యోనో యాప్‌ ద్వారా కార్డు లేకున్నా క్యాష్ పొందవచ్చు...

Sat,March 16, 2019 06:30 AM

YONO Cash Now SBI customers can withdraw cash without ATM cards

హైదరాబాద్ : బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మరో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఏటీఎంకార్డు లేకుండా నేరుగా ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునే సేవలను ప్రారంభించింది. డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇప్పటికే యోనో యాప్‌ను ఆవిష్కరించిన బ్యాంక్..యోనో క్యాష్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 16,500 ఏటీఎంల నుంచి నగదును ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. ఈ తరహా సేవలు అందిస్తున్న తొలి బ్యాంక్ ఎస్‌బీఐ కావడం విశేషం. ఈ సేవలకోసం వినియోగించే ఏటీఎంలను యోనో క్యాష్ పాయింట్లుగా వ్యవహరించనున్నారు. నగదును విత్‌డ్రా చేయాలనుకునేవారు ఎస్‌బీఐ వినియోగదారుడి స్మార్ట్‌ఫోన్‌కు ఆరు అంకెల రిఫరెన్స్ నంబరు వస్తున్నది.

872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles