రేపు మద్యం దుకాణాలు బంద్

Wed,May 22, 2019 06:58 PM

wine shops will be closed tomorrow

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకున్నది. ఏడు విడుతల్లో లోక్ సభ ఎన్నికలు ముగియగా.. ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. మే 23న అంటే రేపు కౌంటింగ్ జరగనున్న సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు.

రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 5.30కే కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకుంటారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 జిల్లాల్లో 35 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

3820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles