మేం గెలిస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం

Fri,November 9, 2018 02:58 PM

Will Rename Hyderabad As Bhagyanagar If BJP Wins says Raja singh

హైదరాబాద్: జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. హైదరాబాద్ నగర పేరుతో పాటు సికింద్రాబాద్, కరీంనగర్‌ల పేర్లను కూడా మార్చనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మొదట్లో భాగ్యనగర్‌గా పిలువబడేదన్న ఆయన.. ఎప్పుడైతే కులీ కుతుబ్ షాహీల పాలన ప్రారంభమైందో భాగ్యనగర్‌ను హైదరాబాద్‌గా మార్చినట్లు తెలిపారు. మొగల్స్, నిజాంలు పెట్టిన పేర్లను దేశం కోసం పనిచేసిన త్యాగధనుల పేర్లతో తిరిగి మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న యూపీలో సీఎం యోగి ఆదిత్యానాథ్ చర్యను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా.. ఫజియాబాద్‌ను ఆయోధ్యగా, మొగల్‌సరాయ్ రైల్వే స్టేషన్‌ను పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చినట్లు తెలిపారు. అదేవిధంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ వెల్లడించినట్లు చెప్పారు.

5785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles