ఓటమికి మీరే భయం కావాలి: సీపీ ధైర్య పాఠాలు

Sun,April 21, 2019 07:26 AM

You must be afraid of defeat brave lessons

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలతో కృంగిపోతున్న విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తన వంతుగా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు కమిషనర్ సజ్జనార్ పలు సూచనలు జారీ చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మేడ్చల్‌కు చెందిన నవ్యశ్రీ విద్యార్థ్ధిని ఆత్మహత్య సంఘటనతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకున్న సంఘటనలతో ఆయన తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. దీంతో విద్యార్థ్ధులకు అండగా నిలవాలనే లక్ష్యంతో వారికి పలు స్ఫూర్తిదాయకమైన సూత్రాలను తెలిపారు.

* భయపడొద్దు.. తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చొద్దు.
* జీవితంలో పరీక్షలు ఓ భాగం.. పరీక్షలే జీవితం కాదు.
* చదువు లేకున్నా విషయజ్ఞానం, కష్టపడి పని చేసే తత్వం ఉంటే చాలు అనేక రంగాల్లో విజేతలుగా నిలువొచ్చు.

వీరిని ఆదర్శంగా తీసుకోండి ..


* జీవితంలో చదువు లేనప్పటికీ పట్టుదల, కృషి ఉంటే గొప్పవారు కావచ్చని శ్రీనివాస్ రామానుజన్, రజినీకాంత్, షేక్ స్పియర్, మైఖేల్ ఫారడే, గ్రేగర్ మొం డల్, విన్ స్టన్ చర్చిల్, అబ్రహం లింకన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్ నిరూపించారని ఆయన గుర్తు చేశారు. దీనికి వీరి విజయాలకు సంబంధించిన పుస్తకాలను చదవాలి.

తల్లిదండ్రులకు జాగ్రత్తలు


* పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రుల్లో బాధ, ఆవేదన సహజం. కానీ వారు పిల్లలతో దురుసుగా ప్రవర్తించొద్దు.
* తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నేర్పించాలి.
* సామార్థ్ధ్యాలపై ఇతర పిల్లలతో పోల్చుకోవద్దు.కోచింగ్ కేంద్రాలకు సూచనలు
* నిర్వహకులు మార్కులు రాకపోతే పనికి రావనే అభద్రతా భావాన్ని పెంచొద్దు.
* వంద శాతం ఉత్తీర్ణత అంటూ లక్ష్యంగా విద్యార్థ్ధులను ఒత్తిడికి గురి చేయొద్దు.
* గొప్పవారి చరిత్రలను చదివేందుకు ప్రోత్సహించాలి.
* చరిత్ర సృష్టించిన వాళ్లంతా ఓటమిని రుచి చేసి విజేతలుగా నిలిచిన వారే.

1989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles