'జలగం' విజయాన్ని కాంక్షిస్తూ యువకుల పాదయాత్ర

Mon,October 15, 2018 08:54 PM

youth padayatra for winning of kothagudem trs candidate jalagam

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు విజయాన్ని కాంక్షిస్తూ యువకులు పాదయాత్ర చేశారు. పట్టణానికి చెందిన పార్టీ విభాగం యూత్ సభ్యులు కొత్తగూడెంలోని పాండురంగ భజన మందిరం నుంచి పాల్వంచలోని పెద్దమ్మ గుడి వరకూ పాదయాత్ర నిర్వహించారు. జలగం వెంకటరావు ఈ యాత్రను ప్రారంభించారు. కొద్ది దూరం జలగం వారితో కలిసి నడిచారు. అనంతరం యువకులు పెద్దమ్మ గుడికి చేరుకొని జలగం విజయం సాధించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles