ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య

Sun,January 20, 2019 10:40 PM

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో గ్రామానికి చెందిన మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని డిచ్‌పల్లి ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. వివరాల ప్రకారం .. గ్రామానికి చెందిన దువ్వ భూమవ్వ(52) కొద్ది రోజులుగా మనస్తాపానికి గురై ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.


మంటలకు తాళలేక బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబసభ్యులు మంటలార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే పూర్తిగా కాలిపోవడంతో భూమవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. ఏడాది కిందట కంటి ఆపరేషన్ చేసుకున్న భూమవ్వ అప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తుండేదని కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

2695
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles