స్కూలుకు వెళ్లనంటే..పోలీసులకు ఫోన్ చేసింది

Thu,July 18, 2019 08:37 PM

women called to 100 tollfree for her son schooling


మహబూబ్ నగర్: పిల్లలు స్కూలుకు వెళ్లమని అప్పుడపుడు మారాం చేయడం సహజంగా జరిగేదే. అమ్మానాన్నలను వదిలి స్కూల్ కు వెళ్లేందుకు చిన్నారులు భయపడుతుంటారు. ఇక తల్లిదండ్రులు మాత్రం ఎలాగోలా నచ్చజెప్పి లేదా కోపగించుకుని పిల్లలను స్కూల్ కు తీసుకెళ్తుంటారు. అయితే ఓ పిల్లాడు స్కూలుకు వెళ్లనని మారాం చేస్తుంటే..కోపంతో ఊగిపోయిన అతని తల్లి ఏకంగా పోలీసులకు ఫోన్ చేసింది.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మహిళ తమకు సమస్య ఉందని అత్యవసరంగా వెంటనే తమ ఇంటికి రావాలని పోలీసుల టోల్ ఫ్రీ నంబర్ 100కు డయల్ చేసి అడ్రస్ చెప్పింది. ఫోన్ కాల్ కు వెంటనే స్పందించిన పోలీసులు ఏదో ఎమర్జెన్సీ కేసు అయి ఉంటుందని భావించి వెంటనే కారులో ఆ మహిళ ఇంటికి వాహనంలో వెళ్లారు. అయితే పోలీసులు తీరా ఆ మహిళ ఇంటికెళ్లగా అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు. పోలీసులు ఏమయిందని మహిళను ప్రశ్నించగా..'నా కొడుకు స్కూలుకు పోనని మారాం చేస్తున్నాడు.ఎంత చెప్పినా వినడం లేదు. సాయం చేయండి సార్' అని కోరింది. ఆ మహిళ ప్రవర్తనతో టెన్షన్ టెన్షన్ గా వచ్చిన పోలీసులు కాస్త ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.

968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles