రేపటి నుంచి మెడికల్ పీజీ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు

Thu,April 4, 2019 10:03 PM

web options for medical pg seats from tomorrow

- కన్వీనర్ కోటా మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్


వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ద్వారా నిర్వహిస్తున్న మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కన్వీనర్ కోటాలో మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేశారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోందని కాళోజీ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిదిలోని వైద్య కళాశాలలతో పాటు నిమ్స్‌లో ప్రవేశాల కోసం ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 3న ముగియడంతో తుది జాబితాను విడుదల చేసినట్లు వారు పేర్కొన్నారు.

ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఇతర వివరాలకు www.knruhs.in వెబ్‌సైట్‌లో చూడాలని వారు సూచించారు.

793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles