అకాల వ‌ర్షాల‌తో నష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకుంటాం..

Wed,April 17, 2019 08:27 PM

We will Help Farmers who loses crops in unseasonal rains says errabelli


వరంగల్ అర్బన్ : అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని పంచాయ‌తీరాజ్ శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు భరోసానిచ్చారు. అకాల వ‌ర్షాల‌తో త‌డిసిన ధాన్యాన్ని ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని, రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. వ్య‌వ‌సాయ‌, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సెల‌వులు పెట్ట‌వ‌ద్ద‌ని, అకాల వ‌ర్షాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన పంట న‌ష్టాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అంచనా వేసి ప్ర‌భుత్వానికి రిపోర్ట్ స‌మర్పించాల‌ని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. మార్కెటింగ్ అధికారులు రైతుల‌ను ఇబ్బందులకు గురిచేయ‌కుండా..అకాల వ‌ర్షాల‌తో త‌డిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఆదేశించారు.

2448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles