25 నుంచి 30 స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పోటీ!

Thu,October 11, 2018 04:01 PM

YSR Congress may contest 25 to 30 seats in Telangana assembly polls

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఏ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోమని.. సొంతంగానే ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలిపారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ అనంతరం ఏపీలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డికి నివేదికను సమర్పించినట్లు చెప్పారు. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో పార్టీకి ఇప్పటికి కేడర్ ఉన్నట్లుగా నేతలు పేర్కొంటున్నారు. కాగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులు తెలంగాణ ఏర్పాటుతో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

6191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles