కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని..

Fri,April 19, 2019 08:42 PM

Woman stages dharna

మునుగోడు: తన వివాహ సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఓ కోడలు అత్త ఇంటి ఎదుట దీక్షకు దిగిన ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కోతులారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. చండూరు మండలం గట్టుప్పల్‌ గ్రామానికి చెందిన బండారి వెంకటయ్య, సాలమ్మ దంపతుల కుమార్తె అనూషను కోతులారం గ్రామానికి చెందిన ఐతగోని కోటయ్య, ఇందిరమ్మల కుమారుడు రాంప్రసాద్‌కు ఇచ్చి 2017 ఆగ‌స్టులో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ.5 లక్షల కట్నం ఇచ్చారు. వివాహమైన ఆరునెలల్లోనే రాంప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయాడు కాబట్టి అనూషకు ఇచ్చిన కట్నంతో పాటు రెండున్నర ఎకరాల సాగుభూమి ఇస్తామని అప్పట్లో రాంప్రసాద్‌ తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో మాటిచ్చారు. ఇప్పటి వరకు కట్నం డబ్బులతో పాటు భూమి ఇవ్వక పోవడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ అనూష తన తల్లిదండ్రులతో కలిసి అత్త ఇంటి ఎదుట దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని అనూష పేర్కొంది.

6310
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles