ప్రేమపేరుతో యువతిని పెళ్లి చేసుకుని..డబ్బులతో పరారు

Wed,June 12, 2019 07:52 AM

youth escapes with money after marries a girl


బంజారాహిల్స్ : ప్రేమపేరుతో యువతిని నమ్మించి..లక్షలాది రూపాయలు కాజేసి, పెండ్లి చేసుకున్న మరుసటి రోజే ఉడాయించిన యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..వైజాగ్‌కు చెందిన ఎర్రంశెట్టి గౌతమ్‌(26)కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ, సినిమాల్లో సినీ రచయితల వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 2016లో సినిమాల్లో అవకాశాల కోసం నగరానికి వచ్చి బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఎన్‌బీటీనగర్‌లో నివాసం ఉంటున్న కె.భవానీ(23)ని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. అలా గే పెండ్లి చేసుకుంటానని నమ్మించగా.. ఇద్దరు కలిసి తిరిగారు. ఈ క్రమంలో గౌతమ్‌..యువతి నుంచి సుమారు రూ.5లక్షల విలువైన సొత్తును తీసుకున్నాడు.

కాగా..యువతి పెండ్లిమాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. దీంతో 10 రోజుల క్రితం బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ మేరకు బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌతమ్‌ను పిలిపించగా..పెండ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. గత నెల 26న బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 లోని హరేకృష్ణ దేవాలయంలో పెండ్లి చేసుకున్నారు. ఎన్‌బీటీనగర్‌లోని యువతి ఇంట్లో రాత్రి గడిపిన తర్వాత...తెల్లవారుజామున గౌతమ్‌ సిగరెట్‌ తాగివస్తానంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజున తనకు విడాకులు ఇవ్వాలంటూ ఫోన్‌లో గౌతమ్‌ చెప్పాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యా దు చేసింది. కాగా..మళ్లీ గౌతమ్‌ ఫోన్‌చేసి విడాకులు కావాలని యువతిని కోరాడు. ఇదే విషయాన్ని యువతి పోలీసులకు చెప్పింది. గౌతమ్‌ రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

4756
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles