బాలికతో స్నేహంగా ఉంటూ నమ్మించి..

Fri,March 22, 2019 06:47 AM

Youth Frauds the Girl with Friendship name


హిమాయత్‌నగర్‌ : బాలికతో సన్నిహితంగా ఉంటూ మాయ మాటలతో ఆ బాలికను తీసుకువెళ్లిన యువకుడిని నారాయణగూడ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు.ఎస్సై సైదులు వివరాల ప్రకారం..అంబర్‌పేటకు చెందిన బాలిక(13) హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతుంది. ఇదే స్కూల్‌కు చెందిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్‌ చాటింగ్‌ చేసిన నేపథ్యంలో ఏపీలోని విజయనగరం ప్రాంతానికి చెందిన పవన్‌(20)తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకు వారి మధ్య ప్రేమ చిగురించింది.

ఈ నెల 15న బాలిక చదివే స్కూల్‌ వద్దకు పవన్‌ వచ్చి ఆమెను సికింద్రాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఇద్దరు బొబ్బలికి రైలులో వెళ్లారు.స్కూల్‌కు వెళ్లిన తమ కుమార్తె సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కుమార్‌,ఎస్సై సైదులు నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, బాలికకు సంబంధించిన పలు వివరాలను సేకరించారు. బొబ్బలిలోని పవన్‌ బంధువుల ఇంటిలో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువచ్చారు. బాలికను మభ్యపెట్టి తీసుకువెళ్లిన పవన్‌పై 366, 354ఎ తో పాటు పోక్స్‌ చట్టం కింద11,12 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

4140
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles