ఆడబిడ్డలు టీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టు..

Sun,April 7, 2019 04:32 PM

women are only power to trs party says Mp kavitha


నిజామాబాద్: ఆడబిడ్డలు టీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టు అని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. మహిళల వల్లే టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎక్కువ మంది నామినేషన్ వేసిన నేపథ్యంలో ఓటర్లు అయోమయానికి లోనుకావొద్దని సూచించారు. మొత్తం 12 ఈవీఎంలుంటాయి. మొదటి ఈవీఎంపై రెండో స్థానంలోనే కారు గుర్తుంటుందని, జాగ్రత్తగా చూసి ఓటేయాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినం. 16కు 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్సే గెలవాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు మండవ వెంకటేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి రావడం సంతోషంగా ఉందని కవిత అన్నారు.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles