కేక్‌ల తయారీలో మహిళా ఖైదీలు

Mon,January 1, 2018 11:14 AM

woman prisoners make cakes in chanchalguda jail  • న్యూ ఇయర్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లకు సరఫరా

  • మైనేషన్‌లోనూ విక్రయాలు

హైదరాబాద్: పసందైన కేక్‌లను తయారు చేస్తున్నారు చంచల్‌గూడ మహిళా జైలు ఖైదీలు. నాణ్యత.. రుచిగా ఉండడంతో కేక్‌లకు గిరాకీ బాగా ఉంటున్నది. ఇక న్యూయర్ సందర్భంగా జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆదేశాల మేరకు 95 కేజీల కేక్‌లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లకు సరఫరా చేశారు. అలాగే చంచల్‌గూడ పెట్రోల్ పంప్, మహిళా ఖైదీల పెట్రోల్ పంపుల వద్ద ఉన్న మైనేషన్ కేంద్రాల వద్ద విక్రయానికి కేక్‌లను అందుబాటులో పెట్టారు. వీటిని అనేక మంది కొనుగోలు చేయడం విశేషం. మరో వైపు డీజీ వీకే సింగ్ మరో 50 కేజీల కేక్‌లను ఆర్డర్ ద్వారా ఇతరులకు విక్రయించారు.

చంచల్‌గూడ మహిళా జైలు ఆవరణలో 2011లో సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆధునిక యంత్రాలతో బేకరీ యూనిట్‌ను నెలకొల్పారు. ఇందులో బ్రేడ్, బిస్కెట్, కేక్‌లను తయారు చేస్తుంటారు. ఆర్డర్ల ప్రకారం ప్రతి రోజూ వారికి అవసరమైన మేరకు నాణ్యమైన కేక్‌లు తయారు చేయడంతో ఊహించిన దానికంటే ఆర్డర్లు పెరిగాయి. ఒక రోజు ముందుగా ఆర్డర్లు ఇచ్చిన వారికి నిర్ణీత సమయం కంటే ముందుగానే సిద్ధం చేసి అందజేస్తున్నారు. ఆర్డర్లన్నీ ఫోన్ ద్వారా స్వీకరించి వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు.

మహా పరివర్తనానికి మహా స్పందన

జైలు అంటే నేరస్తులకు శిక్షించే కారాగారం ఒకటే కాదు...వారిలో మార్పు తీసుకొచ్చే సత్ప్రవర్తనాలయాలుగా మార్చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఖైదీలు తమ జీవితాలను ఉజ్వలంగా మార్చుకునే దిశగా ఆడుగులు వేస్తున్నారు. ఖైదీల జీవితాల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి వారిలో చైతన్యం కలిగిస్తూ, ఖైదీల్లో పశ్చాత్తాపంతో మార్పులు తీసుకొచ్చేందుకు జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ మహా పరివర్తనం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడడంతో మహా స్పందన లభిస్తున్నది.
బషీరాబేగం (చంచల్‌గూడ మహిళా జైలు సూపరింటెండెంట్)

1751
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles