ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా కోరుతాం: ఎంపీ అసద్‌

Sat,June 8, 2019 02:50 PM

We will request the speaker to give AIMIM the post of leader of opposition

హైదరాబాద్‌: ఎంఐఎంకు ప్రతిపక్షహోదా కోరుతూ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కలవనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం అవతరించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కన్నా ఎంఐఎంకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఇదే విషయాన్ని సభాపతిని కలసి వివరించి సభలో ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందిగా విన్నవిస్తామన్నారు. స్పీకర్‌ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.

1461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles