సర్పంచ్ బరిలో యువత

Sat,January 12, 2019 12:28 AM

youth contesting for sarpanch in most of the villages of adilabad dist

ఆదిలాబాద్: యువశక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దేశానికి గొప్ప సంపద కూడా యువతే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ రంగాల్లో యువత వినూత్న ఆలోచనలతో తమ మేథో సంపత్తికి పదును పెడుతూ ఐటీ, ఫార్మ, ఇతర రంగాల్లో గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగాలతో పాటు కార్పొరేట్ వ్యాపారాలు చేస్తున్న చాలా మంది యువకులు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పడంతో పాటు ఇతర మార్గాల ద్వారా ప్రజలకు సామాజిక సేవ చేస్తున్నారు. ఇలాంటి అవకాశాలు లేని యువశక్తికి రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కలిసివచ్చాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్నా.. ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే తమ గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించవచ్చనుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని యువకులు. జిల్లాలో జరిగే ఎన్నికలను అవకాశంగా ఎంచుకొని సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు.

యువతే ఎక్కువ..
ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువకులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయడమే కాకుండా అభ్యర్థుల గెలుపు, ఓటములను సైతం నిర్ణయిస్తున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం యువకులు రంగంలో దిగారు. కేవలం మొదటి విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోని 153 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనుండగా.. 62 మంది నలభై శాతం యువకులు పోటీపడుతుండగా.. మరో రెండు విడతల నామినేషన్ల ప్రక్రియలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేసేందుకు పోటీ చేస్తున్నట్లు యువకులు అంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 39 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశలుండగా.. వీటిల్లో 23 మంది యువకులున్నారు. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహకాలతో పాటు పల్లెలు ప్రశాంతంగా ఉండడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పటి వరకు ఒకే నామినేషన్ దాఖలైన పంచాయతీలతో పాటు తమ గ్రామాల్లో పోటీలో ఎవరు ఉండాలనే విషయంలో సైతం యువకులు చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకోసం గ్రామస్తులకు నచ్చచెప్పడంతో పాటు, గ్రామ పెద్దలను, సర్పంచ్‌గా పోటీ చేయాలను వారికి సైతం పలు విషయాలను తెలియజేస్తున్నారు. యువజన సంఘాలతో పాటు గ్రామాల్లో చురుకుగా ఉంటే యువత ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటున్నారు.

1660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles