యువతి బ్రేకప్ ... మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య

Sun,October 13, 2019 10:01 AM

హైదరాబాద్ : వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది... చట్టాపట్టాలేసుకొని తిరిగారు... కొంతకాలనికి విడిపోయారు. ఇటీవల ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఫిల్మ్‌నగర్‌లోని ఎంఆర్‌సీ కాలనీకి చెందిన అభిషేక్ షిండే (20) యూసుఫ్‌గూడలోని మేరీస్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని నందినగర్‌లో నివసిస్తూ డిగ్రీ చదువుతున్న వరుసకు బంధువయ్యే యువతి (19) నాలుగేండ్ల క్రితం పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో సినిమాలు, షికార్లకు వెళ్లారు. రెండు నెలల క్రితం చిన్న చిన్న కారణాలతో విడిపోయారు.


ఆ క్రమంలో సదరు యువతి అభిషేక్ షిండేకు బ్రేకప్ చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా డు. సదరు యువతికి తాను చనిపోతున్నానని ఒక్కసారి మాట్లాడాలని ఫోన్‌లో మెసేజ్ పెట్టాడు. ఆమె స్పందించకపోవడంతో మరోసారి ఇక సెలవంటూ మరో మెసేజ్ పెట్టి.. అదే సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అతని సోదరుడు, వదిన కిందకు దించి ద వాఖానకు తరలిస్తుండగా అప్పటికే మృతిచెందాడు. దీంతో తండ్రి నర్సింగ్‌రావు షిండే.. తన కుమారుడు మృతికి యువతి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

2972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles