ప్రాణం తీసిన మూఢనమ్మకం..!

Sat,May 25, 2019 10:42 PM

young man died Calvary church fraud

కాసిపేట : మూఢనమ్మకం ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రార్థనలతో జ్వరం నయమవుతుందని భావించిన ఆ కుటుంబసభ్యులకు తీరని శోకం మిగిలింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చిలో ఈ దారుణ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన గిరిశెట్టి రాజేశ్(21)కి తీవ్ర జ్వరం రావడంతో అతడి కుటుంబసభ్యులు మూడు రోజుల క్రితం చర్చికి తీసుకొచ్చారు. చర్చి నిర్వాహకలు వైద్యం చేయించకుండా ప్రార్థల పేరుతో కాలయాపన చేయడంతో శనివారం మృతిచెందాడు.

మూడు రోజుల్లో జ్వరాన్ని తగ్గిస్తామని చర్చి ఫాదర్ చెప్పి నిర్లక్ష్యం చేయడం వల్లే రాజేశ్ మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి మృతదేహాన్ని మాయం చేయాలని చూశారని ఆరోపించారు. ప్రత్యేక వాహనంలో దవాఖానకు తీసుకువెళ్లాలని చెప్పి మూడు గంటల పాటు వాహనంలో మృతదేహాన్ని బయట తిప్పారని చెప్పారు. చర్చి నిర్వాహకుల హైడ్రామాను అర్థం చేసుకుని స్థానికులు వాహహన్ని అడ్డగించంతో రాజేశ్ మృతిచెందిన విషయం వెలుగుచూసింది. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖనకు తరలించగా, చర్చి నిర్వాహకుల వైఖరిపై విద్యార్థి సంఘాలు, కుటుంబసభ్యులు నిరసన తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కాసిపేట ఎస్‌ఐ భాస్కర్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

4172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles