యాదాద్రి కళావైభవం!

Sun,December 16, 2018 07:36 AM

Yadadri Shilpa Kala Vaibhavam

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శిల్పకళా వైభవం అబ్బుర పరుస్తున్నది. సీఎం కేసీఆర్ ఏ రోజైనా యాదాద్రికి వస్తారన్న ఉన్నతాధికారుల సమాచారం మేరకు పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. సుమారు 3వేల మంది వివిధ పనుల్లో పాల్గొంటుండటం.. పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడంతో యాదాద్రి శోభాయమానంగా మారుతున్నది. తూర్పు, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ దివ్యవిమాన గోపురం, స్వాగత గోపురం, రాజగోపురాల నిర్మాణ పనులు శిల్పకళా వైభవంతో విరాజిల్లుతున్నాయి. శుక్రవారం శ్రీవారి ప్రధానాలయ ద్వార గడపను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కొండపైగల ఏడు గోపురాలు, ప్రధానాలయం, శివాలయం, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం ఇతర ప్రాధాన్యత నిర్మాణాల కోసం భారీ తలుపులను చేయించారు. వాటిని పకడ్బందీగా అమర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ఈఎన్సీ రవీందర్‌రావు, స్థపతులు ఎస్ సుందరరాజన్, డాక్టర్ ఆనందాచారివేలు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తిచేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన..
త్వరలో సీఎం కేసీఆర్ స్వయంగా పనులను పరిశీలిస్తారని వైటీడీఏ వైస్ చైర్మన కిషన్‌రావు, ఆలయ ఈవో గీతకు సమాచారం అందడంతో పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

1235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles