్టప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తేదీ.11 జూన్ 2020న కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ కలసి ఇందిరాపార్కు నుంచి వీఎస్టి వరకు నిర్మించే ఉక్కు వంతెనకు శంకుస్థాపన చేశారు. దీంతో కిషన్ రెడ్డికి ఈ అంశంపై మంత్రి కేటీఆర్ విన్నవించారు. అలాగే, రసూల్ పుర ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వ స్థలాన్ని ఉపయోగించుకునే అంశంలోనూ కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

 • డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్)

హైదరాబాద్ పరిరక్షణ ప్రాధాన్య అంశంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో అనుకోని ఉపద్రవాల నుంచి ప్రజలను రక్షించడానికి హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టే ప్రత్యేక దళం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్)ను 11 ఆగస్టు 2018 రోజున హైదరాబాద్ ఐమాక్స్ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పోలీసు, ఫైర్ శాఖల సమన్వయంతో డీఆర్‌ఎఫ్ దళాలు పనిచేస్తాయి. మెట్రో న‌గ‌రాల్లో ఉప‌ద్ర‌వాల‌ను ఎదుర్కునేందుకు ప్ర‌త్యేక ద‌ళం ఉన్న‌ది కేవ‌లం హైద‌రాబాద్‌లోనే.

విపత్తునిర్వహణకోసంప్రత్యేకంగారూ.15 కోట్లనువెచ్చించిడిజాస్టర్‌రెస్పాన్స్‌ఫోర్స్‌నుఏర్పాటుచేసినఏకైకరాష్ట్రంతెలంగాణ. విపత్తులసమయంలోసహాయచర్యలకోసం 360 మందిసిబ్బందిపనిచేస్తున్నారు.

 • హైదరాబాద్ లో ‘‘లూ-కేఫ్‌’’ల ఏర్పాటు

హైదరాబాద్ నగర ప్రజల కోసంల‌క్జ‌రీ లూ-కేఫ్‌లను ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టారు. వీటిలో ఏసీ టాయిలెట్లు, నాప్కిన్ వెండింగ్ మెషీన్లు, నాప్కిన్ ఇన్సినరేషన్, కిడ్స్ డైపర్ చేంజ్ రూం, కేఫే, వైఫై సౌకర్యం, వాటర్ ఏటీఎం, బ్యాంకు ఏటీఎం తదితర సౌకర్యాలు ఉంటాయి. వీటిని ప్రజలు ఉచితంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

 • గ్రేటర్ పాలనలో సర్కిళ్లు, జోన్ల పెంపు

జీహెచ్‌ఎంసీ పరిపాలనలో ప్రభుత్వం మార్పులు చేసింది.పౌర సేవ‌ల‌ను న‌గ‌ర‌వాసుల‌కు మ‌రింత అందుబాటులో తేవ‌డానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లోప్ర‌స్తుతం 30 సర్కిళ్లను 48కి పెంచుతూ రాష్ట్ర ప్రభుతం నిర్ణయం తీసుకుంది. ఆరు జోన్ల నుంచి 12 జోన్లకు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ప్రతి రెండు అసెంబ్లీ స్థానాలకు ఒక జోన్‌, ప్రతి జోన్‌ పరిధిలో నాలుగు సర్కిళ్లు ఉండేవిధంగా రూపకల్పన చేశారు. సర్కిళ్లు, జోన్ల పెంపుతో పాటు అదనంగా 1610 పోస్టులు మంజూరు చేశారు. నగరంలోపౌర సేవ‌ల‌ను మరింత వేగవంతం, సమర్థవంతంగా, పారదర్శకంగా పౌరసేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దీనికి సంబంధించి జీవో నెం.149ను పురపాలక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

7.ప్రజల అవసరాలు తీర్చే ఇతర కార్యక్రమాలు
జిహెచ్ఎంసి పరిధిలో రూ.130 కోట్లతో 200 మోడల్ మార్కెట్లు, రూ. 58 కోట్లతో 31 మల్టీ పర్పస్ హాల్ ల నిర్మాణం,రూ.10 కోట్లతో 200 సామూహిక మరుగుదొడ్లు, రూ.25 కోట్ల ఖర్చుతో 24 చోట్ల  స్మశాన వాటికలు, 63 చెరువుల పునరుద్ధరణకు రూ.94 కోట్లు, రూ.18 కోట్లతో రోడ్ల పక్కన మురికి కుంటల నిర్మూలన, 26 కోట్లతో రోడ్ల పునరుద్ధరణరూ. 50 కోట్ల‌తో క్రీడా కాంప్లెక్స్‌లు, రూ. 15 కోట్ల‌తో 7 నైట్ షెల్ట‌ర్లు, రూ. 13 కోట్లతో 5 ఫిష్ మార్కెట్ల నిర్మాణం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. నగర ప్రజలకు నిరంతరాయ విద్యుత్ కోసం రింగ్ లైన్, మంచినీటి కొరత తీర్చేందుకు రెండు రిజర్వాయర్లు, ఐటీ , అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్, మెట్రో రైలు విస్తరణ, నగరంలో బస్సుల సంఖ్య పెంపు, హరితహారం, పార్కుల అభివృద్ధి,హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, చెరువుల సంరక్షణ, సినిమ సిటీ, ఫార్మా సిటీ, ఓఆర్ఆర్ జోనింగ్, మూసీ వెంట ఎలివేటెడ్ రహదారి, పోలీస్ వ్యవస్థ బలోపేతం, పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ భవణం, కొత్తగా రెండు రైల్వే టర్మినల్స్ ఇలా హైదరాబాద్ ను విశ్వనగరంగా మర్చేందుకు ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.
 • ఈ-లైబ్ర‌రీల ఏర్పాటు

న‌గ‌ర ప్ర‌జ‌ల్లో ప‌ఠ‌నాస‌క్తిని రేకెత్తించ‌డం, యువ‌త‌కు పోటీ ప‌రీక్ష‌ల‌కు కావాల్సిన స‌మాచారం అందించ‌డానికి గాను కాల‌నీలు, క‌మ్యూనిటీ హాళ్ల‌లో ఈ -లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేసింది. ఈ-లైబ్ర‌రీలో కంప్యూట‌ర్లు, ఫ‌ర్నీచ‌ర్‌, పుస్త‌కాలు, ప‌త్రిక‌లను ఏర్పాటుచేసి కాల‌నీల సంక్షేమ సంఘాల‌కు వీటి నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. 

 • హైదరాబాద్ లో63 చెరువుల అభివృద్ధి

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌స్తుతం 165 చెరువులున్నాయి. వీటిలో ఎన్నో చెరువులు మురికినీటి కుంట‌లుగా మారి, క‌బ్జాల‌కు గుర‌వుతున్నాయి. ఈ చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌కు జీహెచ్ఎంసీ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. చెరువుల‌లోగుర్ర‌పుడెక్క‌ను, ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి వాటిని ప‌ర్యాట‌క స్థ‌లాలుగా అభివృద్ధి చేసి, చిన్న పిల్ల‌ల‌కు ఆట వ‌స్తువులు, బోటింగ్‌, వాకింగ్‌-వే, క్రీడా స్థ‌లం  సౌక‌ర్యాల‌ను క‌ల్పించే ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయి. రూ. 94.17 కోట్ల వ్య‌యంతో 50 చెరువుల్లో చేపట్టిన అభివృద్ధి ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయి.

రూ.541 కోట్లతో నగర చెరువుల సుందరీకరణ

హైదరాబాద్మ‌హా నగరప‌రిధిలోని చెరువులను రూ. 541 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తేదీ. 28.8.2018 రోజున ప్రకటించారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 40 చెరువులను ఈ నిధులతో అభివృద్ధి చేప‌ట్టారు. దుర్గం చెరువును రహేజా సంస్థ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అభివృద్ధి చేసింది.

 1. గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి 21 కొల‌నులనిర్మాణం

న‌గ‌రంలోని చెరువులు గ‌ణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం వ‌ల్ల కాలుష్యానికి గుర‌వుతున్నాయి. ఈ చెరువుల‌కాలుష్య‌ నివార‌ణ‌కు రూ. 27.81 కోట్ల వ్య‌యంతో 23 చెరువుల్లో ప్ర‌త్యేకంగా గ‌ణేష్ నిమ‌జ్జ‌న కొల‌నుల నిర్మాణాన్ని చేప‌ట్టారు.

 1. సీబీఎస్ స్థానంలో మల్టీపర్పస్ బస్ కాంప్లెక్స్

ఈశతాబ్దంప్రారంభంలోపూర్తిగాఇనుముతోనాలుగుఎకరాలవిస్తీర్ణంలోనిజాంనిర్మించినగౌలిగూడ సెంట్రల్బస్‌స్టేషన్స్థానంలోమల్టీపర్పస్కాంప్లెక్స్‌నునిర్మించాలనిరాష్ట్రప్రభుత్వంనిర్ణయించింది. నగరంనడిబొడ్డునఉన్నఈస్థలాన్నిఆర్టీసీకిఆదాయవనరుగామార్చాలనిప్రభుత్వంనిర్ణయించింది. ఈమేరకునాలుగుఎకరాల్లోభారీభవనసముదాయానికినిర్మించి, ఇందులోకిందబస్టాండ్పైఅంతస్తుల్లోసినిమాహాళ్లు, హోటళ్లు, షాపింగ్మాల్స్వంటివాణిజ్యస‌ముదాయాల‌నునిర్మించ‌నున్నారు. ఈబస్టాండ్‌నురోజుకురెండువేలకుపైగాబస్సులురాకపోకలుసాగించేలానిర్మించనున్నారు.

 1. గండిపేట జలాశయానికి కొత్త రూపు

నగర ప్రజల దాహార్తిని తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న చారిత్రాత్మకఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయానికి కొత్తరూపు రాబోతున్నది. 1920 నుంచిమంచినీళ్లు అందిస్తూ భాగ్యనగరవాసుల మనసులో చెరుగని ముద్రవేసుకున్న ఈ జలాశయం 2020నాటికి వందేడ్లు పూర్తి చేసుకోబోతున్నది. ఈనేపథ్యంలో గండిపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, నగర ప‌ర్యాట‌కంలోనేప్రత్యేక గుర్తింపు సాధించేలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.రూ.100 కోట్లతో సుందరీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత‌ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా రూ.100 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం 2018 మార్చి 5న ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జలాశయం చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు. లోపల దానికి అనుబంధంగా దాదాపు 36 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. ప్రతి రెండు నుంచి 5 కిలోమీటర్ల చొప్పున వినోద కేంద్రాలు, అడ్వెంచర్స్ పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు కొలువుదీరనున్నాయి. మధ్యలో చిన్న చిన్న పార్కులు, కనువిందుచేసేలా ల్యాండ్ స్క్రేపింగ్ (పచ్చందాల)తో శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. అక్కడక్కడా కాటేజీలు ఏర్పాటు చేస్తారు.

 1. హైదరాబాద్పాతబస్తీలోనిసాలార్‌జంగ్మ్యూజియంఎదురుగారూ.231.50కోట్లఅంచనాతోపాదచారులవంతెననునిర్మించనున్నారు. చార్మినార్‌నుఅంతర్జాతీయస్థాయిపర్యాటకప్రాంతంగాతీర్చిదిద్దాలనేలక్ష్యంతోఈపాదచారులప్రాజెక్టునుచేపడుతున్నారు. ప్రాజెక్టుకుసంబంధించినరివైజ్డ్లేఅవుట్స్‌తోపాటునిర్మాణనమూనాలు, సమగ్రప్రాజెక్టునివేదిక (డీపీఆర్)కుబోర్డు31డిసెంబర్, 2018నఆమోదంతెలిపింది. ఈప్రాజెక్టుపనుల్లోదక్కన్సంస్కృతిఉట్టిపడేలానిర్మాణశైలివుండనుంది. చార్మినార్‌కువెళ్లేవీధుల్లోనిభవనాలకుసైతంచార్మినార్ద్వారాలవంటిడిజైన్లనుఏర్పాటుచేయాలనినిర్ణయించారు. ఈప్రాజెక్టులోభాగంగారూ.35కోట్లతోవంతెననిర్మిస్తున్నారు. పర్యాటకులరాకపోకలసౌకర్యార్థందీన్నినిర్మిస్తుండగా.. చిరువ్యాపారులకోసంనయాపూల్వద్దమరోవంతెననిర్మించాలనినిర్ణయించారు.ప్రాజెక్టులోభాగంగా5.40కిలోమీట‌ర్లఔట‌ర్రింగ్‌రోడ్నిర్మాణప‌నుల‌ను2.3కిలోమీట‌ర్లఇన్న‌ర్రింగ్‌రోడ్నిర్మాణాల‌నుకూడాపూర్తిచేయ‌డంజ‌రిగింది. చార్మినార్‌కువచ్చేపర్యాటకులవాహనాలనునిలిపేందుకుబహుళఅంతస్తులపార్కింగ్కాంప్లెక్స్కూడానిర్మించాలనిప్రణాళికలుసిద్ధంచేశారు. చార్మినార్పాదచారులప్రాజెక్టులోభాగంగాఇప్పటికేచార్మినార్‌తోపాటుపరిసరప్రాంతాల్లోపేవ్‌మెంట్పనులుపూర్తవడంతోచార్మినార్పరిసరాలుకొత్తఅందాలనుసంతరించుకొన్నాయి. పనులుత్వరితగతినపూర్తిచేసేందుకుచార్మినార్వద్దఇన్నర్, ఔటర్‌రింగ్రోడ్లమీదుగాట్రాఫిక్‌నుమళ్లించేఏర్పాట్లుచేశారు. అక్కడితోపుడుబండ్లు, ఫుట్‌పాత్వ్యాపారులనుఅక్కడినుంచితరలించిచార్మినార్చుట్టూబండలుపరిచారు.

దేశ పర్యాటక రంగంలో హైదరాబాద్ టాప్– 30.01.2020

దేశవ్యాప్తంగాపర్యాటకరంగంలోహైదరాబాద్అగ్రస్థానంలోనిలిచింది. 2019లోభాగ్యనగరంఅందాలనుతిలకించేందుకుదేశంలోనిపర్యాటకులుక్యూకట్టారనిబుకింగ్డాట్కామ్డిటిటల్ట్రావెలింగ్కంపెనీసర్వేలోవెల్లడించింది. టాప్ 5 నగరాల్లోహైదరాబాద్తర్వాతపుణే, జైపూర్,కొచ్చి, మైసూర్ఉన్నాయి. విదేశీపర్యాటకులుకూడాహైదరాబాద్నుఎక్కువగానేసందర్శించారనిఆసర్వేలోపేర్కొన్నారు.

14.  వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం

తెలంగాణ ఏర్పడిన తర్వాతే హైదరాబాద్‌ మహానగరం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. గతంలో 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 625 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి గ్రేటర్ హైదరాబాద్‌గా అవతరించింది. 1,874 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హుడా 7,254 కిలోమీటర్లకు విస్తరించి అతిపెద్ద అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా రికార్డులకెక్కింది. సమీప భవిష్యత్‌లో హెచ్‌ఎండీఏ పరిధి 20 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది.శాంతిభద్రతలతోపాటు వాతావరణ అనుకూల పరిస్థితులు హైదరాబాద్‌ను జీవనానికి అనుకూలమైన నగరంగా మార్చాయి.

డిఫెన్స్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌

తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల విధానాలు.. వైమానిక, రక్షణరంగంలో హైదరాబాద్ పాత్ర కీలకమైనది. ఏరోస్పేస్, డిఫెన్స్ స‌హా ఇతర రంగాల్లో ఆవిష్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. స్టార్ట‌ప్ ఎకో సిస్ట‌మ్ ను ప్రోత్స‌హించేందుకు దేశంలోనే అతిపెద్దదైన టీ-హబ్ ఇంక్యుబేట‌ర్‌ను ఏర్పాటు చేయ‌గా.. బోయింగ్, ప్రాట్అండ్విట్నీ, కాలిన్ ఏరో స్పేస్ త‌దిత‌ర అమెరికా కంపెనీలు ఇందులో భాగ‌స్వామ్యంగా ఉండి ప‌ని చేస్తున్నాయి. ఏరోస్పేస్, రక్షణరంగాల్లో హైద‌రాబాద్ చారిత్ర‌కంగా డిఫెన్స్ ఎకో సిస్ట‌మ్ ను క‌లిగి ఉన్న‌ది.

డజనుకు పైగా జాతీయ రక్షణ సంస్థలకు నెలవు

రక్షణవిభాగానికిసంబంధించిడజన్వరకుజాతీయసంస్థలుఉండగా, దశాబ్దాలనుంచిడీఆర్డీవోఇక్కడినుంచేసేవలందిస్తున్నది. ఏరోస్పేస్, రక్షణరంగాల్లోపెట్టుబడులుపెట్టేందుకుభారత్మొత్తంలోమెరుగైనవాతావరణంతెలంగాణలోఉన్నది. ఇప్పటికేప్రతిష్టాత్మకమైనబోయింగ్, జీఈతదితరసంస్థలుఆదిభట్ల, నాదర్‌గుల్‌లోయూనిట్లుఏర్పాటుచేసుకొనిఉత్పత్తులుప్రారంభించాయి. అమెరికాఅధ్యక్షుడుఉపయోగించేహెలికాప్టర్‌తోపాటుఎఫ్-16 యుద్ధవిమానంవిడిభాగాలుసైతంహైదరాబాద్‌లోనేతయారవ్వటంఇక్కడివిధానాలకునిదర్శనం. రక్షణరంగానికిఅవసరమయ్యేలీప్ఇంజిన్లు, ఎఫ్-16 యుద్ధవిమానాలరెక్కలు, అపాచీహెలికాప్టర్లవిడిభాగాలు, ఆదానీఎల్పిదాడిఫెన్స్సిస్టమ్ద్వారాడ్రోన్లతయారీ, సూపర్హెర్క్యులస్ఎయిర్లిఫ్టర్తదితరభాగాలనుఇక్కడఉత్పత్తిచేస్తున్నారు.  హైదరాబాద్లోఇప్పటికేనాలుగుఏరోస్పేస్పార్కులుఉండగా, మరోరెండుఏర్పాటుచేసేందుకుచర్యలుచేపట్టారు. నైపుణ్యంగలవారినితయారుచేసేందుకుతెలంగాణఅకాడమీఆఫ్స్కిల్స్ద్వారాఅధికారులుశిక్షణఇస్తున్నారు.

హైదరాబాద్‌లో వరల్డ్క్లాస్ఏరోస్పేస్యూనివర్సిటీ

హైదరాబాద్‌లోవరల్డ్క్లాస్ఏరోస్పేస్యూనివర్సిటీనిఏర్పాటుచేసేందుకుప్రభుత్వంప్రణాళికలుసిద్ధంచేస్తున్నది. ఇందులోపాలుపంచుకునేందుకుయూఎస్డిఫెన్స్మేజర్స్, ట్రైనింగ్పార్టనర్స్ముందుకురావాలనిమంత్రికేటీఆర్ఆహ్వానించారు. నైపుణ్యంగలయువతనుపెద్దసంఖ్యలోతయారుచేయడంవల్లఅటుకంపెనీలకు, ఇటుభాగస్వాములకులబ్ధిచేకూరుతుంది.

ప్రపంచంలోనే పెద్ద కార్యాలయాన్ని నెలకొల్పిన అమెజాన్

టీఎస్‌ఐపాస్పాలసీనికూడాఎక్కడాలేనివిధంగా తెలంగాణలోఅమలుచేస్తున్నారు. పెద్దపెద్దకంపెనీలుహైదరాబాద్‌కురాగా, అమెజాన్ప్రపంచంలోనేఅతిపెద్దకార్యాలయాన్నిఇక్కడనెలకొల్పింది. జీఈ, హనీవెల్, ప్రాట్అండ్విట్నీ, లాక్‌హీడ్మార్టిన్, తదితరపెద్దకంపెనీలపెట్టుబడులనుకూడాహైదరాబాద్ఆకర్షించింది.

 1. అన్నిరంగాల్లో వేగంగా పురోగమిస్తున్న ప్రపంచంలోని 20 అగ్రశ్రేణి నగరాల్లో హైదరాబాద్ ప్రథమస్థానంలో నిలిచింది. రియల్ ఎస్టేట్ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన  జోన్స్ ల్యాంగ్ లాసలే (జెఎల్ఎల్) సంస్థ సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా  ప్రపంచవ్యాప్తంగా 130 నగరాల్లో అధ్యయనం చేసి 2020 జనవరి 18న ర్యాంకులు ప్రకటించింది. భారత్ నుంచి ఎంపికైన 7 నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో నిలవగా, బెంగళూరు (2), చెన్నై (5), ఢిల్లీ (6), పుణే (12), కోల్ కతా (16), ముంబై (20) స్థానాలు సంపాదించాయి. జేఎల్ఎల్ ర్యాంకింగుల్లో తెలంగాణ తొలిసారి 2015లో హైదరాబాద్ 20వ స్థానంలో, 2016లో 5వ స్థానంలో, 2017లో 3వ స్థానంలో, 2018లో 1వ స్థానంలో, 2019లో 2వ స్థానంలో నిలవగా, 2020లో మళ్లీ 1వ స్థానంలో నిలిచింది.
 1. ప్రపంచస్థాయి సౌకర్యాలు, ప్రభుత్వ విధానాల కారణంగా ఇళ్ల ధరల పెరుగుదలలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తన సర్వేలోవెల్లడించింది. 2019లో 150 నగరాల్లోఇళ్లధరలపెరుగుదలనుపరిశీలించిననైట్ఫ్రాంక్సంస్థ..  అంతర్జాతీయస్థాయిలోచూస్తే 9శాతంపెరుగులతోహైదరాబాద్ 14వస్థానంలోనిలిచిందనితననివేదికలోపేర్కొంది. ఇళ్లఅమ్మాకాల్లో 24శాతంపెరుగుదలతోహంగేరీరాజధానిబుడాపెస్ట్అగ్రస్థానాన్నిదక్కించుకోగా, 16 శాతంపెరుగుదలతోచైనాలోనిషియాన్, 15శాతంపెరుగుదలతోఉహాన్నగరాలునిలిచాయి. 2015 నుంచిదేశంలోఇతరఅగ్రశ్రేణినగరాలైనఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా, ముంబయ్, చెన్నై, పుణేలుకూడాఇళ్లధరలపెరుగుదలలోహైదరాబాద్తోపోటీపడలేకపోతున్నాయి.

మెట్రో రైల్ ప్రాజెక్టు

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల నివారణకు, సౌకర్యవంతమైన ప్రయాణానికి మెట్రో రైలు ఉపయోగపడుతున్నది.మొదటి దశలో మూడు కారిడార్లలో 72 కి.మీ. మెట్రో లైను నిర్మాణం జరగాల్సిఉండగా… 07 ఫిబ్రవరి, 2020 నాటికి 67 కి.మీ. మెట్రో మార్గం ప్రారంభమయ్యంది.2012లో పనులు ప్రారంభించినప్పటికీ, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పనుల్లో వేగం పెరిగింది. హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండవ అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్టుగా గుర్తించబడింది. రూ.21,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పిపిపి) ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచింది.269 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం సేకరించి ఇచ్చింది. భూ సేకరణ, రోడ్ల వెడల్పు తదితర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,400 కోట్లు ఖర్చు చేసింది. ఈ మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉప్పల్‌ డిపోలో ఏర్పాటు చేశారు. మెట్రోరైల్ నడిచే అన్ని మార్గాలను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్‌ వ్యవస్థ ఉంది. హైదరాబాద్ మెట్రో అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములోనే మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం కలిగివుంది. భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషన్లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ బస్సులకు, మెట్రో రైలు సర్వీస్‌లు అనుసంధానం చేశారు. మినీ బస్సులు ఏర్పాటు చేయడమేగాక ప్రత్యేకంగా బస్ బేలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రో రైలుకు స్మార్ట్ కార్డ్, యాప్ ను రూపొందించారు. ప్రతి స్టేషన్ వద్ద 600 మీటర్ల పరిధిలో వైట్ టాపింగ్ రోడ్లు నిర్మించారు. మెట్రో రైలు గరిష్ట వేగాన్ని 90 కి.మీ. గా నిర్ణయించారు. రైళ్ల సగటు వేగం 34 కి.మీ.గా వుంది. మెట్రో రైలు ప్రయాణం ప్రయాణికుడికి 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నది. మెట్రో పర్యావరణ కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తగిస్తుంది. మన మెట్రోకు 150 కి మించి ప్రతిష్టాత్మకమైన అవార్డులు సాధించింది. హైదరాబాద్ మెట్రోను గూగుల్ కు అనుసంధానం చేయనున్నారు.ప్రతీరోజు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.11 ఫిబ్రవరి 2020న మూడు మెట్రో కారిడార్లలో కలిపి మొత్తం 4,47,009 మంది మెట్రోరైళ్లలో ప్రయాణించి రికార్డు సృష్టించింది. మెట్రోలు ప్రతీ రోజు 780 ట్రిప్పులు నడుస్తున్నాయి. ప్రతీ రోజు 18,000 కిలోమీటర్లు తిరుగుతున్నది. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ , కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కాంకర్స్ లెవెల్‌లో నిర్మించారు.

పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో హైదరాబాద్‌ నగరంలో నిర్మించిన మెట్రోరైల్‌ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో నెట్‌వర్క్‌లలో ఒకటి. 72 కిలోమీటర్ల పొడవు 66 స్టేషన్లతో నిర్మించిన ఈ వ్యవస్థకు ప్రభుత్వం రూ. 17,290.31 కోట్లు ఖర్చు చేసింది.

మెట్రో మొదటి దశ వివరాలు

క్ర.సం.స్టేషన్లుదూరం (కి.మీ)కారిడార్ప్రారంభ తేదీప్రారంభించిన వారు
1నాగోల్-అమీర్ పేట్16.8కారిడార్ 329 నవంబర్, 2017 
2మియాపూర్-అమీర్ పేట్11.3కారిడార్ 129 నవంబర్, 2017ప్రధాని     నరేంద్ర మోడీ
3అమీర్ పేట్-ఎల్.బి.నగర్16.8కారిడార్ 124 సెప్టెంబర్, 2018గవర్నర్ నరసింహన్, కేటీఆర్
4అమీర్ పేట్ -హైటెక్ సిటీ8.5కారిడార్ 320 మార్చ్, 2019గవర్నర్ నరసింహన్
5హైటెక్ సిటీ-రాయదుర్గం1.5కారిడార్ 329 నవంబర్, 2019మంత్రి కేటీఆర్
6జెబిఎస్-ఎంజిబియస్11కారిడార్ 207 ఫిబ్రవరి, 2020ముఖ్యమంత్రి కేసీఆర్
7ఎంజిబిఎస్-ఫలక్ నుమా5.2కారిడార్ 2పనులు జరుగుతున్నవి 

07 ఫిబ్రవరి, 2020 నాటికి మొత్తం 67 కి.మీ. మార్గంలో మెట్రో రైల్ నడుస్తున్నది. ఈ మార్గాల్లో 56 స్టేషన్లు ఉన్నాయి. మొదటి దశలో భాగంగా నిర్మించిన నాగోలు- మియాపూర్ మార్గాన్ని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా 2017 నవంబర్ 28న మధ్యాహ్నం 2.30 గంటలకుప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించి, ప్రయాణించిన మొదటి మెట్రో రైలును మహిళా పైలెట్ సుప్రియ సునమ్(తెలంగాణ బిడ్డ) నడపడం విశేషం. మొదటి దశ 30 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో రైలులో మూడు కోచ్‌లు వున్నాయి. మెట్రో ప్రారంభం నాటికి 57 రైళ్లు నగరానికి చేరుకున్నాయి. వాటంతటవే తెరుచుకునే తలుపులతో కూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు మెట్రోలో వున్నాయి. ఒకేసారి 1000 మంది ప్రయాణించవచ్చు. ప్రతీ 3.5 నుంచి 6 నిముషాలకు ఒక రైలు నడుపుతున్నారు.

        అమీర్ పేట్ నుంచి ఎల్.బి.నగర్ (16 కి.మీ.) మార్గాన్ని 24 సెప్టెంబర్ 2018 న ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో నగరంలో మొత్తం 46 కి.మీ.లలో మెట్రో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు నిర్మించే 10 కిలోమీటర్ల మార్గాన్ని, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లీవన్ (11 కి.మీ.) వరకు గల మార్గాన్ని07 ఫిబ్రవరి, 2020న అందుబాటులోకితెచ్చారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు సర్వే జరుగుతున్నది. దీని నిర్మాణం కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

కారిడార్ 4

రెండోదశ ప్రతిపాదనలతోపాటు నగరంలో మరిన్ని రూట్లను కలుపుకొని పరిపూర్ణంగా ప్రజలకు మెట్రో ప్రయాణాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటివరకు మూడు కారిడార్ల నిర్మాణానికి పరిమితమైన మెట్రో నాలుగో కారిడార్‌ నిర్మాణానికి సిద్ధమవుతున్నది. కారిడార్‌- 4ను బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌వరకు 26.2 కిలోమీటర్లు మియాపూర్‌ మీదుగా నిర్మించేందుకు నిర్ణయించారు. కారిడార్‌- 3ను కూడా నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌వరకు 5.1 కిలోమీటర్లు పొడిగించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చెమ్మార్‌ అందించింది.

హైదరాబాద్‌ నగర రూపురేఖలు మార్చేక్రమంలో మెట్రోరైలు మరికొన్ని కొత్త రూట్లలో దూసుకుపోనున్నది. రెండో దశ మెట్రోకు ప్రతిపాదిత మార్గాలు…

 1. , ఖాజాగూడ, రాజేంద్రనగర్‌ మీదుగా శంషాబాద్‌వరకు.
 2. , మదీనగూడ, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌, కొత్తగూడ జంక్షన్‌, షేక్‌పేట, మెహిదీపట్నం మీదుగా లక్డీకాపూల్‌కు చేరుకొని మొదటిదశ ప్రాజెక్టులో నిర్మించిన కారిడార్‌- 1కు అనుసంధానం అవుతుంది.
 3. , కామినేని దవాఖాన మీదుగా ఎల్బీనగర్‌లోని మొదటిదశ కారిడార్‌- 1కు (5.1 కిలోమీటర్లు) అనుసంధానం అవుతుంది.
 4. లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ద్వారా రైల్వే ప్రయాణాన్నివిస్తరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఎంఎంటీఎస్ రెండో దశను ఘట్‌కేసర్ నుంచి రాయగిరి (యాదాద్రి) వరకు 32 కిలో మీటర్లు పొడిగింపుకై కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ అదనపులైన్ నిర్మాణానికిరూ.330 కోట్లవ్య‌యంకానున్నది.ఎంఎంటీఎస్‌కు సంబంధించి గతంలో ఉన్న ఒప్పందం ప్రకారం అయ్యే ఖర్చులో మూడింట రెండు వంతుల వాటాను(రూ.275 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం, మూడింట ఒకవంతు కేంద్రం (రూ.137 కోట్లు) భరించనుంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయనున్నారు.
 1. , నాగులపల్లి కొత్త రైల్వే టర్మినల్స్

నగరంలో ఉన్న సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లపై వత్తిడీ విపరీతంగా పెరిగింది. పెరిగిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర శివార్లలో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో చర్లపల్లి, నాగులపల్లి జంక్షన్లు అభివృద్ధి చేయడానికి దక్షిణ మధ్య రైల్వేతో ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. ఢిల్లీ, చెన్నై రూట్లకు చర్లపల్లి, ముంబాయి రూట్ కు నాగులపల్లి రైల్వే జంక్షన్లు అనుకూలంగా ఉంటాయి.వీటివల్ల ప్రయాణీకులకు సౌకర్యం, నగర ట్రాఫిక్ పై వత్తిడి తగ్గుతుంది.

 1. పరిశుభ్ర నగరం కోసం ‘స్వచ్ఛ హైదరాబాద్’

హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి రూ.1000 కోట్లు వెచ్చించింది. 2015 మే 16 నుండి 20 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా హైదరబాద్ నగరాన్ని 425ల భాగాలుగా విభజించి, ఒకటి నుండి రెండు చదరపు కిలోమీటర్ల పరిధిని ఒక వ్యక్తిగత బృందం ఆధ్వర్యంలో అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ రూపొందించింది. ప్రజా ప్రతినిధులందరికీ బాధ్యతలు అప్పగించింది. మొత్తం 35,833 మంది ఔత్సాహికులు స్వచ్ఛ హైదరాబాద్ లో భాగస్వాములయ్యారు. మెరుగైన మౌలిక సదుపాయాల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 5096 పనులను చేప‌ట్టారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో త‌డి, పొడి చెత్త‌ను విడివిడిగా వేరుచేసి అందించేందుకు 44ల‌క్ష‌ల డ‌స్ట్‌బిన్‌ల‌ను న‌గ‌ర‌వాసుల‌కు ఉచితంగా అంద‌జేశారు. చెత్త‌ను త‌ర‌లించ‌డానికి 2వేల స్వ‌చ్ఛ ఆటోల‌ను నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం అందించింది.

‘ప్రతిఆదివారంపదిగంటలకుపదినిమిషాలు’

ప్రజాప్రతినిధులకుమంత్రికేటీఆర్లేఖ (17 మే 2020)

సీజనల్‌వ్యాధులబారినపడకుండాపరిసరాలపరిశుభ్రతనుపాటిద్దామని, దీనినిఓసామాజికకార్యక్రమంగాభావించేలాప్రజలనుభాగస్వామ్యంచేయాలనిప్రజాప్రతినిధులకుఐటీ, పురపాలకశాఖమంత్రికేతారకరామారావుపిలుపునిచ్చారు. సీజనల్‌వ్యాధులనుఅరికట్టడంలోప్రజాప్రతినిధులసహకారంకోరుతున్నామని, వారిఇండ్లనుంచేఈకార్యక్రమంప్రారంభంకావాలనిఆయనకోరారు. కరోనానేపథ్యంలోఅలవాటైనవ్యక్తిగతపరిశుభ్రతనుఇకముందుకూడాకొనసాగించివ్యాధులనుదరిచేరకుండాచూద్దామన్నారు. సీజనల్‌వ్యాధులనివారణలోపురపాలకశాఖఇప్పటికేఒకప్రత్యేకక్యాలెండర్‌రూపొందించి, వాటినిఅరికట్టేందుకుప్రణాళికలుసిద్ధంచేసిందనివివరిస్తూమంత్రికేటీఆర్‌తెలంగాణప్రజాప్రతినిధులకులేఖరాశారు.

 • బహిరంగ మల విసర్జనరహిత (ఓడీఎఫ్) నగరం: కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్

మిషన్ 2018 జనవరి 2నహైదరాబాద్నగరాన్నిబహిరంగమలవిసర్జనరహిత (ఓడీఎఫ్) నగరంగాప్రకటించింది. ఈహోదాఆరునెలలపాటుఉంటుంది. హైదరాబాద్నుఓడీఎఫ్నగరంగాప్రకటించేక్రమంలోస్వచ్ఛభారత్మిషన్‌ నాణ్యతాపరీక్షలవిభాగంబహిరంగమలవిసర్జన (ఓడీఎఫ్)పైపలుప్రాంతాల్లోతనిఖీలునిర్వహించింది. ఎంపికచేసుకున్నప్రాంతాల్లోసభ్యులుపర్యటించిబహిరంగ, మలవిసర్జననిషేధంఅమలునుపరిశీలించారు.

షి టాయిలెట్స్: నగరంలో 47 చోట్ల రూ.3.75 కోట్ల ఖర్చుతో షీ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.

స్వ‌చ్ఛ ఆటోటిప్ప‌ర్ల పంపిణీ : హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప‌రిశుభ్ర న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డానికి గాను 2వేల ఆటో టిప్ప‌ర్ల‌ను అందించే ప‌థ‌కాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించింది. డ్రైవ‌ర్ క‌మ్ ఓన‌ర్ ప‌ద్ధతిలో ఈ ఆటో ట్రాలీల‌ను న‌గ‌రంలోని నిరుద్యోగ యువ‌త‌కు ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా 2015 నవంబర్ 9న పంపిణీ చేయడం జరిగింది. 2,631 ట్రై సైకిళ్ల‌ను, 37 రెఫ్యూజ్ కాంఫ్యాక్ట‌ర్లు, 1,425 కాంఫ్యాక్ట‌ర్ బిన్‌ల‌ను కూడా అంద‌జేశారు.

 • చెత్త రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా

జీహెచ్‌ఎంసీచెత్తసేకరణకుఉపయోగించేస్వచ్ఛఆటోట్రాలీలస్థానంలోఎలక్ట్రిక్వాహనాలనుప్రవేశపెడుతున్నది. ఇందులోఉండేబ్యాటరీనివిద్యుత్‌తోచార్జింగ్చేయడంద్వారాఇవినడుస్తాయి. జీహెచ్‌ఎంసీకిచెందినవ్యర్థాలవాహనాలన్నింటినీఎలక్ట్రిక్‌వాహ‌నాలుగామార్చితేఏటా20లక్షలటన్నులకార్బన్ఉద్గారాలనుతగ్గించవచ్చు. డీజిల్వాహనాలకుకిలోమీటర్‌కురూ.3ఖర్చవుతుండగా, ఎలక్ట్రిక్వాహనాలకు50పైసలుమాత్రమేఖర్చవుతుంది.

 • ఇంటింటికీ రెండు డ‌స్ట్‌ బిన్‌ల‌ పంపిణీ

వ్యర్థ పదార్థాలను పారేయడానికి 44 లక్షల రెండు రంగుల చెత్త డబ్బాలను నగరంలో ఉన్న 22 లక్షల కుటుంబాలకు చెత్త సేకరణ కోసం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఆటోల ద్వారా వచ్చిన చెత్తను లారీల ద్వారా తరలించేందుకు అప్పటిదాకా ఉన్న 13 ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తోడు కొత్తగా మరో పన్నెండు కేంద్రాలను జీహెచ్ఎంసి ఏర్పాటు చేసింది. ఈ చర్యలవల్ల రోడ్లపై దుర్గంధం వెదజల్లే చెత్తకుండీల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో 3,300 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తే, ఇప్పుడు 4,800 మెట్రిక్ టన్నుల చెత్తను నగరం నుంచి బయటకు పంపిస్తున్నారు.  హైద‌రాబాద్ న‌గ‌రంలో చేప‌డుతున్న స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల వ‌ల్ల కేంద్ర స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ నిర్వ‌హించిన 2017 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో హైద‌రాబాద్ న‌గ‌రం మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి స్థానంలో నిలువ‌గా అన్ని న‌గ‌రాల్లో 22వ స్థానంలో నిలిచింది. 2018లో వ్య‌ర్థ‌ప‌దార్థాల నిర్వ‌హ‌ణ‌లో హైద‌రాబాద్ మెట్రో న‌గ‌రాల్లో అగ్ర‌స్థానంలో నిలిచింది.

 • జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌తో పాటు 12 గ్రామాల‌కు తాగునీటి స‌ర‌ఫ‌రా : గ్రేట‌ర్

హైద‌రాబాద్‌లోఉత్ప‌త్తిఅయ్యేచెత్త‌నుత‌ర‌లించేజ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌తోపాటు12గ్రామాల‌కుసుర‌క్షితమంచినీటిస‌ర‌ఫ‌రాచేసేందుకురూ.4.61కోట్ల‌నుజీహెచ్ఎంసీవిడుద‌లచేసింది. వీటిలోరూ. 3.46కోట్లుమంచినీటిస‌ర‌ఫ‌రాకు, రూ. 1.15కోట్లు200ఎంఎంవాట‌ర్స‌ప్లైపైప్‌లైన్ల‌కుకేటాయించారు.

 • జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ వ్య‌ర్థాల ట్రీట్‌మెంట్‌ రూ.1.86 కోట్లు : గ‌త ద‌శాబ్దంన్న‌ర

కాలంగాహైద‌రాబాద్‌లోనిచెత్త‌నుత‌ర‌లించేజ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్డంప్‌యార్డ్‌ లోపేరుకున్న‌ 6.50ల‌క్ష‌లట‌న్నులచెత్తద్వారాప్ర‌తిరోజుఉత్ప‌త్తిఅయ్యేకాలుష్యభ‌రిత‌మైనద్ర‌వాలను (లీచెట్‌) శుద్దిచేయ‌డానికిరూ. 1.86కోట్లవ్య‌యంతోప్ర‌త్యేకంగాట్రీట్‌మెంట్ప్లాంట్ఏర్పాటుచేశారు. దీంతోప‌రిస‌రగ్రామాలచెరువులు, భూగ‌ర్భజ‌లాలుకాలుష్యబారినప‌డ‌కుండాఉన్నాయి. జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్డంపింగ్యార్డ్క్యాపింగ్ప‌నులుపూర్త‌య్యాయి.

 • భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు

న‌్యూఢిల్లీ, నాగ్‌పూర్ న‌గ‌రాల అనంత‌రం కేవ‌లం హైద‌రాబాద్ న‌గ‌రంలోనే భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల‌ను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్ర‌క్రియ పురోగ‌తిలో ఉంది. న‌గ‌రంలో తీవ్ర స‌మ‌స్య‌గా మారిన భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలను రీసైక్లింగ్ చేయ‌డం ద్వారా ఇటుక‌లు, పేవ‌ర్ బ్లాక్‌లు, ఇసుక‌, కంక‌ర విడిగా చేయ‌డంతోపాటు నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మ‌య్యే మెటీరియ‌ల్ త‌యారీ చేయ‌డానికి ఫ‌తుల్లాగూడ‌, జీడిమెట్ల‌లో ఈ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నిర్మాణ వ్యర్థాల తరలింపు వాహనాలను 2017 డిసెంబర్ 12న జీహెచ్‌ఎంసీలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

 • మురుగునీటి శుద్ధి కేంద్రాలు

భారీ అపార్ట్‌మెంట్లలో ఎస్టీపీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వంద అపార్ట్‌మెంట్లుంటే కచ్చితంగా అందులో చిన్న మురుగునీటి శుద్ధి కేంద్రం ఉండాలని, లేదంటే బిల్డర్‌పై చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.

 • దేశంలోనే అత్యాధునిక జంతు వ‌ధశాల‌లు

దేశంలోనే అత్యంత ఆధునిక‌, మెక‌నైజ్‌డ్ జంతు వ‌ధశాల‌ల‌ను నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. అంబ‌ర్‌పేట్‌, గౌలిపుర‌, రాంనాస్‌పుర‌, న్యూబోయిగూడ‌లో ఈ ఆధునిక జంతు వ‌ధశాల‌లు ఏర్పాటు చేయ‌డంతోపాటు రూ. 70కోట్ల‌తో చెంగిచ‌ర్ల‌లో కామ‌న్ రెండ‌రింగ్ ప్లాంట్‌ను జీహెచ్ఎంసీ నిర్మించింది. అలాగే, చెంగిచర్లలో అంతర్జాతీయ స్థాయి పశు వధశాల (కబేలా)ను పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో ఏర్పాటు చేయనున్నది.

 • ప్రజలు-ఉద్యోగుల పరిచయం

‘పరిచయం’  అనే పేరుతో నగర పాలక సంస్థ తీసుకున్న వినూత్న కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఏ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ బాధ్యత ఏ ఉద్యోగిదో  తెలియడం వల్ల ప్రజలు-ఉద్యోగుల మధ్య సమన్వయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశుధ్య ప్రణాళికను స్వచ్ఛ భారత్ మిషన్ ఎంతగానో ప్రశంసించింది.

 • హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాలు  

హైదరాబాద్  నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నది. హైదరాబాద్ రోడ్లపై ఇప్పటికే 200 పైగా ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతున్నాయి.ఆర్టీసీలో 40 ఈ-వాహనాలను తీసుకురానున్నారు.హైదరాబాద్‌ను కాలుష్యంనుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగా జీహెచ్‌ఎంసీ ఉపయోగించే వాహనాలను, బస్సులను దశలవారీగా కాలుష్యానికి ఆస్కారంలేని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో భాగంగా జిహెచ్ఎంసి అధికారులు ఉపయోగించేందుకు డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టింది.ఇంటింటా వ్యర్థాల సేకరణకు ఉపయోగించే డీజిల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను ద‌శ‌ల‌వారిగా ప్రవేశపెడుతున్నారు. ఎలక్ట్రిక్‌ బైక్స్‌సైకిల్స్‌ ను ప్రమోట్‌ చేసేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ పలు చర్యలు తీసుకుంటోంది. ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం తరపున అన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

నగరంలో టూరిస్టులకు ఎలక్ట్రిక్ ఆటోలు

హైదరాబాద్ నగరంలో పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. చారిత్రక కట్టడాల వద్ద వాహన కాలుష్యం పెరుగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మొదటిదశలో 50 వాహనాలను అందుబాటులోకి తేనుంది. చార్మినార్‌ను పాదచారుల ప్రాజెక్టుగా ప్రకటించడంతో పర్యాటకులసౌక‌ర్యార్థం కోసం ఎలక్ట్రిల్ వాహనాలను నడుపనున్నారు.

ఎలక్ట్రిక్ ఆటోలతో ఉపయోగం : ఒక్కో డీజిల్ ఆటోను ఎలక్ట్రిక్ ఆటోగా మార్చడంవల్ల ఐదేండ్లలో 35 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు జీహెచ్‌ఎంసీకి చెందిన వ్యర్థాల వాహనాలన్నింటినీ ఎలక్ట్రిక్‌గా మార్చితే ఏటా 20 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. డీజిల్ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.3 ఖర్చవుతుండగా, ఎలక్ట్రిక్ వాహనాలకు 50 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. నిర్వహణ ఖర్చులు, విడిభాగాల వ్యయం కూడా డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఒక్కో వాహనం మూడు గంటలు చార్జింగ్ చేస్తే 800 కిలోల బరువుతో 110 కి.మీ. వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తాయి.

ఈ వెహికిల్స్ చార్జింగ్ స్టేషన్లు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఫిన్‌లాండ్‌కు చెందిన ఫోర్టం కంపెనీ భాగస్వామ్యంతో బేగంపేట, రాజ్‌భవన్ రోడ్డులో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన రెండు ఈ వెహికిల్స్ చార్జింగ్ స్టేషన్లను 7 జులై, 2018న ప్రారంభించారు. మరో 50 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టారు. 2018-19 లో మరో 150-200 వరకు స్టేషన్లను నెల‌కొల్ప‌నున్నారు.

హైదరాబాద్ లో హరితహారం

హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరం పరిధిలో పది కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016-17 సంవత్సరంలో వర్షాకాలంలో 81 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్ధారించుకుని, లక్ష్యానికి మించి 84.91 ల‌క్ష‌లమొక్క‌ల‌ను రూ.10.38 కోట్ల ఖర్చుతోనాటారు. 2017-18లో రూ.76 లక్షల మొక్క‌లు  గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో రూ.2 కోట్ల 80 లక్షల ఖర్చుతో నాటారు. 285 కాల‌నీ పార్కుల‌ను కొత్త‌గా ఏర్పాటు చేయ‌గా 59 సెంట్ర‌ల్ మీడియాల‌ను, 34 న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. హెచ్ఎండిఏ,       అట‌వీశాఖ‌, ఐటీశాఖ‌లతోఆధ్వర్యంలో ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ మొక్కలు నాటారు.

గ్రేటర్హైదరాబాద్వ్యాప్తంగా5.50కోట్లమొక్కలునాటేలక్ష్యం

ఆరోవిడతహరితహారంకార్యక్రమాన్ని 25 జూన్ 2020నమంత్రికేటీఆర్సనత్నగర్ వద్ద బల్కంపేట శ్మశానవాటికలోమొక్కలునాటిప్రారంభించారు. గ్రేటర్హైదరాబాద్వ్యాప్తంగా5.50 కోట్లమొక్కలునాటాలనిలక్ష్యంగాపెట్టుకున్నారు. ఇందులో2.50 కోట్లమొక్కలనుజీహెచ్ఎంసీపరిధిలోకొత్తగానాటుతారు. అలాగేహెచ్ఎండీఏపరిధిలోమరో3 కోట్లమొక్కలనుపచ్చదనంపెంచనున్నారు.  హరితహారంకోసండివిజన్లవారీగాఖాళీస్థలాలు,నాలాలు, చెరువులవద్దమొక్కలునాటేందుకుగ్రీన్యాక్షన్ప్లాన్సిద్ధంచేశారు.  2020 జూన్25 నుంచిఆగస్టు15 వరకుఈకార్యక్రమాన్నినిర్వహించారు.

నగరంలోమూడుఅర్బన్ఫారెస్టులుపెంచుతున్నారు. 700 చోట్లట్రీపార్కులు, మరో75 చోట్లయాదాద్రిమోడల్ప్లాంటేషన్ లనుప్రారంభిస్తున్నారు.

గ్రీన్‌హైదరాబాద్‌లోభాగంగారూ.332.70 కోట్లతోహెచ్‌ఎండీఏపరిధిలో 807 లక్షలమొక్కలు, జీహెచ్‌ఎంసీపరిధిలో 486 లక్షలమొక్కలనునాటారు. రూ.250 కోట్లతో 934 పార్కులునిర్మించారు.

హైదరాబాద్ చుట్టూ అటవీ మండళ్ల అభివృద్ధి

రోజురోజుకూ అభివృద్ధి పథాన పయనిస్తూ, భౌగోళికంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని, చుట్టుపక్కల ప్రాంతాల్ని అన్నివిధాలా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనివార్యమయింది. నగరానికి అన్నివైపులా 50-60 కిలోమీటర్ల విస్తీర్ణంలో లక్షన్నర ఎకరాలకుపైగా అటవీభూమి ఉన్నది.దాన్ని కాపాడుకొంటూ ఆరోగ్యకరమెన గాలి పీల్చుకొనేలా అటవీ మండళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ రివర్‌ఫ్రంట్, హైదరాబాద్ అర్బన్ ఫారెస్ట్రీ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తుంది.మూసీ రివర్‌ఫ్రంట్‌లో కేబీఆర్ పార్క్‌ లో మాదిరిగా వాక్ వే రూపొందించనున్నారు.

ఖాళీ ప్రదేశాలన్నింటినీ దట్టమైన అరణ్యంలా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన అకిర మియవాకి అనే  సాంకేతికతతో మూడేళ్లలోనే దట్టమైన అడవి పెంచనున్నారు. ఇదే సాంకేతికతను జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌లో అడవులను పెంచనుంది. సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా అడవుల ఏర్పాటు, నిర్వహణకు ఎన్టీపీసీ, జెన్‌క్యూ, ఎక్స్‌గాన్, సీజీఐ కంపెనీలు ముందుకొచ్చాయి. బెంగళూరు, చెన్నై, మహారాష్ట్రలో మియవాకి టెక్నాలజీతో అడవులను అభివృద్ధి చేశారు. ఇదే తరహాలో ఇక్కడ కూడా అడవులను పెంచనున్నారు.

 • – జీవం

భూగర్భ జలాలు అడుగంటిపోయి, నీటి సమస్య తలెత్తకుండా హైదరాబాద్ నగరంలో జలం-జీవం పేరుతో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని 2018 జనవరి 6నుంచి జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు సంయుక్తంగా ఆరు నెలలపాటు నిర్వ‌హించాయి. నిబంధనలప్రకారం 300 గజాలు దాటిన ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో బాధ్యులైన ఇండ్ల యజమానులు, అధికారులకు అపరాధ రుసుంచెల్లించాల్సి ఉంటుంది.క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకొనిఅక్కడికక్కడే వాటిని పరిష్కరించేందుకు ఉద్దేశించిన మన నగరం కార్యక్రమాన్నిప్రభుత్వం నిర్వహిస్తున్నది.

 • పారిశ్రామిక కాలుష్య రహితంగా హైదరాబాద్

హైదరాబాద్ నగరాన్ని పారిశ్రామిక కాలుష్య రహిత నగరంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. నగరంలో 1545 పరిశ్రమలు కాలుష్య కారకమైనవిగా గుర్తించారు. ఈ పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్ అవతలికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 19 ప్రాంతాలను గుర్తించి అక్కడ ఇండస్ట్ట్రియల్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భోలక్‌పూర్‌లోని లెదర్ పరిశ్రమను చెంగిచర్లకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ లో రెండు ఔషద వనాలు

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ఔషధ ఉద్యానవనాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రజలలో ఔషధ మొక్కల ఉపయోగంపై,  ఏయే రకాల ఔషధ మొక్కలు ఏ విధంగా ఉపయోగపడుతాయనే అవగాహన కల్పించేలా మానవాకృతిలో ఔషధ వనాలను నెలకొల్పనున్నారు. ఔషధ వనాల ఏర్పాటుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ప్రణాళికలను రూపొందిస్తున్నది. మొదటిదశలో ఇందిరాపార్క్, ట్యాంక్‌బండ్‌లపై ప్రత్యేక తరహాలో ఈ థీమ్ పార్కులను ఏర్పాటుచేయనున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో మానవాకారంలో గార్డెన్‌ను రూపొందించి ఏయే రకం వ్యాధులకు ఏ మొక్కలను ఉపయోగించాలో తెలిసేలా ఒక్కో అవయవం వద్ద ఒక్కో మొక్కనుంచాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీలో త్వరలో ఈ పార్క్‌ లను ఏర్పాటుచేసి ఇతర పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు.

 • మెరుగైన మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు

మెరుగైన మురుగునీటి వ్యవస్థ నిర్మాణం కోసం పెరిఫెరల్ సర్కిల్స్ కు రూ.3100 కోట్లు, మూసీ మురుగునీటి ప్రక్షాళనకు రూ.1200 కోట్లు వెరసి రూ.5540 కోట్ల ఖర్చు అంచనా జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక తో ముందుకు పోతున్నది.  ప్రధాన నగరంలోని డ్రైనేజి వ్యవస్థను ఆరు జోన్లుగా విభజించారు. అవరోధాలకు అవకాశం లేకుండా, ఆక్రమణలకు తావులేకుండా, మురుగునీరు రోడ్ల మీదికి రాకుండా మెరుగైన మురిగినీటి నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. కింద మూసికి దక్షిణ భాగంలో ఉన్న రెండు జోన్లలో 400 కోట్ల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రోన్‌ సాయంతో మూసీ నదీతీర అభివృద్ధి సంస్థ (ఎమ్మార్డీసీ)57.7 కి.మీ. పొడువైన మూసీకి ఇరువైపులా టోపోగ్రఫిక్‌ సర్వే పూర్తిచేసింది. రాష్ర్టానికి చెందిన ఉన్నతాధికారులు గుజరాత్‌లో సబర్మతి నదీతీర ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. మూసీ నది అభివృద్ధి కోసం మూసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, రూ.1665 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులు మూంజూరు చేశారు.మూసీ నదీతీర అభివృద్ధి సంస్థ (మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ – ఎమ్మార్డీసీ) చైర్మన్‌గా ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని నియమిస్తూ 08 ఫిబ్రవరి, 2020న ఉత్తర్వులు జారీచేసింది. క్యాబినెట్‌ హోదా కలిగిన ఈ పదవిలో సుధీర్‌రెడ్డి మూడేండ్లపాటు కొనసాగుతారు.

నగర శివారు ప్రాంతాలైన పాత మున్సిపాలిటీలలో క్రమబద్ధమైన డ్రైనేజి వ్యవస్థ లేదు. పాత మున్సిపాలిటీల్లో మెరుగైన డ్రైనేజి వ్యవస్థ నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్లో సీవరేజ్ ట్రీట్మెట్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. మిగతా చోట్ల 3,067 కోట్ల వ్యయంతో డ్రైనేజి వ్యవస్థ నిర్మాణానికి చర్యలు తీసుకుంది. జలమండలి 169.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యర్థ జలాల నిర్వహణ చేపడుతున్నది. 18 సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు రోజూ 750 ఎంఎల్‌డీ మురుగును శుద్ధిచేస్తున్నాయి. రోజూ 1,000 ఎంఎల్‌డీల మురుగును శుద్ధిచేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. మూసీలోకి మురుగు రానీయకుండా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధంచేసింది.దీనిలో భాగంగా నాలాల వ‌ద్ద ఎస్‌.టి.పిల‌ను నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు మురుగునీటి నిర్వహణను పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.2020-21 బడ్జెట్లో మురుగు వ్యవస్థ ఆధునీకరణకు రూ.200 కోట్లుకేటాయించింది.

 • రూ. 292కోట్ల వ్య‌యంతో నాలాల విస్త‌ర‌ణ :

అక్ర‌మనిర్మాణాలు, దురాక్ర‌మ‌ణ‌ల‌కుగురైననాలాలవిస్త‌ర‌ణద్వారావ‌ర్ష‌పునీరుసులువుగావెళ్ల‌డానికిగానుఅడ్డంకిగాఉన్నవివిధనాలాల్లోని 60 స‌మ‌స్యాత్మ‌కప్రాంతాల‌లోరూ. 290కోట్లఖర్చుతోనాలాలవిస్త‌ర‌ణచేపట్టింది.

 • హైదరాబాద్ లో నాలా గార్డెన్లు

హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా మురికికూపాలుగా మారిన కాల్వ (నాలా)లను హెచ్ఎండీఏ పునరుద్ధరించి, సంరక్షించి, పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నది. పైలట్ ప్రాజెక్టుగా బేగంపేట ఫ్లైఓవర్ కింద దాదాపు 40వేల చదరపు మీటర్ల స్థలాన్ని వృద్ధి చేస్తున్నది. ఇందులో తొలుత నాలా ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చెత్తా, చెదారం, నిర్మాణ వ్యర్ధాలు తొలగిస్తారు. తర్వాత మురుగునీటిని శుద్ధి చేసేందుకు అవసరమయ్యే మొక్కల్ని పెంచుతారు. ఈ మొక్కలోనే ఆక్సిజన్ తయారై మురుగు శుద్ధి (రూట్ జూన్ ట్రీట్ మెంట్)  అవుతుంది. నాలాకు ఇరువైపులా గార్డెన్లు పెంచుతారు.

 • హైదరాబాద్ నగరంలో పేదల విద్యుత్ బకాయిలు మాఫీ

గ్రేటర్‌ పరిధిలో వంద యూనిట్ల లోపు గృహ విద్యుత్ బకాయిలు రూ.41 కోట్ల ను మాఫీ చేస్తూ ప్రభుత్వం 2016 జనవరి 4న ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిల మాఫీతో 3,35,135 మందికి లబ్ధి చేకూరింది. 100 యూనిట్ల పైబడి సర్‌చార్జి మాఫీతో 1.16 లక్షల మంది విని యోగదారులకు లబ్ధి పొందారు.

 • జీవో నెం. 58. ద్వారా లక్షా 25 వేల మందికి పట్టాలు

ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాల్లోపు స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. జీవో నెంబర్ 58 కింద రెగ్యులరైజేషన్ ప్రకారం రాష్ట్రం మొత్తం లక్షా 25 వేల మందికి భూమి పట్టాలు పంపిణీ చేశారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్ష మందికి పట్టాలు పంపిణీ చేశారు. వీటి విలువ సుమారు రూ. 10 వేల కోట్లు ఉంటుంది.

 • హైదరాబాద్ నగరంలో పేదల నల్లా నీటి బకాయిల మాఫీ

హెచ్ఎండీఏ పరిధిలో 15 ఏళ్ల నుంచి పేరుకుపోయిన రూ.445 కోట్ల నల్లా నీటి బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో 2.98 లక్షల నిరుపేద కుటుంబాల వారి కనెక్షన్ల బకాయిలు మాఫీ అయ్యాయి. వీటిని రద్దు చేస్తూ 2016 జనవరి 2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 • ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం

పేద‌లు ఆక‌లితో ఉండొద్ద‌న్న ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆకాంక్ష మేర‌కు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అతిత‌క్కువ ధ‌ర కేవ‌లం ఐదు రూపాయ‌ల‌కే భోజ‌నాన్ని జీహెచ్ఎంసీ అందిస్తోంది. గ్రేటర్‌హైదరాబాద్‌లో 2014 మార్చి 1న 8 సెంటర్లతోప్రారంభించినరూ. 5 లకేఅన్నపూర్ణభోజనంపథకంఆరేండ్లుగావిజయవంతంగాకొనసాగుతోంది. హరేకృష్ణమూవ్మెంట్‌చారిటబుల్‌ఫౌండేషన్‌సహకారంతోనిర్వహిస్తున్నఈపథకాన్ని 150 కేంద్రాలకువిస్తరించారు. రోజుకు 40 వేలకు పైగా ప్రజలు ఈ కేంద్రాల్లో భోజనం చేస్తున్నారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఆరేండ్ల కాలంలో 4 కోట్లకు పైగా ప్రజలు 5 రూపాయల భోజనాన్ని పొందారు. నగరంలోని పెద్ద పెద్ద ఆస్పత్రులు, బస్టాండ్, రైల్వే స్టేషన్, కూలీలు వుండే వివిధ ప్రదేశాలలో  ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ ప‌థ‌కం దేశ‌వ్యాప్తంగా ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించింది. ఒక్కో భోజనం కు పేదల నుంచి జిహెచ్ఎంసి కేవలం రూ.5 మాత్రమే వసూలు చేస్తున్నది. హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ కు మాత్రం ఒక్కో భోజనానికి రూ.24.25 చెల్లిస్తున్నది. ఈ కేంద్రాలను పరిశుభ్రమైన వాతావరణంలో ఏర్పాటుచేసి, వేడి వేడి ఆహారాన్ని అందిస్తున్నారు.

మొబైల్ అన్నపూర్ణ పథకం :ఈ పథకం కొనసాగింపుగా మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించింది. వాహనాలపైభోజనంఅందించేఈ వాహనాలు (ఆటోలు) నడవలేని వృద్ధులు, వికలాంగుల కోసం వారు ఉంటున్న ప్రదేశానికే వెల్లి భోజనం అందిస్తాయి. ఈ పథకాన్ని 1మార్చి, 2020నఅమీర్పేటలోప్రారంభించారు.

హైదరాబాద్‌లోఅన్నపూర్ణక్యాంటీన్లు : హైదరాబాద్ లో నిరుపేదల కోసం రూ. 5 భోజనం పెడుతున్న డబ్బాల స్థానంలో కొన్ని సెంటర్లలో అన్ని సౌకర్యాలతో  డైనింగ్‌ టేబుళ్లపై కూర్చుని భోజనం చేసేందుకు అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  రూ. 8.70 లక్షల వ్యయంతో తొలి అధునాతన అన్నపూర్ణ క్యాంటిన్‌ను ఎల్బీనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో సిద్ధం చేస్తున్నారు. సకల సదుపాయాలు ఉండే ఈ సెంటర్‌ వద్ద నిత్యం సుమారు 300 మందికి పైగా రూ. 5 భోజనం చేస్తున్నారు.  ఈ క్యాంటీన్‌లో చేతులు కడుగుకునేందుకు వాష్‌బేసిన్లు, 35 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేందుకు డైనింగ్‌ సదుపాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంటీన్‌లో విద్యుత్‌ సౌకర్యంతో పాటుగా ఫ్యాన్ల సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. భోజనం చేసేందుకు స్టీల్‌ ప్లేట్లు, నీరు త్రాగేందుకు స్టీల్‌ గ్లాసులను కూడా అందుబాటులో పెడుతున్నారు.

 • హైదరాబాద్ లో  ఆస్తి పన్ను తగ్గింపు, మినహాయింపు

జిహెచ్ఎంసి పరిధిలో రూ.1200 లోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్ను పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని 2016 జనవరి2న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.దీని వ‌ల్ల రూ. 1200 ప‌న్ను చెల్లించేవారు కేవలం రూ.101 చెల్లించారు. ఈ నిర్ణయంతో 5లక్షల 40వేల ఇండ్లకు సంబంధించిన పన్ను మాఫీ అయింది.  ఆస్తి పన్ను మొత్తం ఏప్రిల్ మాసంలో ఒకేసారి చెల్లించిన వారికి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 5 శాతం పన్నురాయితీ క‌ల్పిస్తున్నారు.

 • ఈ-ఆఫీస్ ద్వారా జీహెచ్ఎంసీ కార్యకలాపాల నిర్వహణ
 • 2014సంవ‌త్స‌రం నుండి ‘ఈ–ఆఫీస్’ అనే వినూత్న సాంకేతిక విధానం ద్వారా కాగితం అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ ఫైళ్లను నిర్వహించే పద్ధతిని జీహెచ్ఎంసీ అమలు చేస్తున్నది. దేశంలోనే ఈ పద్ధతిని అమలు చేస్తున్నమొట్టమొదటి అతిపెద్ద సంస్థ‌గా నగరపాలక సంస్థ జీహెచ్ఎంసీనిలిచింది. డిజిటల్ ఫైళ్ల వల్ల ఫైల్ ట్రాకింగ్ సులభమవుతుంది. నిర్వహణ వేగవంతమవుతుంది. అవినీతికి ఆస్కారం ఉండదు. పారదర్శకత సాధ్యమవుతుంది. 4 ల‌క్ష‌ల‌కుపైగా రికార్డుల‌ను స్కానింగ్‌, డిజిట‌లైజ్ చేయ‌డంలోజీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం విజ‌యం సాధించింది. ఈ “ఈ-ఆఫీస్” ప్రక్రియ వల్ల ప్రధానంగా ఆఫీసుల్లో ఉండే రెడ్‌టేపిజం పోయి, పనివేగం పెరుగుతుంది. ఎక్కడ ఏ ఫైల్ ఉందీ, ఎక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతోందీ ఒకే ఒక్క క్లిక్‌తో తెలిసిపోతుంది. పారదర్శకత, జావాబుదారీతనం, సిబ్బంది పనితీరు మరింతగా మెరుగుపడతాయి.
 • గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అక్ర‌మ నిర్మాణాలకు సంబంధించి కేసుల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించ‌డానికి టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ట్రిబ్యున‌ల్‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న 200పోస్టులను టీఎస్‌పీఎస్‌సి ద్వారా భ‌ర్తీ చేయ‌డానికి ప్ర‌భుత్వం అంగీక‌రించింది.
 • డెవలప్ మెంట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డిపిఎంఎస్):

టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిని నిర్మూలించడానికి డెవలప్ మెంట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డిపిఎంఎస్)ను 2016లో జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏలో అమల్లోకి తెచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా 2016 జూన్ 2న ప్రవేశ పెట్టిన ఈ డీపీఎంఎస్ విధానం ద్వారా ఎవరైనా భవననిర్మాణం చేసుకునే వారుఅనుమ‌తుల‌కు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. నిర్ణీత సమయంలోనే నిబంధనల ప్రకారం వ్యక్తుల ప్రమేయం లేకుండా వారికి అనుమతులు జారీ చేస్తున్నారు. దేశంలో మరే మహానగరంలోనూ ఇలాంటి అధునాతన సాంకేతిక ప్రక్రియ అమల్లో లేదు.

పుణే మున్సిపాలిటీ అనంత‌రం జీహెచ్ఎంసీ వంద శాతం ఆన్‌లైన్ విధానం ద్వారా భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌ను జారీచేసే కార్పొరేష‌న్‌గా పేరొందింది. గ‌తంలో ఒక భ‌వ‌న నిర్మాణ అనుమ‌తికి 50 నుండి 55 రోజుల క‌నీస స‌మ‌యం ప‌ట్ట‌గా డీపీఎంఎస్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం కేవ‌లం 22 నుండి 27 రోజుల్లోనే అనుమ‌తి మంజూరు చేయ‌డం జ‌రుగుతుంది. అదేవిధంగా ఆక్యుఫెన్సీ స‌ర్టిఫికెట్‌ను కేవ‌లం 10 నుండి 12 రోజుల్లోనే జారీచేయ‌డం జ‌రుగుతుంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్ర‌స్థానం

రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా జీహెచ్ఎంసీ సాంకేతికత‌ను ఉప‌యోగించ‌డం ద్వారా ఇత‌ర శాఖ‌ల క‌న్నా ముందంజ‌లో ఉంది. ఈ-ఆఫీస్ నిర్వ‌హ‌ణ‌, టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఆన్‌లైన్ ప‌ద్ధతిలో భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు, ఆక్యుఫెన్సీ స‌ర్టిఫికెట్ల మంజూరు, మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా స‌మ‌స్య‌ల స‌త్వ‌ర ప‌రిష్కారం, స్వ‌చ్ఛ‌దూత్‌, మ‌స్కిటోయాప్ ద్వారా స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తేవ‌డం ద్వారా జీహెచ్ఎంసీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందంజ‌లో ఉంది. ఈజ్ఆఫ్డూయింగ్బిజినెస్‌లోతెలంగాణనంబర్‌వన్స్థానంలోకొనసాగుతున్నది.

 • మై జీహెచ్ఎంసీ యాప్

నగర సమస్యలను సత్వరం పరిష్కరించడానికి మై జీహెచ్ఎంసీ యాప్ ను 2016 జులై 15న ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా నగరపౌరులు జీహెచ్ఎంసీ అందించే సేవలను తెలుసుకోవడంతోపాటు ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపులు చేయవచ్చు. ఈ యాప్ ద్వారా జనన, మరణ దృవ పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రజలెదుర్కుంటున్న సమస్యలను ఈ యాప్ ద్వారా జీహెచ్ఎంసీకి పోస్టు చేయవచ్చు. ఈ యాప్ కు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వ్యక్తమవుతున్నది. 

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు ప్రాజెక్టును ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ప్రధాన మార్గాలు, వాటి అనుబంధ మార్గాలన్నీ ఎల్‌ఈడీ లైట్లతో వెలిగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టును రూ.271.40 కోట్లతో చేపట్టారు. నగరంలోని 4.53 లక్షల సంప్రదాయ లైట్లస్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చే ప్రక్రియను జీహెచ్‌ఎంసీ అధికారులు 2017 జూలైలో చేపట్టారు. ల‌క్ష్యానికి అనుగుణంగా ప్రధాన మార్గాలన్నింటిలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. కేంద్ర విద్యుత్‌శాఖ అనుబంధ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

విద్యుత్ ఆదాకు చర్యలు

గతంలో వీధిలైట్ల నిర్వహణకు ఏటా రూ.252.89 కోట్లు ఖర్చవుతుండగా ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతో ఈ ఖర్చు విద్యుత్ చార్జీల రూపంలో రూ. 112.71 కోట్లుఆదా అవుతున్నది. ఏటా 55 శాతం విద్యుత్ వినియోగం తగ్గింది. ఏటా 72 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉండేది. ఇప్పడది 32 మెగావాట్లకు తగ్గబోతోంది. ప్రతినెలా రూ.15కోట్ల వరకు కరెంటు బిల్లు వస్తే ఎప్రిల్ 2019లో కేవలం రూ.7కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీపై ఎటువంటి భారం లేకుండా మిగులు విద్యుత్ ద్వారా అయ్యే ఆదాతోనే ఈఈఎస్‌ఎల్‌కు వాయిదాల రూపంలో సొమ్ము చెల్లిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా 18, 35, 70, 110, 190 వాట్స్ సామర్థ్యంగల లైట్లు అమర్చారు. ఎల్‌ఈడీతో ఏటా 1,27,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల తగ్గుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఎల్‌ఈడీ ప్రాజెక్టును చేపట్టిన మొదటి కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ చరిత్ర సృష్టించింది.  దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యధికంగా రెండు లక్షల ఎల్‌ఈడీ లైట్లను అమర్చగా, విశాఖపట్నంలో లక్ష ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఈ రెండు కార్పొరేషన్లలో ఎల్‌ఈడీ ఏర్పాటుకు ఏడాది పట్టగా, హైదరాబాద్‌లో మాత్రం ఆరు నెలల్లో పూర్తిచేశారు.

పర్యవేక్షణ వ్యవస్థ : ఈ ఎల్‌ఈడీ లైట్ల ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించేందుకు సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టం (సీసీఎంఎస్)ను జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టింది. దీనివల్ల లైట్లు సక్రమంగా వెలుగుతున్నాయా, లేదా అనేది మానిటరింగ్ కేంద్రం నుంచే తెలుసుకొనే వీలుంటుంది. 4.53 లక్షల లైట్లను 24,683 సీసీఎంఎస్ యూనిట్లకు (95 శాతం పూర్తి) అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల లైట్లు సకాలంలో వెలుగడం, ఆరిపోవడంవల్ల సుమారు 50 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ఈ ప్రాజెక్టులో 26 వేల స్విచ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. ఆటోటైమర్ల ఆప్షన్‌తో కూడిన ఈ కంట్రోల్ స్విచ్‌లు ఫొటో సెన్స్ ఆధారంగా చీకటిపడగానే ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. ఎవరైనా అక్రమంగా లైట్లను వేయాలనుకున్నా, ఆర్పాలనుకున్నా మానిటరింగ్ కేంద్రానికి, సంబంధిత ఇంజినీర్‌కు వెంటనే మొబైల్ అలర్ట్ ద్వారా సమాచారం అందుతుంది. కంట్రోల్ స్విచ్ బోర్డు తలుపు తెరిచినా తెలిసిపోతుంది. లైట్లు వెలుగుతున్నాయా, లేదా అనేది కమాండ్ కంట్రోల్ ద్వారా నేరుగా చూసి సమీక్షించే అవకాశాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులతోపాటు అక్కడి స్థానికులు కూడా వెబ్‌సైట్ ద్వారా చూసేందుకు ప్రత్యేక లింక్‌ను అందించనున్నారు. ఈ లైట్ల వినియోగంలో అక్రమాలు జరుగకుండా ఆస్ట్రోనాటికల్ క్లాక్ విధానాన్ని కూడా సీసీఎంఎస్‌కు సమకూర్చుతున్నారు. పార్కులు, శ్మశానవాటికాల్లో రాత్రి పొద్దుపోయాక లైట్లు ఆరిపోయేలా ప్రత్యేక సమయాన్ని నిర్ధారిస్తున్నారు. గతంలో 750 మంది సిబ్బంది ఉదయం, సాయంత్రం స్విచ్‌లు వేసే పనిలో ఉండేవారు. కొత్త వ్యవస్థ అమలుతో గతంలో ఉన్న సిబ్బందిలో 180మంది మినహా మిగిలినవారిని వేరే విభాగాల్లోకి తరలించారు. 

 • మోడ‌ల్ మార్కెట్ల నిర్మాణం

కోటికిపైగా జ‌నాభా క‌లిగిన హైద‌రాబాద్ న‌గ‌రంలో త‌గు సంఖ్య‌లో వ్య‌వ‌సాయ మార్కెట్ల‌ను ఏర్పాటు చేయ‌డానికి జీహెచ్ఎంపీ భారీ ప్ర‌ణాళిక రూపొందించింది. దీనిలోభాగంగా రూ. 21.37 కోట్ల వ్య‌యంతో 42 ప్రాంతాల్లో మోడ‌ల్ మార్కెట్ల‌ను నిర్మిస్తోంది. వీటిలో 31 మాడల్ మార్కెట్లను రూ.15.83 కోట్లతో పూర్తి చేశారు. మిగిలిన 11 మార్కెట్లు పురోగ‌తిలో ఉన్నాయి.

 • ఫిష్ మార్కెట్ల నిర్మాణం

నాలుగు ప్రాంతాల్లో రూ.13 కోట్ల వ్య‌యంతో ఫిష్‌మార్కెట్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. కూక‌ట్‌ప‌ల్లి, బేగంబ‌జార్‌, నాచారం, చిలుక‌ల‌గూడ‌లో ఈ ఫిష్‌మార్కెట్ల‌ను చేప‌ట్ట‌గా నాచారం, కూక‌ట్‌ప‌ల్లి, బేగంబ‌జార్‌, చిలుక‌ల‌గూడ‌లలో షిప్ మార్కెట్లు పురోగ‌తిలో ఉన్నాయి.

 • మ‌ల్టీప‌ర్ప‌స్ ఫంక్ష‌న్‌హాళ్ల‌ నిర్మాణం

న‌గ‌రంలోని నిరుపేద‌ల సౌక‌ర్యార్థం 16 మ‌ల్టీప‌ర్ప‌స్ ఫంక్ష‌న్‌ హాళ్ల‌ను రూ. 32.59 కోట్లతో నిర్మిస్తున్నది. మొత్తం 24,700 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో రెండు అంత‌స్తుల్లో నిర్మించే ఈ మ‌ల్టీప‌ర్ప‌స్ ఫంక్ష‌న్‌హాళ్ల వ‌ల్ల స‌మావేశాలు, శుభ కార్యాలు, ఇత‌ర స‌మావేశాలు నిర్వ‌హించుకునే వీలుంది. జూన్ 2018 నాటికి రూ.9.16 కోట్లతో 5 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయినవి. మిగిలిన 10 ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి.

 • ఇంటరాక్షన్ పార్కులు (21.2.2020)

సమాజ పురోభివృద్ధ్దికి చర్చలు ఒక వేదికగా నిలుస్థాయి. ఇందుకోసం హైదరాబాద్ నగరంలో పుణె తరహా ఇంటరాక్షన్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ, బయో డైవర్సిటీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగర పార్కులకు భిన్నంగా ఈ పార్కుల్లో లాన్‌లకు కేవలం 20 శాతం మాత్రమే చోటుదక్కనుంది. ఇంటరాక్షన్‌ పార్కులుగా ప్రసిద్ధ్ది పొందిన ఈ పార్కుల్లో 20 శాతం చిల్డ్రన్స్‌ప్లే గ్రౌండ్‌, 20 శాతం ఓపెన్‌ స్పేస్‌ జిమ్‌లు ఏర్పాటుకానుండగా 40 శాతం స్థలంలో ఇంటరాక్షన్‌ లాన్లు సిద్ధ్దం కానున్నాయి. పార్కు చుట్టూ వాకర్స్‌కు పాత్‌వేలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఏపుగా పెరిగిన చెట్లకింద విరివిగా కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రకృతి ప్రేమికులతో పాటు ప్రకృతిని ఆస్వాదించే వారు ఈ పార్కుల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. ప్రధానంగా కాలనీవాసులు ప్రకృతిని ఆస్వాదిస్తూ, విస్తృతమైన చర్చా వేదికలు నిర్వహించుకునేందుకు ఇంటరాక్షన్‌ పార్కులు ఉపయోగపడతాయి. ఇంటరాక్షన్‌  పార్కులు కవులకు, రచయితలకు, సాహితీవేత్తలకు మరింత ఉపకరించనున్నాయి.

 • నగరంలో క్రీడారంగ అభివృద్ధికి చర్యలు

నగరంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల నిర్మాణం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 51 క్రీడాంశాల్లో 1,386 సమ్మర్ కోచింగ్ కేంద్రాల్లో 1,482 కోచ్‌లద్వారా 1,16,626 మందికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇప్పించారు.  75 క్రీడామైదానాల్లో విద్యార్థినీ విద్యార్థుల‌కు క్రీడాప‌రిక‌రాల‌ను అందించారు. 112 క్రీడామైదానాలను అభివృద్ధి చేశారు. 93 కేంద్రాల్లో మోడ‌ల్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. గ్రేట‌ర్  హైద‌రాబాద్ పరిధిలోని 521 ప్లేగ్రౌండ్‌ల‌ను పూర్తి స్థాయిలో ఉప‌యోగించుకోవ‌డానికి పాఠ‌శాల‌ల‌కు అనుసంధానం చేశారు. గౌలిపుర స్టేడియం, ఉప్ప‌ల్ ఇండోర్ స్టేడియంలను ప్రారంభించారు.

 • పేద ఒలంపియ‌న్ల‌కు ఆర్థిక స‌హాయం

గ‌తంలో ఒలంపిక్‌, ఆసియా క్రీడ‌లు, ఇత‌ర అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో పాల్గొని రాష్ట్రానికి పేరుతెచ్చిన 60సంవ‌త్స‌రాల‌కు పై బ‌డ్డ హైద‌రాబాద్‌లోని క్రీడాకారుల‌ను ఆర్థిక స‌హాయం జీహెచ్ఎంసీ అంద‌జేస్తోంది. నిరుపేద స్థితిలో ఉన్న 8 మంది మాజీ జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయి క్రీడాకారుల‌ను గుర్తించి, వీరిలో 6మందికి ఒకొక్క‌రికి నెల‌కు 10వేల‌ రూపాయ‌ల చొప్పున‌, మ‌రో ఇద్ద‌రికి నెల‌కు 7,500 రూపాయ‌ల చొప్పున సంవ‌త్స‌రం పాటు అందించ‌డం జ‌రిగింది.

 • జిమ్నాసియాల‌ ఏర్పాటు

న‌గ‌ర యువ‌త‌లో క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి క‌ల్పించ‌డం, శారీర‌క దృఢ‌త్వం పెంపొందించ‌డానికి జిమ్నాసియాలను ఏర్పాటు చేసింది. ఎక్క‌డైతే 1000చ‌.అ.విస్తీర్ణం క‌లిగిన భ‌వ‌నం అందుబాటులో ఉంటే అక్క‌డ ఈ జిమ్నాసియాల‌కు ఏర్పాటు చేశారు. రూ. 45.13కోట్ల  వ్య‌యంతో14 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, స్టేడియాల‌ను నిర్మించారు.

 • హైదరాబాద్ లో డ్రైవర్లకు సొంత కార్లు

‘‘డ్రైవర్ కమ్ ఓనర్’’ పథకాన్ని 2014 డిసెంబర్ 26న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 5000 మంది డ్రైవర్లను వాహన యజమానులుగా మార్చనున్నది. ఇందులో ఎస్సి, ఎస్టీలకు 90 శాతం, ఇతరులకు 75 శాతం చొప్పున బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నది. ఈ పథకం కింద 408 వాహనాలను పంపిణీ చేయడం జరిగింది.

 • గ్రేటర్ హైదరాబాద్ పారిశధ్య కార్మికులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే ముఖ్యమంత్రి కేసీఆర్. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం 16 జులై 2015న నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి మున్సిపల్ కార్మికుల వేతనం రూ.8,500గా ఉండేది. వారి వేతనాన్ని ప్రభుత్వం రూ.12,500 కు పెంచింది. ఆ తర్వాత 2017మే 23న  మరోసారి వారి జీతాలను పెంచతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో సుమారు 24 వేల మందికి జీతాలు పెరిగాయి.
 • తాగు నీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల (అర్బన్ మిషన్ భగీరథ)

హైదరాబాద్‌ నగరం రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో దానికి అనుగుణంగా ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను తీర్చేలా జలమండలి మంచినీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నది. తాగు నీటి సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చేపట్టింది. ఇందులో భాగంగా జలమండలి అమలుచేస్తున్న ప్రాజెక్టులతో బాటు మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. గతంలో 688 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న మంచినీటి సరఫరాను తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దాదాపు 1,456 చదరపు కిలోమీటర్లకు పెంచింది. సుమారు రూ.1,900 కోట్ల అంచనా వ్యయంతో 40 లక్షల మందికి తాగునీటిని అందించడానికి కొత్తగా 56 సర్వీస్ రిజర్వాయర్లను నిర్మిస్తున్నది. వీటిద్వారా సుమారు 27.9 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. వీటిలో కొన్ని ప్రారంభం కాగా, మరికొన్ని చివరిదశలో ఉన్నాయి. శివార్లలోని 12 మున్సిపాలిటీల పరిధిలోని 190 ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకుశాశ్వ‌త‌ ప్రణాళికలు రూపొందించింది. ఏడు మున్సిపాలిటీల పరిధిలోని 190 గ్రామాల్లో 401 ఓవర్ హెడ్‌సర్వీస్ రిజర్వాయర్లు, 11 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసం దాదాపు రెండు వేల కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్లు వేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లోతాగునీటిసరఫరా, మురుగునీటిశుద్ధికోసంప్రభుత్వంరూ.14,175.30 కోట్లుఖర్చుచేసింది.

హైదరాబాద్ రూ.4765 కోట్లతో భారీ జలమాల

హైదరాబాద్ చుట్టూ  మహానగరానికి భవిష్యత్తులో మంచినీటి సమస్య రాకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. దాదాపు కోటి జనాభా ఉన్న నగరానికి తాగునీటి కొరత రాకుండా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో బృహత్తర సంకల్పానికి సిద్ధమవుతున్నది. రూ.4,725 కోట్లతో 1628 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు నీటికొరత రాకుండా నివారించేందుకు ఔటర్ రింగురోడ్డు చుట్టూ జలమాలను నిర్మించనున్నది. భవిష్యత్తులో తలెత్తే నీటి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని మొత్తంగా 1628 చదరపు కిలోమీటర్ల పరిధిలో (ఇందులో కోర్‌సిటీ 169.30 చ.కి.మీ. కాగా, శివారు ప్రాంతాలు 518.90 చ.కి.మీ., ఓఆర్‌ఆర్ గ్రామాల పరిధి 939.80 చ.కి.మీ.) ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఔటర్ రింగురోడ్డు చుట్టూ నిర్మించే రింగ్ మెయిన్ ప్రాజెక్టు ద్వారా ఎటువైపు నుంచైనా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో నగరంలో ఏ మూలన నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలు ఏర్పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జలమండలి ప్రస్తుతం రోజూ 448 మిలియన్ గ్యాలన్ల నీటిని అందిస్తున్నది.
        ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరి నది వనరుల నుంచి నగరానికి రక్షిత జలాలను తరలిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటి తరలింపు ప్రక్రియ బ్రేక్ డౌన్ అయితే.. పరిస్థితి అంతా గందరగోళమే. అలాంటి ప్రత్యేక పరిస్థితిని ఎదురుకాకముందే నివారించేందుకు ప్రభుత్వం బృహత్తర పథకాన్ని తలపెట్టింది. రాజధాని మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు వెంబడి 3,000 ఎంఎం డయా పైపులైన్ నిర్మాణ పనులను చేపట్టేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధంచేసింది. టాటా కన్సల్టెన్సీ ద్వారా డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపొందించారు. 158 కిలోమీటర్ల మొత్తంలో భారీ పైపులైన్ 12చోట్ల రిజర్వాయర్ల నిర్మాణపనులకు రూ.4765 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ డీపీఆర్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది.169.30 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న సంస్థ సేవల పరిధిని 1628చదరపు కిలోమీటర్ల మేరకు పెంచిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే గ్రేటర్‌లో విలీనమైన 12మున్సిపాలిటీల్లో రూ.1900 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను పూర్తిచేసి ప్రజల దాహార్తిని తీర్చారు.


ఈ క్రమంలోనే ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న191 గ్రామాలకు అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద రూ.756 కోట్లతో ప్రాజెక్టును చేపట్టి సమృద్ధిగా నీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరి ప్రాజెక్టులోని కీలకమైన ఘన్‌పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పటాన్‌చెరు రిజర్వాయర్ వరకు 1800 ఎంఎం డయాతో 44కిలోమీటర్ల మేర పైపులైన్ పనుల్లో రైల్వే క్రాసింగ్ మినహా 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇదే క్రమంలో నగర చరిత్రలో ఔటర్ రింగ్ మెయిన్ ప్రాజెక్టు అమలుకు రంగం సిద్ధంకావడం గమనార్హం. దీంతో నగరంలో ఏ మూలన నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలు ఏర్పడుతుంది. ఉదాహరణకు కృష్ణా నీటిని మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాలకు మళ్లించాలంటే పాతనగరం నుంచి జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ వరకు చేరుకుంటున్న జలాలను సంజీవరెడ్డినగర్ (డివిజన్ 6 మీదుగా పటాన్‌చెరు వైపు తరలించుకునే వీలు ఉంటుంది. కృష్ణా, గోదావరి జలాల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి నగరం అంతర్గత వ్యవస్థలకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించుకునే అవకాశం ఉంది. ఏ రిజర్వాయర్లలో వర్షాభావ పరిస్థితులు వచ్చినా, నీటి తరలింపులో బ్రేక్‌డౌన్ (అంతరాయం) ఏర్పడినా నీటి కొరత ఉండదని అధికారులు చెప్తున్నారు. కేశవాపురం, దేవులమ్మ నాగారంలో నిర్మించతలపెట్టిన భారీ రిజర్వాయర్లను ఔటర్ రింగు మెయిన్ ప్రాజెక్టుకు అనుసంధానం చేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలో ఏ నగరానికీ లేని ప్రత్యేక నీటి వ్యవస్థ సాకారం కానుంది.

పైపులైన్ విస్తరణ పనుల్లో కీలక అంశాలు : 3000 ఎంఎం డయా భారీ పైపులైన్ విస్తరణ పనుల్లో చాలా అవాంతరాలను అధిగమించాల్సి ఉంటుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల అనుమతుల ద్వారా పనులను చేపట్టాల్సి ఉంటుంది. జంక్షన్ల వద్ద పనులు, రేడియల్ మెయిన్స్, రైల్వే క్రాసింగ్స్, నేషనల్ హైవే, స్టేట్ హైవే క్రాసింగ్ వద్ద పనులకు అనుమతులు, రోటరీ క్రాసింగ్, టన్నెలింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 158 కిలోమీటర్ల ఔటర్‌లో ముత్తంగి,కండ్లకోయ, శామీర్‌పేట, అన్నోజిగూడ, పెద్ద అంబర్‌పేట, బొంగులూరు,ఆదిబట్ల, తుక్కుగూడ, ఎయిర్‌పోర్టు, కిస్మత్‌పుర, కోకాపేట జంక్షన్ మీదుగా పైపులైన్ అలైన్‌మెంట్ చేశారు.

 • హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చడానికి రెండు రిజర్వాయర్లు

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర నీటి అవసరాలను శాశ్వతంగా తీర్చడం కోసం రెండు డెడికేటెడ్ రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించింది. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే కృష్ణా నీళ్ల కోసం చౌటుప్పల్ మండలం దేవులమ్మనాగారం వద్ద 10 టిఎంసిల రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే గోదావరి నీళ్ల కోసం శామీర్ పేట్ మండలం కేశవాపూర్ లో 10 టిఎంసిలసామ‌ర్థ్యం క‌ల‌ రిజర్వాయర్ నిర్మించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణం కోసం రూ.4,777 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ లు తయారు చేయాల్సిందిగా వ్యాప్కోస్ ను కోరింది.

 • స్మార్ట్ హైదరాబాద్ నగరానికి శ్రీకారం – సిస్కో తో ఒప్పందం

గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల కష్టాలు తీర్చడానికి  రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మరియు పురపాలక శాఖ విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానుంది. గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచ విఖ్యాత నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ ను స్మార్ట్‌ సిటీగా తీర్చి దిద్దే ప్రణాళికలపై విశ్వ విఖ్యాత చెందిన ‘సిస్కో’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకున్నది. 2016 జులై 21న దీనికి సంబంధించిన ఒప్పంద పత్రంపై జిహెచ్‌ఎంసీ కమిషనర్, సిస్కో ఇండియా ఎండీ సంతకాలు చేశారు. దీనివలన  స్మార్ట్‌ సిటీ సొల్యూషన్స్ ద్వారా ప్రజలకు ఆధునిక సదుపాయాలను అందించేందుకు మార్గం సుగమం కానున్నది. ఈ ఒప్పందం వలన నగరంలోని హైటెక్‌ సిటీ ప్రాంతంలో సిస్కో. పారడైమ్ ఎంటుయిటీతో కలిసిరూపొందిస్తున్న‌ పైలట్ ప్రాజెక్టు ముందుకు రాబోతున్నది. ఇందులో భాగంగా స్మార్ట్‌ సిటీ సొల్యూషన్స్ ద్వారా పలు సదుపాయాలను  ముఖ్యంగా స్మార్ట్ వైఫై, స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ ట్రాన్స్పోర్ట్, స్మార్ట్ కియోస్క్‌ లు, సిటిజెన్ సేవల పోర్టల్, సిటిజన్ యాప్ వంటి  అంశాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నది. 

 • ఏసీ మెట్రోలగ్జరీ బస్సులు

హైదరాబాద్ నగరప్రజల సుఖప్రయాణం కోసం తొలి విడతలో నగరంలో 80 ఏసీ బస్సులను నాలుగు రూట్లలో నడుపుతున్నారు.నవంబర్ 29న నగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర ఏసీ మెట్రో లగ్జరీ బస్సులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

 • భారత్ లో నెంబర్ 1 నగరంగా హైదరాబాద్

మెర్సర్ అనే అంతర్జాతీయ సంస్థ తన తాజా నివేదికలో హైదరాబాద్ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 230 నగరాలను సర్వే చేసి వాటిలో నాణ్యమయిన జీవనానికి అత్యంత అనువుగా ఉన్న నగరాల జాబితాను తయారు చేసింది. వాటిలో హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్ 1 స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో 138వ స్థానాన్ని దక్కించుకొంది. అంతర్జాతీయ స్థాయిలో పూణే-144, బెంగళూరు-145, చెన్నై-150, ముంబై-152, కోల్ కతా-160, డిల్లీ-161వ స్థానాలు దక్కించుకొతెలంగాణ రాష్ట్రం దేశంలోనే అరుదైన ఘనతను సాధించింది.

 • వరంగల్, బెంగుళూరు, విజయవాడ మార్గాలకు ఎలివేటెడ్ కారిడార్లు

వరంగల్, బెంగుళూరు, విజయడాడ మార్గాలకు ట్రాఫిక్ రద్ధీ ఎక్కువైనందు వల్ల ఈ మూడు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా కేంద్రం మంజూరు చేసింది. హైదరాబాద్, వరంగల్ మార్గంలో ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు6.40 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.626.76 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా ఈ కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు, ఇతర అవసరాలకు రూ.768.26 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ కు 15 కి.మీ. కంటే ఎక్కువ దూరం వుంది కానీ ప్రస్తుతం చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన 6.40 కి.మీ. మిగతా 6 లేన్ల పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది.  అలాగే హైదరాబాద్, మహబూబ్ నగర్-బెంగళూరు మార్గంలో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 10 కి.మీ. మేర కారిడార్ నిర్మాణానికి రూ.283.15 కోట్లు మంజూరయ్యాయి.

 హైదరాబాద్-సూర్యాపేట్-విజయవాడ మార్గంలో దాదాపు 26 కి.మీ.ల మేర యుటిలిటీ కారిడార్ (సర్వీస్ రోడ్లు సహా) నిర్మాణానికి రూ.170 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కేసీఆర్ కోరారు.

 • హైదరాబాద్ లో మోడల్ రోడ్ కారిడార్

హైదరాబాద్ రహదారులను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్ ప్రణాళికలు రచించింది.విశాలమైన రోడ్లు, ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు, సైకిల్ వేలు. ఎక్కడా వైర్లు, కేబుళ్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టనుంది. అన్నీ భూమి లోపలే ఉంటాయి. వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచేందుకు రోడ్డు పక్కనే పార్కులు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌డీసీ)ని ఇంతకు మునుపే ఏర్పాటు చేసింది. పురపాలకశాఖ మంత్రి కే. తారకరామారావు ఆదేశాలతో హెచ్‌ఆర్‌డీసీ ముందడుగు వేసింది. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లోని రహదారులకు సరితూగేలా రాజధానిలోని ప్రధాన రహదారులను ఆకర్షణీయంగా మార్చేందుకు హెచ్చార్డీసీ కార్యాచరణ రూపొందించింది. రూ. 1,930 కోట్లతో 100 కి.మీ. రహదారుల విస్తరణను చేప‌ట్టింది.

పక్కాగా ప్రణాళిక : ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ ఫర్నీచర్, చెట్లను పరిశీలించింది. రోడ్లపై ప్రయాణించే పాదచారులు, సైకిళ్లు, ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు, ట్రక్కుల వివరాలను సేకరించింది.వీధి వ్యాపారులు, దుకాణాల సంఖ్య, పార్కింగ్ పరిస్థితి, రహదారుల పక్కన తాత్కాలిక నివాసాలు తదితర అంశాలన్నీ ఆరాతీసింది. ప్రధానమార్గాల్లోని భూగర్భంలో ఉన్న విద్యుత్, మంచినీరు, సీవరేజి, టెలిఫోన్ లైన్ల సంఖ్య, రోడ్డుపైభాగంలో విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు, కనెక్షన్ల సంఖ్యను తెలుసుకున్నది. వీటన్నింటినీ క్రోడీకరించి పక్కా ప్రణాళికలను రూపొందించింది. అంతర్జాతీయస్థాయిలో హైదరాబాద్‌లోని ప్రధాన రహదారుల కారిడార్‌ను అభివృద్ధి చేయడానికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసింది.

ఐదు ప్యాకేజీల్లో పనులు :48 రోడ్ల కు సంబంధించి రాజధానిలో ఐదు ప్యాకేజీల్లో 273 కిలోమీటర్ల మేర, రెండు జాతీయ రహదారుల పరిధిలో 52 కి.మీ. కలిపి మొత్తం 325 కి.మీ.మేర రహదారులకు రాజసం ఉట్టిపడేలా సొబగులను అద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ప్యాకేజీలో 61.8 కిలోమీటర్లు, రెండో ప్యాకేజీలో 53 కిలోమీటర్లు, మూడో ప్యాకేజీలో 52.2 కిలోమీటర్లు, నాలుగులో 56.15 కిలోమీటర్లు, ఐదో ప్యాకేజీలో 59.7 కిలోమీటర్ల మేర రహదారులకు సొబగులను అద్దుతారు. అదనంగా మరో పదహారు కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. తొలివిడతలో భాగంగా దాదాపు 95.07 కిలోమీటర్ల అభివృద్ధికి హెచ్‌ఆర్డీసీ ప్రణాళికలు రచించింది. మియాపూర్ నుంచి అసెంబ్లీ వరకు 19 కిలోమీటర్ల అభివృద్ధిలో భాగంగా 20 ప్రధానమైన జంక్షన్లు వస్తాయి. ఈ కారిడార్ అభివృద్ధి చేయడానికి ముందుట్రాఫిక్‌ను పూర్తిస్థాయిలో అధికారులు అధ్యయనం చేశారు. అసెంబ్లీ నుంచి ఎల్.బి.నగర్, అఫ్జల్ గంజ్ నుంచి ఆరాంఘర్ వరకు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఎల్.బి.నగర్ వరకు రోడ్ల నిర్మాణాలకు అనుమతులు లభించాయి. కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం వద్దనున్న రోడ్డుపై నిత్యం 2.44 లక్షల వాహనాలు రాకపోకలను గుర్తించారు. వీటిలో 62 శాతం ద్విచక్రవాహనాలు, కార్లు 23 శాతం, ఆటోల వాటా ఏడు శాతంగా ఉన్నది. సనత్‌నగర్ ఆర్వోబీపై 1.55 లక్షల వాహనాలు రాకపోకలుసాగిస్తుండగా, ద్విచక్రవాహనాలే ఎక్కువగా ఉన్నాయి. జేఎన్‌టీయూ వద్ద 2.32 లక్షల వాహనాల రాకపోకలు ఉండగా, 59 శాతం ద్విచక్ర వాహనాలు, 24 శాతం కార్లు తర్వాతి స్థానంలో ఉన్నాయి.

మోడల్ కారిడార్‌లో తో రహదారులపై కలిగే సౌకర్యాలు :

 • ప్రధాన రహదారులన్నీ కనీసం మూడు మీటర్ల వెడల్పుతో అంతర్జాతీయ డిజైన్ ప్రకారం ఉంటాయి.
 • ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్లు, సులువుగా నడిచేలా ఫుట్‌పాత్‌లు, సైకిల్, బస్సులు, ఆటోలకు ప్రత్యేకంగా ట్రాక్స్.
 • పాదచారులు రోడ్డుదాటే ఏర్పాట్లు, సెంట్రల్ మీడియన్లు, సీసీక్రాష్ బారియర్లు, వీధి దీపాలు, సైనేజీలు, సీసీటీవీ, స్పీడ్ మానిటరింగ్.
 • బస్ షెల్టర్లు, బస్ బేలు, పార్కింగ్, గ్రీన్ టాయిలెట్లు, ప్రథమ చికిత్స కేంద్రాలు, పోలీసు హెల్ప్‌లైన్లు.
 • రోడ్లపై విద్యుత్ స్తంభాలు, పైప్‌లైన్లు, కేబుళ్లు ఉండవు.. అన్నీ భూగర్భంలోనే డక్ట్ల మాదిరిగా ఏర్పాట్లు.
 • యుటిలిటీ డక్ట్ బ్యాంక్, వరద నీటి కాల్వలు, సులభ్ కాంప్లెక్సులు, విద్యుత్, కేబుల్, మంచినీరు, సీవరేజి పైప్‌లైన్లు.
 • రహదారులపై మొక్కల పెంపుదల, ల్యాండ్‌స్కేపింగ్, స్ట్రీట్ ఫర్నీచర్, గార్బేజ్‌ కంటెయినర్లు, వ్యాపార ప్రకటనలకు హోర్డింగ్స్.
 • రహదారులకు ఒకవైపు 1800/1800 మిల్లీమీటర్ల వెడల్పులో మొక్కల పెంపకం… రోడ్ల పక్కన సేద తీరేందుకు షెల్ట‌ర్ల ఏర్పాటు.
 • రహదారుల పక్కన గోడలపై తెలంగాణ పండుగలు, ఉద్యమం, చరిత్ర, చారిత్రాత్మక ప్రాంతాల థీమ్‌తో పెయింటింగ్స్
 • పార్కింగ్ పాలసీ  

నగరంలో దాదాపు 50 లక్షల వివిద రకాల వాహనాలను నడుపుతున్నారు.లక్షల సంఖ్యలోనే ప్రజలు వివిధ పనుల నిమిత్తం ప్రయాణిస్తున్నారు.రోడ్లు-ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, పెరిగిపోతున్న వాహనాలతో ట్రాఫిక సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. అంతేకాకుండా మాల్స్‌, సినిమా థియేటర్స్‌, బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు.. తదితర రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్‌ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది.పార్కింగ్ చార్జీలను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో ప్రభుత్వం సవివరమైన పార్కింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే నూతన పార్కింగ్‌ పాలసీని ప్రభుత్వం రూపొందించి.. అమలుచేస్తున్నది. ఈ పాలసీకి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మాల్స్, మల్టీప్లెక్స్, వాణిజ్య సంస్థల్లో మొదటి 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుంది.అనంతరం షాపింగ్ చేసిన బిల్లులు చూపితే మరో 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఏ విధమైన బిల్లులు లేకుండా పార్కింగ్ చేసేవారికి నిర్దేశిత పార్కింగ్ చార్జీలు విధిస్తున్నారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికిగాను ఖాళీగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిలో తాత్కాలికంగా పార్కింగ్‌ను కల్పించే విధానాన్ని రూపొందించారు.దీనితో పాటు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో మ‌ల్టీలేవ‌ల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

 • పాదచారులకు స్కైవాక్స్

నగరంలో అత్యంత రద్దీ చౌరస్తాల్లో ప్రజలు రోడ్డు దాటాలంటె చాలా ఇబ్భంది పడుతున్నారు. వీరు రోడ్డు దాటే క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ సమస్య నివారణకు ప్రభుత్వం నగరంలోని ప్రధాన కూడళ్లలో స్కైవాక్స్ (ఆకాశ నడక మార్గాలు) నిర్మించాలని నిర్ణయించింది. వీటి నిర్మాణం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. 23 కూడళ్లలో స్కైవాక్స్ తప్పనిసరని ప్రభుత్వం గుర్తించింది. తొలి విడుతలో నాలుగు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మెహిదీపట్నం, మదీనా జంక్షన్, దిల్‌సుఖ్‌నగర్ జంక్షన్‌లో బస్టాండ్, రైల్వే, మెట్రోరైల్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్కైవాక్‌లను అందుబాటులోకి తేనున్నారు.

 • వైఫై న‌గ‌రంగా హైద‌రాబాద్

ప్ర‌పంచ వైఫై దినోత్స‌వం సంద‌ర్భంగా న‌గరంలో హై..ఫై ను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలు, జనసమ్మర్థ ప్రదేశాల్లో (మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో, కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో) హై-ఫై పేరుతో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తోంది. మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ‌. మొదట 2015లో 100 చోట్ల ఉచిత సౌకర్యాన్ని కల్పించింది. 2016 నాటికి 250 ప్రదేశాలలో ఈ సౌకర్యాన్ని కల్పించారు. జూన్ 2018 నాటికి వైఫై సౌకర్యం దాదాపుగా 1000 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నగరంలోని 300 పాఠశాలలకు ఈ సౌకర్యం కల్పించారు. ఎయిర్ టెల్, ఏసీటీ పైబర్ నెట్, ఇండస్ టవర్ల సహకారంతో ఈ ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

 • అర్బ‌న్ కమ్యునిటీడెవ‌ల‌ప్‌మెంట్ విభాగం

హైదరాబాద్ న‌గ‌రంలోని మ‌హిళ‌లు, యువ‌కులు, వికలాంగులకు వివిధ విభాగాల్లో శిక్ష‌ణ‌, చైత‌న్యం క‌ల్పించడం ద్వారా వారికి జీవ‌నోపాధి కార్య‌క్ర‌మాల ఏర్పాటు, స్వ‌యం స‌హాయ‌క బృందాలు, టౌన్‌లేవ‌ల్‌, స్ల‌మ్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్ల ఏర్పాటు ద్వారా పేద‌రికాన్ని పార‌ద్రోలి ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌టం ద్వారా ఆత్మ‌స్థైర్యంతో జీవ‌నం గ‌డిపేందుకు అర్బ‌న్ క‌మ్యునిటీ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం కృషిచేస్తుంది.

 • గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మొత్తం 46,824 స్వ‌యం స‌హాయ‌క బృందాలను ఏర్పాటు చేయ‌గా 15నుండి 25 వ‌ర‌కు స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ను క‌లిపి స్ల‌మ్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,049 స్ల‌మ్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి స‌ర్కిల్‌లో ఒక టౌన్‌లేవ‌ల్ ఫెడ‌రేష‌న్ చొప్పున 30 టిఎల్ఎఫ్‌ల‌ను ఏర్పాటు చేశారు.
 • గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా 38,916 స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా గ్రూప్‌ల‌కు రూ. 1242.26 కోట్లు రుణాలుగా అందించారు. దీంతో గ్రూపులోని సభ్యులకు తలసరి రూ.1,55,908ఆర్థిక స‌హాయం అందింది.
 • కోహెడకు కొత్తపేట పండ్ల మార్కెట్ తరలింపు

హైదరాబాద్ – విజయవాడ హైవేపై కొత్తపేట (గడ్డి అన్నారం) పండ్ల మార్కెట్ ఉండటంతో ట్రాఫిక్ నిలిచిపోయి, పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఆ మార్కెట్ ను కోహెడకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కోహెడలో 178 ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం మార్కెట్ నిర్మాణం పూర్తవగా కొత్తపేట పండ్ల మార్కెట్ ను కోహెడకు తరలించారు. దీంతో రైతులకు, ఎగుమతి దారులకు ఎంతో సౌకర్యంగా ఉంది. అయితే, కోహెడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.

 • జీహెచ్ఎంసీలో అత్యవసర బైక్ లు

విపత్తుల సమయాల్లో ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మరింత చురుకుగా పనిచేసేలా, ప్రజలకు సహాయపడేలా ప్రభుత్వం ఆధునిక ద్విచక్రవాహనాలను ప్రవేశపెట్టారు. నాలుగు చక్రాల వాహనాలు వెళ్లలేని రోడ్లు, ట్రాఫిక్ జాంలో సైతం ఈ బైక్‌ల ద్వారా తేలిగ్గా ఘటనాస్థలానికి చేరుకొనే అవకాశం ఉంటుంది. జీహెచ్‌ఎంసీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఈవీడీఎం) విభాగానికి ప్రభుత్వం ఈ ద్విచక్రవాహనాలను 27 సెప్టెంబర్, 2019న అందించింది. విపత్తుల సమయంలో డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ బైక్‌లు ఎంతగానో దోహదపడతాయి. వీటితోపాటు అవసరమైన ఇతర సామగ్రిని కూడా ఈ వాహనంలో తరలించవచ్చు. చెట్ల కొమ్మలను తొలగించేందుకు అవసరమైన మిషన్‌తోపాటు రోడ్లపై నిలిచిన నీటిని వెంటనే తొలగించేందుకు అర ఇంచు సామర్థ్యంగల పంపుసెట్‌ను ఈ బైక్‌లో పెట్టుకొనే వీలుంటుంది. ఈ పంపుసెట్ పెట్రోల్, విద్యుత్‌తో కూడా పనిచేస్తుంది.

 • ఆస్తిపన్నులో 50శాతం రాయితీ

2020-2021లో జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 15 వేల వరకు ఆస్తి పన్ను ఉన్నవారికి, రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో రూ.10 వేల పన్ను ఉన్న వారికిప్రభుత్వం 50 శాతం పన్ను రాయితీ కల్పించింది. 2020 నవంబర్ 20 నాటికి ఆస్తిపన్ను చెల్లించిన వారికి వారు చెల్లించిన మొత్తాన్ని తర్వాత వచ్చే ఏడాది పన్నులో సర్దుబాటు చేయనున్నారు.

 • పారిశుధ్య కార్మికుల వేతనం పెంపు

 జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ. 14,500 నుంచి రూ. 17,500కి పెంచింది.ఈ జీవోను 2020 నవంబర్ 20న ప్రభుత్వం జారీ చేసింది.

గ్లోబల్స్మార్ట్సిటీ.. హైదరాబాద్

వరల్డ్ఎకనమిక్ఫోరంజీ-20 కూటమిలోస్థానం

భద్రత, పాలన, భౌగోళికఅంశాలపరంగాప్రపంచస్థాయినగరంగాఎదుగుతున్నహైదరాబాద్కుమరోప్రతిష్టాత్మకగౌరవందక్కింది. ప్రపంచఆర్థికవేదిక (వరల్డ్ఎకనమిక్ఫోరం) చేపట్టినజీ-20 గ్లోబల్సిటీస్అలయెన్స్లోమార్గదర్శకనగరంహోదాలోహైదరాబాద్చేరింది. అత్యాధునికసాంకేతికతసాయంతోపౌరులజీవితాల్లోమార్పులుతెచ్చేవిధానాలరూపకల్పన, అమలుకోసంఆరుఖండాల్లోని 22 దేశాలనుంచి 36 నగరాలనుఎంపికచేశారు. ఇందులోభారత్నుంచిహైదరాబాద్, బెంగళూరు, ఫరీదాబాద్, ఇండోర్నగరాలకుమాత్రమేచోటుదక్కింది. పౌరులసుఖజీవనానికిటెక్నాలజీదన్నుఅందించేందుకు.. లండన్, మాస్కో, టొరంటో, బ్రెసీలియా, దుబాయ్, మెల్బోర్న్వంటిప్రపంచస్థాయినగరాలతోకలిసిహైదరాబాద్పనిచేయనుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విశ్వనగరంగా గ్రేట‌ర్‌ హైదరాబాద్

ట్రెండింగ్‌

Advertisement