అదనపు వరకట్న వేధింపులకు యువతి బలి

Fri,May 3, 2019 09:14 PM

woman died dowry harassment

జగిత్యాల : అదనపు వరకట్నం కావాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేయడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలి ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలం వీర్లగుంట గ్రామానికి చెందిన గుంజె గంగామణి(24) అలియాస్ శ్రావణికి జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గుంజె భానుతో గత నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా గత కొన్ని రోజులుగా రూ.20వేల అదనపు వరకట్నం కావాలని అత్తింటి వారు వేదింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో యువతి లక్ష్మీపూర్ గ్రామంలోని ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గంగామణి తల్లిదండ్రులు భర్త భాను, అత్తామామలు అదనపు వరకట్నం కోసం వేదింపులకు గురి చేయడంతో పాటు గంగామణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రులు చెన్నయ్య, లక్ష్మిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ చిర్ర సతీష్ కుమార్ తెలిపారు.

2592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles