యాదాద్రి భవన్ ప్రారంభోత్సవం

Fri,June 14, 2019 10:40 AM

yadav bhavan inauguration barkatpura

హైదరాబాద్: బర్కత్‌పురాలో యాదాద్రి భవన్ ప్రారంభోత్సవం జరిగింది. యాదాద్రి ఆలయ సమాచారం కోసం ప్రభుత్వం యాదాద్రి భవనం నిర్మించింది. ప్రారంభోత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి. ఆలయ ఈవో గీతా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..... యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.8 కోట్ల‌తో యాదాద్రి భ‌వ‌న్ ను నిర్మించామన్నారు.

యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ వంటివి ఇక్కడినుంచే బుకింగ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. దాదాపు 1600 చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో సెల్లార్, జీ ప్లస్ టూ నిర్మించారని వెల్లడించారు. మొదటి అంతస్తులో కల్యాణ మండపం, రెండో అంతస్తులో 500 మంది సరిపడే భోజనశాలను ఏర్పాటుచేశారన్నారు.

10,990 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలోని సెల్లార్ ప్రాంతాన్ని పూర్తిగా పార్కింగ్ కు కేటాయించామని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 7435 అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్, యాదాద్రి ఆల‌య స‌మాచార కేంద్రం, ఇక 7,435 అడుగుల విస్తీర్ణంలో మొద‌టి (క‌ళ్యాణ మండ‌పం), రెండో అంతస్తుల‌ను (డైనింగ్ హాల్) హాల్స్ గా నిర్మించారు. మొత్తం 32,207 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో యాదాద్రి భ‌వ‌న్ ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

2428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles