ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడి మృతి

Sun,February 17, 2019 08:20 PM

young man Death in road accident

సంగారెడ్డి : ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ యువకుడి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలంలోని లక్డారం గ్రామానికి చెందిన కర్నెరాజు, యాదమ్మ దంపతులకు కూలీ పని చేసుకుంటూ జీవస్తున్నారు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. రాజు కొడుకు కర్నెవేణు (18) స్థానికంగా ఉన్న ఓ కళాశాల ఇంటర్ పూర్తి చేశాడు. తన స్నేహితుడైన ముచర్ల రాజుతో కలిసి లక్డారం నుంచి గోమారంవైపు ద్విచక్రవాహంపై వెళుతున్నాడు. అదే దారిలో ఇస్మాయిల్‌ఖాన్‌పేట నుంచి బ్యాతోల్‌వైపు వెళుతున్న పత్తి వెంకటేశం తన ద్విచక్రవాహనంతో ఎదురుగా వచ్చిన ఢీకొట్టాడు. దీంతో వాహనం నడుపుతున్న కర్నెవేణు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృత చెందాడు. వెనాకల ఉన్న ముచ్చర్ల రాజుకు గాయాలు కావడంతో స్థానిక ఓ ప్రైవెట్ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి రాజు ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన పత్తి వెంకటేశంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

4047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles