పబ్జీ గేమ్ వద్దన్నందుకు ఆత్మహత్య

Mon,March 11, 2019 10:40 PM

youth allegedly committed suicide by hanging due to pubg game

గజ్వేల్ : పబ్జీ గేమ్ ఆడవద్దని, బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించినందుకు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన శేషత్వం సాయిచరణ్(18) అనే డిగ్రీ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శేషత్వం వెంకటనారాయణ ప్రజ్ఞాఫూర్‌లో నివాసముంటూ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వెంకటనారాయణ చిన్న కొడుకు సాయిచరణ్ గజ్వేల్ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సాయిచరణ్ కొంత కాలంగా పబ్జీ గేమ్ బానిసై, చదువులో వెనుకబడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు ఆట ఆడొద్దని నచ్చజెప్పినా, అతనిలో మార్పు రాలేదు. గేమ్ ఆడుతుండగా, తల్లి శారద మందలించింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయిచరణ్ పక్క గదిలోకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి చూసే సరికి ఫ్యాన్‌కు వెలాడుతూ కన్పించడంతో ఇతరుల సాయంతో తలుపులు తెరిచి చూసే సరికి అప్పటికే మృతి చెందాడు.

1658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles