షాపింగ్‌కు వచ్చి మహిళ.. కాలేజీ కోసం వచ్చి విద్యార్థి అదృశ్యం

Fri,September 21, 2018 06:43 PM

Women and inter student disappeared in Hyderabad

హైదరాబాద్: నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు అగుపించకుండా పోయిన ఘటన చోటుచేసుకుంది. అసిఫాబాద్ నుంచి షాపింగ్ కోసం వచ్చిన మౌనిక సుల్తాన్‌బజార్ మార్కెట్‌లో కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త మోహన్ సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మౌనిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరొక ఘటనలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి హనుమంతు ఎల్బీనగర్‌లో అదృశ్యమయ్యాడు. విద్యార్థి కాలేజీ కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చాడు. విద్యార్థి హనుమంతు కొత్తపేట నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు.

8345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles