కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

Tue,November 7, 2017 02:30 PM

young man killed with current shock

పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం గుంజపడుగు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అడవి పందుల కోసం అమర్చిన కరెంట్ తీగ తగిలి వీరవేన రాజ్‌కుమార్(26) అనే వ్యక్తి షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles