ఇద్దరు యువతులను అపహరించేందుకు యత్నించిన యువకుడు

Sat,May 19, 2018 10:47 PM

Youth tries to kidnap two young girls in yadadri bhuvanagiri dist

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల్‌లో ఇద్దరు యువతులను అపహరించడానికి ఓ యువకుడు యత్నించాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు యువతులను కిడ్నాప్ చేయడానికి ఆ యువకుడు ప్రయత్నించాడు. ఓ ఈవెంట్ కోసం ఇద్దరు యువతులు చౌటుప్పల్‌కు వచ్చారు. కాలేజీకి తీసుకెళ్లాలని ఇద్దరు యువతులు ఓ కారు ఎక్కారు. కారును డ్రైవ్ చేస్తున్న ఆ యువకుడు వారిని కాలేజీకి తీసుకెళ్లకుండా మరో చోటుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరు యువతులు అరవడం ప్రారంభించారు. వెంటనే వాళ్లను నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీకెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

4218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles