యువత ఓటు హక్కు ప్రాధాన్యం తెలుసుకోవాలి: ఎంపీ కవిత

Mon,March 25, 2019 02:27 PM

Youth should know about Vote Importance


నిజామాబాద్ : ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎంపీ కవిత అన్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న విద్యార్థులు, యువతతో ఎంపీ కవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడుతూ..ముందుగా ఓటు హక్కు ప్రాధాన్యం గురించి యువత తెలుసుకోవాలని సూచించారు. ఓటుహక్కు ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఎంతో సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. విద్యార్థులు ఫీజు, స్కాలర్‌షిప్స్, ఇతర సమస్యలను ఈ సందర్భంగా ఎంపీ కవిత దృష్టికి తీసుకొచ్చారు.
విద్యార్థులు పలు ప్రశ్నలు అడగ్గా ఎంపీ కవిత వాటికి సమాధానమిచ్చారు.

మీ అందరి ప్రేమతోని..నిజామాబాద్ జిల్లా ప్రజల ప్రేమతోని తప్పకుండా గెలిచి మళ్లీ ఎంపీ అవుతానని ఈ సందర్భంగా ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలైన తర్వాత మొదటి సమావేశం విద్యార్థులతోనే ఏర్పాటు చేస్తాం. తెలంగాణ యూనివర్సిటీ, అన్ని కాలేజీల విద్యార్థులు, యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసుకుని, విద్యార్థుల సమస్యలేమున్నా వాటిని పరిష్కరించుకుందామని ఎంపీ కవిత హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతోపాటు పలువురు అధికారులు, వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.

951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles