శరవేగంగా యాదాద్రి ఆలయం పనులు

Tue,November 19, 2019 08:59 PM

యాదగిరిగుట్ట, : యాదాద్రి ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం ఫెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు, స్తపతులు రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. ఈ నెల చివరిలోపు పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీతారెడ్డి, స్తపతి సలహాదారు ఆనందచార్యుల వేలు, ఆర్కిటెక్ ఆనందసాయి ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.


యాదాద్రి గర్భాలయం ముఖద్వారంపై అమర్చేందుకు పంచలోహంతో తయారు చేసిన హిరణ్యాక్షుడి రాజ్యసభను తిలకించారు. ప్రహ్లాదుడి చరిత్ర తెలుపుతూ 10 ఫ్యానల్‌ను గర్భాలయ ముఖ ద్వారంపై అమర్చనున్నారు. అంతేకాకుండా రాతితో తయారు చేసిన ద్వారపాలకుడిని అమర్చనున్నారు. యాదాద్రి పనులను ఎప్పటికప్పుడు వైస్ చైర్మన్ కిషన్‌రావు, స్తపతిసలహాదారు ఆనందచార్యుల వేలు, అనందసాయిలు రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులన్నీ ఈ నెల చివరి వరకు పూర్తిచేయాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఉప స్తపతులు, సహాయ స్తపతులు శ్రమిస్తున్నారు.

1177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles