పెళ్లింట తీరని విషాదం.. పత్రికలు పంచి వస్తూ యువతి దుర్మరణం

Sat,June 15, 2019 09:37 PM

young girl died in accident in peddapalli dist

* మరో పదకొండు రోజుల్లో వివాహం
* సోదరుడితో బైక్‌పై వస్తుండగా లారీ ఢీకొని మృత్యువాత

పెద్దపల్లి: పెండ్లి పత్రికలు పంచి తిరిగి వస్తూ.. మరో పదకొండు రోజుల్లో వివాహం కావాల్సిన యువతి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామ శివారులో జరిగింది. ఎస్‌ఐ రాజేష్ కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన మ్యాడగొండ పద్మ-తిరుపతి దంపతుల కూతురు హారిక వివాహం ఈ నెల 26న నిశ్చయమైంది.

ఈ క్రమంలో బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వరుసకు అన్న అయిన కిరణ్‌తో కలిసి బైక్‌పై ఓదెల మండలం కొలనూర్‌కు వెళ్లింది. పని ముగించుకొని తిరిగి వస్తుండగా, రేగడిమద్దికుంట శివారులో వెనుక నుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో హారిక అక్కడికక్కడే మృతి చెందగా, కిరణ్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చి, కిరణ్‌ను సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

9611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles