ట్రాక్టర్‌కు కరెంట్ వైర్లు తగిలి యువరైతు మృతిTue,February 13, 2018 09:48 PM
ట్రాక్టర్‌కు కరెంట్ వైర్లు తగిలి యువరైతు మృతి

వర్గల్; మండల పరిధిలోని నెంటూర్ గ్రామ పంచాయితీ మధిర గ్రామమైన సామలపల్లిలో ట్రాక్టర్ కు లెవన్ కేవీ విద్యువైర్లు తగలడంతో యువరైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగులపల్లి కేశవరెడ్డి(35) కోళ్లఫారం మీద గడ్డి కప్పుదామని మరో వ్యక్తితో కలిసి ట్రాక్టర్ పై బయల్దేరాడు.గడ్డినింపుడు కాగానే తనతోపాటు వచ్చిన వ్యక్తిని ఇంటింకి పంపాడు. ట్రాక్టర్‌తో తిరుగుప్రయాణమవ్వగా పోల్‌టూపోల్‌కు ఉన్న ఎల్‌టీ వైర్లు ట్రాక్టర్‌కు కట్టిన పైపులకు తగలడంతో కేశవరెడ్డి క్షణాల్లోనే విగతజీవుడయ్యాడు.విషయం గమనించిన ఇరుగుపొరుగువారు వెంటనే విద్యుత్ సరఫరాను ఆపు చేయించి మృతదేహాన్ని గజ్వేల్ పోస్టుమార్ట్‌కు తరలించారు. బాధితకుటుంబీకుల పిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.

1006
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018