భర్త చేతిలో భార్య దారుణ హత్య

Wed,October 9, 2019 11:58 AM

కొమరంభీమ్‌ జిల్లా: జిల్లాలోని పెంచికల్‌పేట మండలం దరోగపల్లి గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తెకం గణపతి అనే వ్యక్తి తన భార్య శకుంతల(40)ని నడి రోడ్డుపై గొడ్డలితో నరికి చంపాడు. గ్రామస్తులు తిరగబడటంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

3250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles