'ఉద్యోగావకాశాలను యువత వినియోగించుకోవాలి'

Tue,August 21, 2018 05:35 PM

Youth should utilise job opportunists says chukka ramaiah

జనగామ: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ అవకాశాలను యువత వినియోగించుకోవాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎస్‌ఐ, కానిస్టేబుల్, వీఆర్‌వో, గ్రూప్-4 వంటి తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణా తరగతుల నిర్వహణ కార్యక్రమం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి మండల కేంద్రంలో అభ్యర్థుల అవగాహనార్థం ఏర్పాటు చేసిన సదస్సుకు చుక్కా రామయ్య హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దయాకర్ రావును అభినందించారు. ఉచిత శిక్షణతో పాటు భోజనాలు, స్టడీ మెటీరియల్ అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ తరగతులను ఉపయోగించుకుని ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు.

3732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles