వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్టు

Mon,March 18, 2019 09:54 PM

Wildlife hunters arrested in adilabad

ఇచ్చోడ : వన్యప్రాణుల వేటగాళ్లను ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కవ్వాల్ టైగర్ జోన్ సిరిచెల్మ అటవీ రేంజ్ అధికారి వాహబ్ అహ్మద్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిరిచెల్మ టైగర్ జోన్ రేంజ్ పరిధిలోని గోపాల్‌పూర్ శివారులో వన్యప్రాణులను వేటాడేందుకు ఉట్నూర్ మండలానికి చెందిన ముగ్గురు వేటాగాళ్లు సంచరిస్తున్నారని ముందస్తు సమాచారం అందింది. ఆ ప్రాంతంలో అటవీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గోపాల్‌పూర్ అటవీ శివారులో అటవీ జంతువులను వేట కోసం ఉచ్చులు బిగించి, వాటి రాక కోసం ముగ్గురు వేటగాళ్లు కూర్చుకున్నారు. వేటగాళ్లను గమనించి వారిని చాకచాక్యంగా అటవీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న వలలు, గొడ్డళ్లు, టార్చిలైట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని ఇచ్చోడ టైగర్ జోన్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. ఉట్నూర్ మండలం పట్టిగూడ గ్రామానికి చెందిన చీపెళ్లి ఎర్రన్న, పోశన్న, కొల్పు శ్రీనుగా గుర్తించారు. వన్యప్రాణుల వేట కోసమే వచ్చినట్లు వారు అంగీకరించారు. వేటగాళ్లను సోమవారం బోథ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు అటవీ రేంజ్ అధికారి వాహబ్ అహ్మద్ తెలిపారు. వేటగాళ్లను పట్టుకున్న వారిలో వాయిపేట్ ఎఫ్‌ఎస్‌వో ప్రేమ్‌సింగ్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారని ఆయన వివరించారు.

1437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles