ఇండ్ల ముందు ఆడుకునే బాలికలకే వారి లక్ష్యం..

Fri,July 19, 2019 06:47 AM

women thief targets girls for ornaments


హైదరాబాద్ : ఇండ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలను టార్గెట్‌ చేసుకొని... వారి ఒంటిపై ఉన్న నగలను కాజేస్తున్న ఓ ఘరానా మహిళా దొంగను మలక్‌పేట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో నమోదైన 25 కేసుల్లో నిందితురాలిగా తేలింది. నిందితురాలి నుంచి రూ.3.8 లక్షల విలువచేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన వేగ్నమ్‌ అనూరాధ గుంటూరు రైల్‌పేట్‌లో నివాసముంటుంది. అక్కడి నుంచి నగరానికి వచ్చి కర్మన్‌ఘాట్‌ ప్రాం తంలో ఉంటుంది. ఈ క్రమంలో నగరంలో ఒంటరిగా ఇండ్ల ముందు, పార్కుల వద్ద ఆడుకునే బాలికలను ఎంచుకుంటుంది. వారికి మాయ మాటలు చెప్పి, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు ఇప్పిస్తూ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చెవి పోగులు, ముక్కుపుడకలు, కాళ్ల పట్టీలు అపహరిస్తుంది. నగలను తొలగించేందుకు కట్టింగ్‌ ప్లేయర్‌ను ఉపయోగిస్తుంటుంది. హైదరాబాద్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో బాలికల ఆభరణాలను అపహరించింది.

ఈ క్రమంలో మలక్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఇలాం టి కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితురాలిని గుర్తించారు. డీఎస్సై శివశంకర్‌ నేతృత్వంలోని బృందం నిందితురాలిపై నిఘా ఉంచి బుధవారం సాయంత్రం కర్మన్‌ఘాట్‌, నందనవనం కాలనీలో అరెస్ట్‌ చేశారు. విచారణలో మలక్‌పేట్‌, సైదాబాద్‌, అంబర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, సరూర్‌నగర్‌, మీర్‌పేట్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో జరిగిన 25 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితురాలి నుంచి సుమారు రూ. 3.8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై పీడీయాక్టు ప్రయోగించనున్నట్లు సీపీ తెలిపారు.

759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles