ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

Thu,April 18, 2019 10:28 PM

Woman Gives Birth To 3 Kids At One Time

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కడలాపూర్ గ్రామానికి చెందిన మిరాబాయి అనే నిండు గర్భిణీ బుధవారం జిల్లా దవాఖానలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గురువారం ఉదయం 9గంటలకు ఆపరేషన్ చేయగా.. ఆమె ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. ఒక్కో శిశువు 1.810 గ్రాముల బరువు ఉండగా.. వారిని ఇంక్యుబెటర్‌లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles