యువశక్తిలో స్త్రీ శక్తి అనేది కూడా ఓ భాగం: గవర్నర్

Sun,January 20, 2019 05:42 PM

హైదరాబాద్ : హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సుకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. యూత్ అచీవర్ అవార్డులను రెజ్లర్ బబితా ఫొగట్ , మాలావత్ పూర్ణ, లైఫ్ టైం అవార్డును రాజేంద్రసింగ్ (వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా) గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ..వసుదైక కుటుంబం అనేది మన మార్గం కావాలన్నారు. జాగృతి అంటే చైతన్యం. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న కవితకు నా అభినందనలు. యువశక్తిలో స్త్రీ శక్తి అనేది కూడా ఓ భాగం. అహింసా విధానం గాంధీ మార్గం. ప్రతీ ఒక్కరూ మహాత్మాగాంధీ అహింసామార్గాన్ని అనుసరించాలన్నారు. మనుషుల మధ్య అంతరాలు తొలగాలి. అందరికీ సమాన అవకాశాలు అందాలని గవర్నర్ ఆకాంక్షించారు. అప్పుడే సమాజం సరైన మార్గంలో పయనిస్తుందన్నారు.

1349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles