ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం: నందిని

Thu,December 21, 2017 07:12 PM

World Telugu Conferences Success says nandini siddareddy

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతమైనట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. మహాసభల నిర్వహణపై నందిని సిధారెడ్డి స్పందిస్తూ.. తెలుగు మహాసభల విజయవంతంలో మీడియా కీలకపాత్ర పోషించిందన్నారు. సాహిత్యాన్ని కాపాడటంలో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. తెలుగు మహాసభల విశేషాలతో గంట నిడివి గల ప్రత్యేక సీడీని విడుదల చేసినట్లు చెప్పారు. అదేవిధంగా వక్తల ప్రసంగాలు, పలు కార్యక్రమాల ఛాయాచిత్రాలతో కూడిన ప్రత్యేక సంచికను తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. కళాకారులను ఆహ్వానించే విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని పేర్కొన్న ఆయన భవిష్యత్తులో అలాంటి తప్పులను సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు.

2427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles