ఎన్జీవోస్ కాలనీలో వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం

Thu,February 2, 2017 09:44 PM

Wellness center at NGOs Colony

హైదరాబాద్ : వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీలో ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం వెల్‌నెస్ సెంటర్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. త్వరలోనే కూకట్‌పల్లి, మలక్‌పేటతో పాటు జిల్లా కేంద్రాల్లోనూ వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ఖైరతాబాద్‌లో ప్రారంభించిన వెల్‌నెస్ సెంటర్ అద్భుతంగా నడుస్తుందని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబాలకు వైద్యం అందుతుందన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీం కోసం ఆరోగ్యశ్రీలో ప్రత్యేకంగా సీఈవోను నియమించామని చెప్పారు. ఈ స్కీం వివరాలు అందించడానికి ఒక యాప్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

1208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles