భర్త గొంతుకోసి చంపిన భార్య

Mon,January 8, 2018 09:07 PM

Woman kills Gulf-returned husband to live with paramour in Telangana

వేములవాడ : కలిసి ఏడడుగులు నడిచిన భార్యే.. ఆ భర్త పాలిట మృత్యువులా మారింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తాడని కట్టుకున్న మొగున్నే కడతేర్చింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకోగా, జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం ఘనపూర్‌కు చెందిన బండి నర్సవ్వ-బాలయ్య(40) దంపతులు. పదేళ్లుగా ఉపాధి కోసం బాలయ్య గల్ఫ్ దేశాలకు వెళ్లొస్తున్నాడు. గత 20 రోజుల క్రితం బాలయ్య స్వగ్రామానికి తిరిగొచ్చాడు. సాయంత్రం రాజన్న దర్శనానికి వేములవాడకు చేరుకున్నారు.

స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఉండేందుకు అద్దె గదులు దొరక్క పోవడంతో ఆలయ గుడిచెరువు సమీపంలోని పార్కింగ్ స్థలంలో నిద్రించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దంపతుల మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. అతిగా మద్యం సేవించి ఉండడంతో భర్త బాలయ్య గొంతును వెంట తెచ్చుకున్న కత్తితో భార్య నర్సవ్వ కోసి చంపినట్లు తెలుస్తున్నది. అక్కడే ఉన్న స్థానిక భక్తులు కొందరు బాలయ్య అరుపులు విని పోలీసులకు సమాచారం అందించారు.

వేములవాడ డీఎస్పీ అవధాని చంద్రశేఖర్, సీఐ వెంకటస్వామి అక్కడికి చేరుకోగా అప్పటికే బాలయ్య మృతిచెందాడు. తన భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉండటంతో ఇటీవలే పలుమార్లు ఇద్దరికి గొడవలు జరిగినట్లు సమాచారం. గొడవలో నర్సవ్వ చేతికి కూడా గాయాలైనట్లుగా తెలిసింది. సీసీ ఫుటేజీలతోపాటు వివాహేతర సంబంధాలు, హత్యలో ఇతరుల పాత్ర ఉంద అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

3976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles