పోస్టల్ బ్యాలెట్ ఎవరికి?

Mon,March 25, 2019 05:07 PM

who can use postal ballot in lok sabha election

ఎన్నికల కమిషన్ పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పోలింగ్ స్టేషన్లకు వెళి ఓటు వేయలేని వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. వీరు పోస్టల్ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే తాజా ఓటర్ల జాబితాలో వారిపేరు ఉండాలి.
తమకు ఓటుహక్కు ఉన్న నియోజకవర్గం పరిధిలో ఓటుహక్కు ఉన్న అధికారులకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) ఇస్తారు.వారు ఈడీసీని చూపి, డ్యూటీ చే సే పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

ఇతర నియోజకవర్గాల్లో పోలింగ్ విధుల్లో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ విని యోగించుకుని అవకాశం ఇస్తారు. వీరిలో పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది, సెక్టోరియల్ అధికారులు, డీఈఓలు, మైక్రో అబ్జర్వర్లు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పరిశీలకులు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, వారి కింద పనిచేసే సిబ్బంది. పోలీసు సిబ్బంది. డ్రైవర్లు, వంటవారు ఇలా ఎన్నికల విధుల్లో ఉన్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు.

ఇంకా పోలింగ్ నాడు పోలింగ్ విధుల్లో ఉన్న ఏజెంట్లు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే వారు ముందుగా ఫారం 12,ఫారం 12బీలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. వీరే కాకుండా సర్వీసు ఓటర్లు, స్పెషల్ ఓటర్లు, వారి భార్యలు, ప్రివెన్షివ్ డిటెన్షన్‌లో ఉన్నవారు, నోటిఫైడ్ ఓటర్లు. ఈకేటగిరిల్లోని ఓటర్లకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్సిమిటెడ్ పోస్టల్ బ్యాలట్ పేపర్ (ఈటీపీబీపీ) ఇస్తారు.

ఫారం-12


ఎన్నికల విధుల్లో ఉన్నవారు పీపీబీ కావాలంటే తనకు వచ్చిన అపాయింట్‌మెంట్ కాపీని జతపరిచి, వివరాలు నింపి, ఈపీఐసీ కాపీని జతపరిచి, ఇతర గుర్తింపు పత్రాలతో రెండో శిక్షణలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అనుకూల కేంద్రం (ఫెసిలేట్ సెంటర్)


ప్రతి శిక్షణ కేంద్రంలోనూ ఒక ఫెసిలేట్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. దీనికి ఒక అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న వారు ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పిస్తారు. బ్యాలెట్ పేపర్లు ముద్రణకాగానే రిటర్నింగ్ అధికారులు ఫారం 12 ప్రకారం బ్యాలెట్ పేపర్ పంపిణీకి చర్యలు తీసుకుంటారు. రిటర్నింగ్ అధికారి తయారైన పోస్టల్ బ్యాలెట్లను ఫెసిలిటీ సెంటర్‌కు పంపిస్తారు. ఈఫెసిలిటీ సెంటర్ ఇన్‌చార్జి వాటిని స్వీకరించి, ఉద్యోగులకు పంపించాల్సి ఉంటుంది. రెండో శిక్షణ సమయంలో ఫారం -12లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఏదైన కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ అందకపోతే 24 గంటల్లోగా రిజిస్టర్ పోస్టు ద్వారా వారికి పంపాల్సిఉంటుంది.

ఫెసిలియోషన్ సెంటర్ ఇన్‌చార్జి విధులు..


అనుకూల సెంటర్ (ఫెసిలిటీ సెంటర్)లో పోస్టల్ బ్యాలె ట్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వాలి. రాజకీయ పార్టీల తమ ప్రతినిధులను ఫెసిలియోషన్ సెంటర్లకు పంపించుకోవచ్చు. శిక్షణ పూర్తికాగానే మరో రెండు గంటల సమయాన్ని పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న అధికారులకు కేటాయించాలి. శిక్షణానంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు అనుకూల కేంద్రంలో ఉండి జరుగుతున్న ప్రక్రియను గమనించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.

ఓటింగ్‌కు ఏర్పాట్లు


ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఫెసిలిటేషన్ సెంటర్‌లో రహస్యంగా ఓటు వేసుకునేందుకు ఓ పోలింగ్ కంపార్ట్‌మెంట్ ఏర్పాట్లు చేయాలి. కవర్ ఏ అంటే ఫారం 13 బీ ఉన్న ఎన్వలప్ కవర్‌ను సీల్ చేసుకోవడానికి అవసరమైన సామగ్రి సమ కూర్చాలి. 13సీ ఎనోవలప్‌లో ఉన్న 13-ఏ డిక్లరేషన్‌పై అటెస్ట్ చేయడానికి ఒక గెజిటెడ్ అధికారిని అందుబాటులో ఉంటారు. ఆగెజిటెడ్ అధికారి ఓటరు గుర్తింపు కార్డులను , బ్యాలెట్ సీరియల్ నంబర్, ఓటరు సంతకం వంటివి సరిచూసి ధ్రువీకరించుకోవాలి.
అనుకూల కేంద్రానికి బాధ్యుడైన అధికారి ఓటరు తెచ్చిన ధ్రువీకరణ కార్డును చూచి, పోస్టల్ బ్యాలెట్‌ను ఇవ్వాలి. ఎవరకి ఏ బ్యాలెటు ఇచ్చారో నమోదు చేయాలి.
బ్యాలెట్ పేపరు కౌంటర్ ఫైల్ లో ఓటరు సీరియల్ నంబర్ రా యాలి. మార్కుడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్‌లో ఓటర్‌కు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినట్లుగా పీబీ అనే ముద్ర వేయాలి. ఇలా తయారైన ఓటర్ల జాబితానే పోలింగ్ స్టేషన్‌కు ఇవ్వాలి.

ఫెసిలియేషన్ సెంటర్‌లోనికి వెళ్లడానికి ముందు ఓటరు డిక్లరేషన్‌లో 13ఏలో ఓటరు తన పేరు, ఓటు సీరియల్ నంబర్ వేయాలి. కవర్ ఉన్న ఫారం -13బీలో మార్కు చేయాలి. గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. అనంతరం ఫారం -13 కవరుకు సీల్ చేసి, దానికి ఫెసిలియోషన్ సెంటర్‌లో బ్యాలట్ డ్రాప్ బాక్స్‌లో వేయాలి.ఫెసిలియోషన్ సెంటర్‌లో డ్రాప్ బాక్స్‌ను ఆర్‌ఓ కస్టడీలో నిర్ణయించిన సమయం వరకు ఉంచాలి. దీనిని అక్కడ ఉన్న ఏజెంట్ల సమక్షంలో సీలు చేసి, కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు.కౌంటింగ్‌కు గంట ముందు దీనిని అభ్యర్థులు,ఏజెంట్ల సమక్షంలో తెరిచి, లెక్కిస్తారు.

1541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles