పాఠ్యాంశాలుగా మార్షల్ ఆర్ట్స్, యోగా: కడియం శ్రీహరి

Fri,January 18, 2019 07:24 PM

yoga and martial arts in state syllabus says kadiyam srihari

హైదరాబాద్   : కేంద్ర ప్రభుత్వం యోగా, మార్షల్ ఆర్ట్స్ ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలనే చట్టాన్ని రూపకల్పన చేస్తోందని, ఈ చట్టం రూపుదాల్చితే దానిని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్షల్ ఆర్ట్స్, యోగాను పాఠ్యాంశంగా రూపొందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా చేస్తోందన్నారు.

        గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 36వ భారత జాతీయ కరాటే చాంపియన్ షిప్-2019 పోటీలను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...మార్షల్ ఆర్ట్స్ స్వీయ రక్షణలో, ఆత్మ రక్షణలో, శారీరక దృడత్వాన్ని కాపాడడంలో ఉపయోగపడుతాయని, తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మార్షల్ ఆర్ట్స్ ను, యోగాను ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు.

 36వ కరాటే జాతీయ చాంపియన్ షిప్ పోటీలకు ఆతిధ్యమిస్తున్న హైదరాబాద్ నగరం హ్యాపెనింగ్ సిటీ అని, తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంమని తెలిపారు. ఇక్కడ హైదరాబాద్ బిర్యాని ప్రఖ్యాతిగాంచిందన్నారు. ఇక్కడకొచ్చిన ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల న కరాటే చాంపియన్లు, అతిధులు హైదరాబాద్  బిర్యానిని రుచి చూసి వెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, సాండిల్ వుడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రవీందర్ జపాన్ కరాటే అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ షిహాన్ వై. ఒగురా, జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా చీఫ్ ఇస్ స్ట్రక్టర్ షిహాన్ ఆనంద్ రత్న తదితరులు పాల్గొన్నారు. 

559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles