మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి

Fri,April 19, 2019 01:05 PM

women Participation is must in development says vice president venkaiah naidu

హైదరాబాద్: మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నగరంలోని ఎంఆర్‌ఆర్‌హెచ్‌ఆర్‌డీలో వొడాఫోన్ ఇండియా, లర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత అవగాహన సదస్సును చేపట్టారు. 2020 నాటికి 13 మిలియన్ల మందికి ఆర్థిక అక్షరాస్యత కల్పించాలని సంస్థల లక్ష్యం. మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై ఏడాది శిక్షణ పూర్తయిన సందర్భంగా కార్యక్రమంను ఏర్పాటు చేశారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలు మహిళలు ఆర్థిక సంవృద్ధి పొందేలా చేస్తాయన్నారు. దేశానికి అక్షరాస్యతతో పాటు ఆర్థిక అక్షరాస్యత కూడా ఎంతో అవసరమన్నారు. మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రపచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందన్నారు. మహిళలు వారి సొంత కాళ్లపై నిలబడేలా నైపుణ్యం అందివ్వాలన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు వృత్తి నైపుణ్య విద్య మొదటి మెట్టు అని ఆయన పేర్కొన్నారు.

627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles