టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేయాలి: కేటీఆర్

Sat,July 20, 2019 05:50 PM

Whoever gets the ticket must work all together says ktr

రాజన్న సిరిసిల్ల: పురపాలక ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలని టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. సిరిసిల్లలో నేడు జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పురపాలిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది సోమవారం తెలుస్తుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వార్డులన్నీ మనం గెలవాల్సిందేనని సూచించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో పోటీకి ఎవరు సమర్థులు అనే సమాచారం తన వద్ద ఉందని.. టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలన్నారు. నాలుగు రోజుల్లో అన్నీ వార్డుల్లో బూతు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిరిసిల్లలో ఉన్న 117 పోలింగ్ బూత్‌లకూ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పురపాలక చట్టంలో మార్పు వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేవారు ముందు పురపాలక చట్టం పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. ఇతరులకు సుద్దులు చెప్పి మనం అవినీతికి పాల్పడితే బాగుండదన్న ఆయన ఏవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles