వైభవోపేతంగా ప్రపంచ తెలుగు మహాసభలు

Tue,December 19, 2017 06:04 PM

World Telugu Conference at LB Stadium

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా కొనసాగుతోంది. ఎల్బీస్టేడియంలోని పాల్కూరికి సోమనాథుని ప్రాంగణం బమ్మెర పోతన వేదిక మీద ముగింపు వేడుకలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. తెలుగు మహాసభ ప్రారంభ వేడుకలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన విషయం విదితమే. ఐదు రోజుల పాటు ఎల్బీ స్టేడియం, రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా అనేక కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భాషాభిమానులను అలరించాయి. నగరంలో ఎక్కడా చూసినా ఈ ఐదు రోజుల పాటు తెలుగు పండుగ వాతావరణం కొనసాగింది.

2726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles